క్రమంగా పెరుగుతున్న BMW G 310 RR సేల్స్ - వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ దేశీయ మార్కెట్లో తన 'జి 310 ఆర్‌ఆర్‌' బైకుని ఈ సంవత్సరం జులై నెలలో విడుదల చేసింది. అయితే కంపెనీ ఈ బైకుని లాంచ్ చేసిన కేవలం మూడు నెలల్లో 1,500 యూనిట్లను విక్రయించగలిగింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ భారతీయ మార్కెట్లో తన 2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైకుని రూ. 2.85 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. కాగా 'బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ స్టైల్ స్పోర్ట్ వేరియంట్' ధర రూ.2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైక్ ఆధునిక ఫీచర్స్ పొందటమే కాకుండా ఇది రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి వైట్ మరియు బ్లాక్ కలర్స్.

క్రమంగా పెరుగుతున్న BMW G 310 RR సేల్స్

2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైక్ బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, రేక్డ్ విండ్‌స్క్రీన్, గోల్డెన్ కలర్ లో USD ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ఎల్ఈడీ టైల్‌లైట్‌ వంటి వాటిని పొందుతుంది. మొత్తం మీద ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 5-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి కావాల్సిన సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది.

2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైక్ 312.2 సిసి లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన సింగిల్-సిలిండర్ ఇంజన్‌ని పొందుతుంది. ఇది 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 33.52 బిహెచ్‌పి పవర్ మరియు 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 27.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇహ్ది కేవలం 6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ట్రాక్, అర్బన్, రెయిన్ మరియు స్పోర్ట్స్ మోడ్స్. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో షోవా USD ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్‌తో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ పరంగా ముందు వైపున 300 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ నిజానికి 'జి310 ఆర్‌ఆర్' లేటెస్ట్ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ఇప్పటికే ప్రారంభించింది. కావున ఈ కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ బైక్ యొక్క డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త బైకుని మొదట బుక్ చేసుకున్న వారికి ముందుగా డెలివరీ చేయబడతాయి.

కొత్త బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ దేశీయ మార్కెట్లో టీవీఎస్ అపాచే ఆర్ఆర్310, కెటిఎమ్ ఆర్‌సి 390 మరియు క్వాసాకి నింజా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున కంపెనీ యొక్క ఈ బైక్ ఈ బైక్ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ కంపెనీ ఇప్పటికే మంచి స్థాయిలో బుకింగ్స్ పొందుతోంది. రానున్న రోజుల్లో తప్పకుండా మరిన్ని మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

మార్కెట్లో రోజు రోజుకి కొత్త వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ తో ప్రస్తుతం వినియోగదారులను ఆకర్శించే విధంగా ఉన్నాయి. కావున ప్రస్తుతం మార్కెట్లో కొత్త వాహనాలు కూడా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, December 15, 2022, 6:30 [IST]
English summary
Bmw g 310 rr sales 1500 units details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+