కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

భారతీయ మార్కెట్లో 'బిఎండబ్ల్యు మోటొరాడ్' (BMW Motorrad) కంపెనీ తన 2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైకును గత జులై నెలలో అధికారికముగా లాంచ్ చేసింది. కంపెనీ ఈ లగ్జరీ బైకుని లాంచ్ చేసిన కేవలం 100 రోజుల్లో ఏకంగా 1000 యూనిట్ల బైకులను డెలివరీ చేసినట్లు తెలిపింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం BMW G 310 RR బైక్ యొక్క డెలివరీలను కేవలం 100 రోజుల్లోనే 1000 మంది కస్టమర్లకు డెలివరీ చేసినట్లు తెలిసింది. ఇది నిజంగానే కంపెనీ అతి తక్కువ కాలంలో సాధించిన గొప్ప విజయం అనే చెప్పాలి. మార్కెట్లో ఈ కొత్త బైకుకి ఎంత ఆదరణ ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

'బిఎండబ్ల్యు మోటొరాడ్' ఇప్పటికే ఈ 2022 BMW G 310 RR కోసం 2200 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు తెలిపింది. కాగా మిగిలిన డెలివరీలు కూడా త్వరలోనే ప్రారంభమవవుతాయి. దేశీయ మార్కెట్లో ఈ బైకు ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్).

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

BMW 310 మోడల్ సిరీస్‌లో రెండు మోటార్‌సైకిల్స్ విడుదలయ్యాయి. అవి BMW G 310 R మరియు BMW G 310 GS. ఇందులో BMW G 310 GS అనేది అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఈ రెండుమోటార్‌సైకిల్స్ కూడా ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతాయి.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

"బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్" యొక్క ఈ కొత్త బైక్స్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి వైట్ మరియు బ్లాక్ కలర్స్. ఇవి రెండూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ బైకులో బై-ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, రేక్డ్ విండ్‌స్క్రీన్, గోల్డెన్ కలర్ లో USD ఫ్రంట్ ఫోర్క్స్ మరియు ఎల్ఈడీ టైల్‌లైట్‌ వంటి వాటిని పొందుతుంది. మొత్తం మీద ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 5-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది బైక్ గురించి కావాల్సిన సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

2022 బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైక్ 312.2 సిసి లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ని పొందుతుంది. ఇది 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 33.52 బిహెచ్‌పి పవర్ మరియు 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 27.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో నాలుగు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి ట్రాక్, అర్బన్, రెయిన్ మరియు స్పోర్ట్స్ మోడ్స్. ఈ బైక్ కేవలం 6 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

ఈ బైక్ యొక్క సస్పెన్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ముందు భాగంలో షోవా USD ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్‌తో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఛాసిస్‌ను కలిగి ఉంది. కావున ఎలాంటి రోడ్డులో అయినా రైడ్ చేయడానికి అనుమతిస్తుంది.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు వైపున 300 మిమీ డిస్క్ బ్రేక్స్ మరియు వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్స్ అందించింది. అంతే కాకుండా ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ప్రామాణికంగా అందుబాటులో ఉంటుంది. కావున బ్రేకింగ్ చాలా అద్భుతంగా మరియు షార్ప్ గా ఉంటుంది.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

2022 BMW G310 RR బైక్ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. అయితే డెలివరీలు ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు ముందుగా అందించనున్నారు. కావున డెలివరీలలో ఆలస్యం అయ్యే అవకాశం లేదు.

కంపెనీకి మహర్దశ పట్టింది.. G 310 RR డెలివరీలలో దూసుకెళ్తున్న BMW Motorrad

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో బిఎండబ్ల్యు మోటొరాడ్ తన కొత్త BMW G310 RR బైకుని లాంచ్ చేసిన ఇంకా నాలుగు నెలలు కూడా కాలేదు, అప్పుడే 1000 యూనిట్లను విక్రయించగలిగింది, దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాల్లో మంచి పురోగతిని సాధిస్తోందని తెలుస్తోంది. అయితే దేశీయ మార్కెట్లో ఈ బైక్ టీవీఎస్ అపాచే ఆర్ఆర్310, కెటిఎమ్ RC 390 మరియు కవాసకి నింజా 300 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, October 28, 2022, 10:14 [IST]
English summary
Bmw motorrad delivers 1000 units of new g 310 rr motorcycles in 100 days details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+