రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

క్రూయిజర్ మోటార్‌సైకిళ్లంటే ఇష్టపడే వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ (Thunderbird) సిరీస్ మోడళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు లీజర్ మోటార్‌సైక్లింగ్ విభాగంలో అత్యంత పాపులర్ అయిన ఈ మోడళ్లు, ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. కంపెనీ ఇందులో 350సీసీ మరియు 500సీసీ మోడళ్లను విక్రయించేది. ఎలాంటి అసౌకర్యం లేకుండా, సునాయాసంగా దూర ప్రయాణాలు చేయాలనుకునే వారు ఇందులో పెద్ద 500సీసీ థండర్‌బర్డ్ మోడల్‌ని ఎక్కువగా ఎంచుకునే వారు.

Recommended Video

Mahindra Scorpio Classic Launched In TELUGU | Price At Rs 11.99 Lakh | Variants & Features Explained

హిమాలయన్ రోడ్లపై ఈ థండర్‌బర్డ్ మోడళ్లు సాటిలేని పనితీరును అందించేవని నిరూపించబడ్డాయి. అయితే, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కారణంగా కంపెనీ ఈ పాత థండర్‌బర్డ్ మోడళ్లను డిస్‌కంటిన్యూ చేసింది. ఆ తర్వాత చాలా కాలం వరకూ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రూయిజర్ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టలేదు. అయితే, రెండేళ్ల క్రితం రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మీటియోర్ 350 మోడల్‌తో థండర్‌బర్డ్ 350 స్థానాన్ని భర్తీ చేసింది. కానీ, పెద్ద థండర్‌బర్డ్ స్థానాన్ని మాత్రం కంపెనీ ఇంకా భర్తీ చేయనేలేదు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మంచి క్రూయిజర్ మోటార్‌సైకిలే అయినప్పటికీ, దూర ప్రయాణాలు చేయడానికి అవసరమైన పవర్ ఈ ఇంజన్‌లో లేదనే చెప్పాలి. అందుకే, లీజర్ మోటార్‌సైకిల్ ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ఇందులో పెద్ద 650సీసీ మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. గడచిన జులై నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 మొదటిసారిగా కెమెరాకు చిక్కింది. ఇప్పుడు మరోసారి ఇదే మోడల్ భారత రోడ్లపై టెస్టింగ్‌లో ఉండగా కెమెరా కంటపడింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

తమిళనాడు టెస్టింగ్ నెంబర్ ప్లేట్‌తో చెన్నై వీధులలో తిరుగుతున్న పెద్ద మీటియోర్ 650 బైక్‌ని ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించాడు. ఈ లేటెస్ట్ స్పై ఫొటోలను చూస్తుంటే, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 మంచి రోడ్ ప్రజెన్స్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరైనా మొదటిసారిగా దీనిని చూస్తే, ఇది హ్యార్లీ డేవిడ్సన్ లాంటి బైక్ అని పొరపాటు పడే అవకాశం కూడా ఉంటుంది. అంతటి కమాండింగ్ స్ట్రీట్ ప్రెజెన్స్‌తో రాబోయే ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650, ఈ చెన్నై కంపెనీ యొక్క లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఆఫర్ కావచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

దానికి తోడు, రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 యొక్క స్పై షాట్‌ను విశ్లేషిస్తే, ఈ మోటార్‌సైకిల్ దాదాపుగా తుది ఉత్పత్తి రూపాన్ని పొందినట్లు మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ దీని సస్పెన్షన్ సెటప్‌ను చక్కగా ట్యూన్ చేసినట్లు తెలుస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ఎక్కువ మైళ్ల దూరం ప్రయాణించడానికి వీలుగా మరియు మంచి సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కలిగిన క్రూయిజర్ మోటార్‌సైకిల్ కోసం అనేక మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్ అద్భుతమైన మైల్-ముంచింగ్ సామర్థ్యాలతో చాలా రిలాక్స్డ్ టూరింగ్ మెషీన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 యొక్క పవర్ మరియు టార్క్ మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 యొక్క రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్‌లను మిళితం చేసి ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 ని అభివృద్ధి చేసినట్లుగా అనిపిస్తుంది. ఇది దేశంలోని క్రూయిజర్ మోటార్‌సైకిల్ ఔత్సాహికుల కోసం ఖచ్చితమైన టూరింగ్ మోటార్‌సైకిల్‌గా నిలిచే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

రాబోయే మీటియోర్ 650 అత్యంత ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌గా భావించబడుతున్నందున, ఇది ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల కంటే మరిన్ని అదనపు ప్రీమియం ఫీచర్లను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల లీకైన స్పై చిత్రాలు కూడా ఈ ప్రీమియం ఫీచర్‌లను నిర్ధారిస్తున్నాయి. వీటిలో ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లలో ఉపయోగించే సంప్రదాయ ఫోర్క్‌లకు బదులుగా ముందు భాగంలో ఉండే అప్‌-సైడ్‌-డౌన్ ఫోర్క్‌లు కూడా ఒకటి. అంతేకాకుండా, రాబోయే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్ వెనుక వైపు చాలా లావుగా ఉన్న టైరును కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్ ప్రస్తుత రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 మోటార్‌సైకిళ్లకు శక్తినిచ్చే అదే 650సిసి, పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 7,100rpm వద్ద 47bhp గరిష్ట శక్తిని మరియు 5,250rpm వద్ద 52Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి, ఈ గణాంకాలు సూపర్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్‌కు పుష్కలంగా సరిపోతాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

అయితే, ఈ మోటార్‌సైకిల్ యొక్క మరింత రిలాక్స్డ్ క్యారెక్టర్‌కు సరిపోయేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఇంజన్‌ని రీట్యూన్ చేసిందో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. అలాగే ఇందులోని 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కి కొన్ని చిన్నపాటి ట్వీక్‌లు మరియు స్లిప్ అసిస్ట్ క్లచ్‌ వంటి ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. ఇంకా ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మరియు ట్రిప్పర్ నావిగేషన్ మాడ్యూల్ వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించే అవకాశం ఉంది. ఈ మోటార్‌సైకిల్ యొక్క పరిమాణాన్ని బట్టి, రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 లో 20 లీటర్ల ఇంధన సామర్థ్యంతో కూడిన పెద్ద ఇంధన ట్యాంక్‌ ఉంటుందని సమాచారం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ 500కి రీప్లేస్‌మెంట్ కావాలా..? అయితే ఇదిగో మీటియోర్ 650..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 650 మోటార్‌సైకిల్ రెండు థీమ్‌లలో లభ్యమయ్యే అవకాశం ఉంది. వీటిలో ఒకటి పుష్కలంగా క్రోమ్‌తో నిండినది, మరొకటి బ్లాక్-అవుట్ థీమ్‌ను కలిగి ఉండేది. ఇక ధర విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క కొత్త మీటియోర్ 650 మోటార్‌సైకిల్‌ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ. 3.00 లక్షల రేంజ్ లో ఉండొచ్చని అంచనా. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Source: Rushlane

Most Read Articles

English summary
Bigger and better royal enfield meteor 650 coming soon spotted while testing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X