రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ కోసం బ్లాక్ సిరీస్ అడ్వెంచర్ కిట్ విడుదల, వివరాలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ అందిస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ (Royal Enfield Himalayan) కోసం బ్లాక్ సిరీస్ అడ్వెంచర్ కిట్ (Black Series Adventure Kit) పేరుతో కంపెనీ ఓ ప్రత్యేక యాక్ససరీ కిట్‌ను విడుదల చేసింది. ఈ స్పెషల్ కిట్ లో భాగంగా ఒక జత అల్యూమినియం ప్యానియర్‌లు (26 లీటర్ల నిల్వ సామర్థ్యం), ప్యానియర్ మౌంట్‌లు, హ్యాండ్‌గార్డ్‌లు, మాస్టర్ సిలిండర్ గార్డ్, ఇంజన్ గార్డ్ మరియు ఆయిల్ కూలర్ గ్రిల్ ను అందిస్తోంది. అయితే, ఈ బ్లాక్ సిరీస్ అడ్వెంచర్ కిట్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ మార్కెట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో ఈ కిట్ విడుదలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ భారత మార్కెట్ తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అమ్ముడవుతోంది. వాటిలో ఆస్ట్రేలియన్ మార్కెట్ కూడా ఒకటి. ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదల చేయబడిన ఈ స్పెషల్ బ్లాక్ సిరీస్ కిట్ వాస్తవ ధర 2,020 ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ.1.12 లక్షలు). కాగా, కంపెనీ ఆస్ట్రేలియాలో ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా దీనిని 1,290 ఆస్ట్రేలియన్ డాలర్లకే (దాదాపు రూ.72,000) అందిస్తోంది.

బ్లాక్ సిరీస్ అడ్వెంచర్ కిట్ సాయంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్ యొక్క సౌందర్య ఆకర్షణను మరింత మెరుగుపరచడానికి, పేరు సూచించినట్లుగానే లిస్ట్ చేయబడిన అన్ని యాక్ససరీలు కూడా మ్యాట్ బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి. ప్యానియర్లు 18 మిమీ మైల్డ్ స్టీల్‌తో తయారు చేయబడ్డాయి మరియు పౌడర్-కోటెడ్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి. వాటి లోపల ఉండే సామాను సురక్షితంగా ఉంచడానికి ఇవి లాక్ చేయగల మూతలను కూడా కలిగి ఉంటాయి.

ఈ యాక్ససరీ ప్యాక్ లో భాగమైన ఇంజన్ గార్డులు 25 మిమీ తేలికపాటి ఉక్కు ట్యూబ్‌లతో తయారు చేయబడ్డాయి, అదనపు మన్నిక కోసం ఇవి తుప్పు-నిరోధక కోటింగ్ ను కూడా కలిగి ఉంటాయి. ఇకపోతే, హ్యాండ్ గార్డులు ప్రమాదవశాత్తు బైక్ క్రింద పడినప్పుడు బ్రేక్ మరియు క్లచ్ లివర్‌లను దెబ్బతినకుండా రక్షిస్తాయి మరియు రోడ్డుపై ఉన్నప్పుడు రైడర్ పిడికిలికి రక్షణ కవచంలా ఉంటాయి. మాస్టర్ సిలిండర్ గార్డు మరియు ఆయిల్ కూలర్ గార్డ్ రెండూ చెత్త నుండి రక్షణను అందిస్తాయి

భారత మార్కెట్లో విక్రయించబడుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ కు మరియు గ్లోబల్ మార్కెట్లలో విక్రయించబడుతున్న హిమాలయన్ కు డిజైన్ మరియు ఇంజన్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. ఇందులో అదే 411 సిసి, ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్ లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇందులో స్పీడోమీటర్, టాకోమీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ కోసం అనలాగ్ డయల్స్‌తో పాటు డిజిటల్ కంపాస్ మరియు ట్రిప్/ఓడోమీటర్ కోసం ఎల్‌సిడి రీడౌట్ ఉంటుంది. ఆస్ట్రేలియాలో విక్రయించబడుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో కూడా ట్రిప్పర్ నావిగేషన్ అందుబాటులో ఉంటుంది. దీని సస్పెన్షన్ సెటప్ ఇండియా-స్పెక్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. ఇందులో ముందు వైపున 41 మిమీ ట్రెడిషనల్ ఫోర్కులు మరియు వెనుకవైపు 5-వే అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. ఇది ముందువైపున 300 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 240 మిమీ డిస్క్ బ్రేక్ లతో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350)లో కొత్త కలర్ ఆప్షన్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ కంపెనీ విక్రయిస్తున్న క్రూయిజర్ బైక్ మీటియోర్ 350 (Meteor 350) లో కంపెనీ ఇప్పుడు మూడు కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం, మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350) ఫైర్‌బాల్, స్టెల్లార్ మరియు సూపర్‌నోవా అనే మూడు ట్రిమ్స్‌లో లభిస్తుంది. ఇందులో కొత్తగా ప్రారంభించబడిన కలర్ ఆప్షన్లలో ఫైర్‌బాల్ బ్లూ, ఫైర్‌బాల్ మ్యాట్ గ్రీన్ మరియు సూపర్‌నోవా రెడ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

గతంలో అందించిన ఫైర్‌బాల్ ఎల్లో మరియు ఫైర్‌బాల్ రెడ్ కలర్ ఆప్షన్ల మాదిరిగానే రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 లోని కొత్త మ్యాట్ గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా బ్లాక్డ్-అవుట్ థీమ్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో చక్రాలపై ఆకుపచ్చ స్ట్రిప్ కూడా ఉంటుంది, ఇది మోటార్‌సైకిల్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్‌ని తెచ్చి పెడుతుంది. అలాగే, ఇందులో కొత్తగా ప్రారంభించబడిన బ్లూ కలర్ ఆప్షన్ కూడా బ్లాక్-అవుట్ థీమ్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో బ్యాడ్జింగ్ మరియు చక్రాలపై ఉన్న స్ట్రిప్ పసుపు రంగులో కనిపిస్తుంది.

ఈ రెండు కలర్ ఆప్షన్లతో పాటుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్‌నోవా రెడ్ కలర్ ఆప్షన్ ను కూడా విడుదల చేసింది. కొత్త 2022 మోడల్ మీటియోర్ 350లో ఈ కలర్ మార్పు మినహా కంపెనీ ఇందులో వేరే ఏ ఇతర మార్పులు చేయలేదు. మెకానికల్ మరియు ఫీచర్ల పరంగా ఇది మునుపటిలానే ఉంటుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








