ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

'బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఇండియా' (BMW Motorrad India) దేసియా మార్కెట్లో నాలుగు టూరింగ్ లైన్ బైక్‌లను విడుదల చేసింది. ఈ కొత్త బైకులు ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం రండి.

ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

'బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్' విడుదల చేసిన బైకులు & ధరలు

 • బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్‌టి (BMW R 1250 RT): రూ. 23.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
 • బిఎమ్‌డబ్ల్యూ కె 1600 జిటిఎల్ (BMW K 1600 GTL): రూ. 32 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
 • బిఎమ్‌డబ్ల్యూ కె 1600 బాగర్ (BMW K 1600 Bagger): రూ. 29.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
 • బిఎమ్‌డబ్ల్యూ కె 1600 గ్రాండ్ అమెరికానా (BMW K 1600 Grand America): రూ. 33 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)
 • ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

  కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్‌టి (BMW R 1250 RT) ఇప్పుడు కొత్త ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు ఫుల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో అప్‌డేట్ చేయబడింది. అయితే ఇంజిన్ మాత్రం దాని R 1250 GS లో ఉన్న మాదిరిగానే ఉంటుంది. కావున ఇందులో 1,254 సిసి హారిజాంటల్ ఆపొసిడ్ ట్విన్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 134 హెచ్‌పి పవర్‌ మరియు 6,250 ఆర్‌పిఎమ్ వద్ద 143 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

  ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

  ప్రస్తుతం వినియోగదారులు కోరుకునే దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్ మరియు క్రీచర్ కంఫర్ట్‌లతో ఉన్న గిల్స్‌ వంటివి ఉన్నాయి. ఇందులో 120/70 సెక్షన్ ఫ్రంట్ టైర్ మరియు 180/55 సెక్షన్ రియర్ టైర్‌ ఉంటుంది. అయితే ఇందులో 17-ఇంచెస్ రిమ్స్ లభిస్తాయి.

  ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

  ఇప్పుడు ఇందులోని కె 1600 సిరీస్ బైకుల విషయానికి వస్తే, ఇవన్నీ కూడా ఇన్‌లైన్-సిక్స్ సిలిండర్ మోటార్‌సైకిళ్లు. కావున ఇవి 1,649 సిసి సిక్స్-సిలిండర్ ఇంజన్ పొందుతాయి. ఇంజిన్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 160 హెచ్‌పి పవర్‌ మరియు 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 180 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

  ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

  కె1600 సిరీష్ లో తక్కువ బరువున్న బైక్ కె 1600 బి, దీని బరువు 344 కేజీల వరకు ఉంటుంది. అయితే మిగిలిన రెండు (K 1600 GTL మరియు BMW K 1600 Grand America) బైకుల బరువు కొంత ఎక్కువగా ఉంటుంది. ఇవి 17-ఇంచెస్ కాస్ట్ అల్లాయ్ రిమ్స్ కలిగి, ముందువైపు 120/70 టైర్ మరియు వెనుక వైపున 190/55 టైర్‌ పొందుతుంది. మొత్తం మీద ఇవి మంచి పనితీరుని అందిస్తాయి.

  ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

  BMW ఇండియా ఇప్పుడు ఈ బైకులను కొనుగోలు చేయడానికి ఫైనాన్షియల్ సర్వీస్ స్కీమ్ కూడా అందిస్తోంది. దీని సాయంతో కొనుగోలుదారులు సులభంగా కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో కంపెనీ మూడు సంవత్సరాల వారంటీ కూడా అందిస్తుంది. ఆసక్తి గల కస్టమర్‌లు అదనపు ధరతో వారంటీని నాలుగు మరియు ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. కస్టమర్లు 24X7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా పొందుతారు.

  ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

  ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త BMW మోటోరాడ్ బైకులు ఢిల్లీ (లుటియన్స్ మోటోరాడ్), ముంబై (నవ్‌నిట్ మోటార్స్), థానే (థానే మోటోరాడ్), చెన్నై (కున్ మోటోరాడ్), బెంగళూరు (టస్కర్ మోటోరాడ్), అహ్మదాబాద్ (గాలప్స్ ఆటోహాస్), కొచ్చి (EVM ఆటోక్రాఫ్ట్), హైదరాబాద్ (JSP మోటోరాడ్), ఇండోర్ (మ్యూనిచ్ మోటార్స్), లక్నో (స్పీడ్ మోటార్స్), చండీగఢ్ (కృష్ణా ఆటోమొబైల్స్), జైపూర్ (ప్రతాప్ మోటోరాడ్) ), రాయ్‌పూర్ (మంధన్ మోటార్స్), కటక్ మరియు కోల్‌కతా (OSL ప్రెస్టీజ్) మరియు రాంచీ (టైటానియం ఆటో), పూణే (బవేరియా మోటార్స్)లో ఉన్న కంపెనీ యొక్క ప్రీమియం డీలర్ నెట్‌వర్క్ ద్వారా విక్రయించబడుతుంది. కావున ఆసక్తిగల కస్టమర్లు వీటిని కొనుగోలు చేయవచ్చు.

  ఖరీదైన టూరింగ్ బైకులు విడుదల చేసిన BMW Motorrad: ధరలు & వివరాలు

  డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

  భారతీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త ప్రీమియం బైకులకు ఆదరణ పెరుగుతున్న సమయంలో కంపెనీ ఈ బైకులను విడుదల చేయడం వల్ల మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. కంపెనీ యొక్క ఈ బైకులు మార్కెట్లో హోండా గోల్డ్ వింగ్ , ఇండియన్ రోడ్‌మాస్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Bmw motorrad india launches its new touring range details
Story first published: Thursday, August 18, 2022, 10:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X