ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'బిగాస్' (BGauss) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన 'బిగాస్ డి15' (BGauss D15) ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 'డి15ఐ' (D15i) కాగా మరొకటి 'డి15 ప్రో' (D15 Pro). కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత ఇక్కడ తెలుసుకుందాం.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

బిగాస్ (BGauss) విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల విషయానికి వస్తే D15i ధర రూ. 99,999 మరియు D15 Pro ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఇప్పటికే బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున కొనుగోలు చేయాలనుకునే కష్టమర్లు కంపెనీ వెబ్ సైట్ సందర్శించి కేవలం రూ. 499 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

బుక్ చేసుకున్న తరువాత ఒకవేళ బుకింగ్ తరువాత ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపనట్లయితే బుకింగ్ ప్రైస్ మొత్తం కూడా వాపసు (రిటర్న్) చేయబడుతుంది. డెలివరీలు 2022 జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా దేశీయ మార్కెట్లోనే తయారైనట్లు కంపెనీ తెలిపింది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

బిగాస్ యొక్క D15 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌కి అనుసంధానించబడిన ఒకే ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులోని బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కూడా IP67 రేటింగ్‌ను కలిగి వాటర్ మరియు డస్ట్ నిరోధకతను కలిగి ఉంటాయి. కావున ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుందని కంపెనీ పేర్కొంది. అంటే కాకుండా ఇది ఒక పూర్తి ఛార్జ్ తో గరిష్టంగా 115 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా సర్టిఫైడ్ చేయబడింది. కావున వాస్తవ ప్రపంచంలో కూడా తప్పకుండా మంచి పరిధిని అందిస్తుంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క చార్జింగ్ విషయానికి వస్తే, ఇందులోని బ్యాటరీ ప్యాక్‌ 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి దాదాపు 5:30 గంటల సమయం పడుతుంది. కావున ఛార్జింగ్ టైమ్ విషయంలో కూడా కస్టమర్లు చింతించాల్సిన అవసరం లేదు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధునిక కాలంలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉండటానికి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉన్నాయి. ఇందులో పెద్ద 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కావున కఠినమైన రోడ్లపైన ప్రయాణించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే కాకూండా ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా యాక్సెస్ చేయగల కనెక్టివిటీ ఫీచర్‌లతో కూడిన ఫీచర్స్ ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

పైన తెలిపిన ఫీచర్స్ తో పాటు, రివర్స్ అసిస్ట్, కీలెస్ స్టార్ట్, సెంట్రలైజ్డ్ సీట్ లాక్, యుఎస్బి ఛార్జింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం, యాంటీ-థెఫ్ట్ మోటార్ లాకింగ్, డేటైమ్ రన్నింగ్ లైట్లు, కలర్ డిజిటల్ డిస్‌ప్లే, సైడ్ స్టాండ్ సెన్సార్, మొబైల్ యాప్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కావున వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనితో పాటు దాదాపు 20 సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

ఇదిలా ఉండగా బిగాస్ కంపెనీ తన ఉనికిని దేశవ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ షోరూమ్‌లను ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ఇప్పటికే కంపనీ దేశవ్యాప్తంగా 100 కి పైగా షోరూమ్‌లను కలిగి ఉంది.

దీనితోపాటు ప్రస్తుతం డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను అన్ని టైర్ I మరియు టైర్ II మార్కెట్‌లకు విస్తరించడం ద్వారా దాని పరిధిని విస్తరించాలని చూస్తోంది. అదే సమయంలో కంపెనీ యొక్క వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి మొబైల్ యాప్ సపోర్ట్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు పిక్ అండ్ డ్రాప్ వంటి సౌకర్యాలను అందిస్తోంది. బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులు తప్పకుండా ఇలాంటి అన్ని సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన BGauss ఎలక్ట్రిక్ స్కూటర్: ధర & వివరాలు

బిగాస్ కంపెనీ ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. అయితే ఇప్పుడు మార్కెట్లో ముచ్చటగా మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందా.. లేదా.. అనే విషయం త్వరలో తెలుస్తుంది. అప్పటివరకు ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లను గురించి సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Bgauss d15 electric scooter launched price range features details
Story first published: Monday, May 16, 2022, 18:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X