Bgauss నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్: అద్భుతమైన రేంజ్.. బుకింగ్స్ ప్రైస్ కూడా తక్కువే
భారతదేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమయంలో చాలామంది వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి, మరికొన్ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే పూణెకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు 'బిగాస్' (Bgauss) మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

దేశీయ విఫణిలో Bgauss కంపెనీ 'BG D15' అనే కోడ్‌నేమ్‌తో తన మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తుంది. త్వరలో రానున్న ఈ స్కూటర్ భారతీయ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండే విధంగా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండనుంది. ఇప్పటికే బిగాస్ కంపెనీ మార్కెట్లో A2 మరియు B8 అనే రెండు EV స్కూటర్‌లను విక్రయిస్తోంది. ఇవి మంచి ప్రజాదరణ కూడా పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు.
పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు మరో కొత్త స్కూటర్ విడుదల చేస్తుంది. త్వరలో విడుదల కానున్న ఈ EV యొక్క టీజర్ కూడా ఇప్పుడు విడుదల చేసింది. కంపెనీ యొక్క ఈ కొత్త స్కూటర్ వినియోగదారుల యొక్క భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు 20 కంటే కూడా ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఇందులో అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వినియోగదారుల యొక్క విశ్వసనీయతను పెంచడంలో సహాయపడతాయి.
Bgauss BG D15 ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో పెద్ద 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ పెద్ద అల్లాయ్ వీల్స్ మెరుగైన ట్రాక్షన్‌ను అందిస్తాయి, అంతే కాకుండా కఠినమైన రహదారుల్లో కూడా మంచి రైడింగ్ అనుభూతిని తప్పకుండా అందిస్తాయి.
కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మరింత ఆధునికంగా ఉంచడానికి పూర్తిగా మెటల్ బాడీతో ఎలక్ట్రిక్ స్కూటర్ నిర్మించడం జరిగింది. నిజంగానే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇది చాలా అరుదైన విషయం. ఇది చాలా ప్రీమియం అనుభూతిని తప్పకుండా అందిస్తుంది. అంతేకాకుండా, ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఆకర్షణీయమైన పెయింట్ స్కీమ్, గ్రాఫిక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది.
Bgauss BG D15 ఎలక్ట్రిక్ స్కూటర్ లోని టెలీస్కోపిక్ సస్పెన్షన్ కఠినమైన ఉపరితలాలపై కూడా మంచి రైడింగ్ చేయడానికి అనుమతిస్తుంది. దీనితోపాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల బ్రేకింగ్ సిస్టం మరింత షార్ప్ గా మరియు చాలా సమర్థవంతంగా ఉంటుంది. కావున రైడింగ్ సమయంలో బ్రేకింగ్ అద్భుతంగా ఉంటుంది.
బిగాస్ BG D15 ఇప్పుడు ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లతో కూడా వస్తుంది. ఈ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో డిస్టెన్స్-టు-ఎంప్టీ గేజ్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది మంచి రేంజ్ కూడా అందిస్తుంది. కావున వాహన వినియోగదారులను తప్పకుండా ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము.

కంపెనీ ఇప్పుడు త్వరలో విడుదల చేయనున్న కొత్త Bgauss BG D15 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు కేవలం 499 రూపాయలకే ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు. ఒకవేళ బుకింగ్ తరువాత ఈ స్కూటర్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపనట్లయితే బుకింగ్ ప్రైస్ మొత్తం కూడా వాపసు (రిటర్న్) చేయబడుతుంది.
కావున కొనుగోలుదారులు నిస్సంకోచంగా దీనిని బుక్ చేసుకోవచ్చు. దీనికోసం కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ 'బిగాస్ బిజి డి15' చూడవచ్చు.


Click it and Unblock the Notifications








