విడుదలకు ముందే ప్రారంభమైన BMW G310 RR బుకింగ్స్: ఇక లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ "బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్" (BMW Motorrad) భారతీయ మార్కెట్లో తన కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్' (BMW G310 RR) మోటార్‌సైకిల్‌ను విడుదల చేయటానికి సన్నద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ కొత్త బైక్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ విడుదల చేయనున్న ఈ కొత్త బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఆన్‌లైన్‌లో లేదా కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త బైక్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ కంపెనీ దేశీయ మార్కెట్లో నిరంతరం తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతీయ మార్కెట్ కోసం BMW G310 RR బైక్ తీసుకురానుంది. ఈ బైక్ భారతీయ మార్కెట్లో 2022 జులై 15 న అధికారికంగా విడుదలకానున్నట్లు కంపెనీ తెలిపింది. కావున బుక్ చేసుకునే కస్టమర్లకు త్వరలోనే డెలివరీలు కూడా అందించబడతాయి. మొదటి బుక్ చేసుకున్న వారికి ముందుగా డెలివరీ చేయబడతాయి. కస్టమర్లు దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ బైక్ కొనుగోలు కోసం కంపెనీ అద్భుతమైన ఫైనాన్స్ స్కీమ్స్ కూడా తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కేవలం రూ. 3,999 ఈఎమ్ఐ ద్వారా కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇది వాహన కొనుగోలుదారులకు చాలా సహాయపడుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ బైక్ అనేది భారతదేశంలో ఎంట్రీ-లెవల్ ప్రీమియం మోటార్‌సైకిల్‌గా పరిగణించబడుతుంది. ఇప్పటికి కంపెనీ ఈ బైక్ కి సంబంధించి విడుదల చేసిన కొన్ని టీజర్ చిత్రాలను మనం గమనించినట్లయితే ఇది చాలా వరకు 'టీవీఎస్ అపాచే ఆర్ఆర్310' (TVS Apache RR310) ని గుర్తుకు తెస్తుంది. ఎందుకంటే ఈ రెండు బైకులు కూడా చాలా దగ్గర పోలికలకు కలిగి ఉంటాయి.

ఈ రెండు బైకులు డిజైన్ మరియు ఫీచర్స్ లో కొంత దగ్గర పోలికలు కలిగి ఉన్నప్పటికి పవర్‌ట్రెయిన్ మరియు సస్పెన్షన్ వంటి వాటిలో కొంత తేడా ఉండే అవకాశం ఉంటుంది. అపాచీ ఆర్ఆర్310 మోటార్‌సైకిల్ కంపెనీ కూడా బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్ చాలా ప్రీమియంగా ఉంటుంది.

ఇప్పటికి విడుదలైన టీజర్ చిత్రాల ప్రకారం దీని ఎక్స్టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది బ్లూ మరియు రెడ్ కలర్ తో కూడిన M స్టైల్ గ్రాఫిక్స్ పొందటంతోపాటు, బ్రాండ్ యొక్క సిగ్నేచర్ వైట్ పెయింట్ కూడా పొందుతుంది. కావున ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

ఇక కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్' బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో అపాచే ఆర్ఆర్310 బైక్ లో ఉండే 313 సిసి సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉండనుంది. ఇది 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 34 బిహెచ్‌పి పవర్ మరియు 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 27.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

భారతీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త 'బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్‌ఆర్' (BMW G310 RR) బైక్ యొక్క ధరను కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. కావున లాంచ్ సమయంలో ధర మరియు ఇతర వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి. ఈ బైక్ దేశీయ మార్కెట్లో ప్రధానంగా టీవీఎస్ కంపెనీ యొక్క అపాచే ఆర్ఆర్310 కి ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా కవాసకి నింజా 300 మరియు కెటిఎమ్ ఆర్‌సి 390 వంటి వాటికి కూడా ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








