టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

జర్మన్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ (BMW Motorrad) తమ టూవీలర్లలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే, తాజాగా డ్రైవర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మరియు సర్దుబాటు చేయడానికి వీలుండేలా ఓ ప్రత్యేకమైన సీటును డిజైన్ చేసింది. త్వరలోనే ఇది కంపెనీ విక్రయిస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహనాల్లో కూడా అందుబాటులోకి రానుంది.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

సర్దుబాటు చేయగల సీట్లు (అడ్జస్టబల్ సీట్స్) ఇప్పటి వరకూ కార్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే, ఇప్పుడు ఇవి తాజాగా టూవీలర్లలో కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ తమ మోటార్‌సైకిళ్ల కోసం సర్దుబాటు చేయగల సీటును అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉంది. ఇంటర్నెట్ లో లీక్ అయిన సమాచారం ప్రకారం, కంపెనీ తమ ద్విచక్ర వాహనం కోసం నిర్మించనున్న ఈ ఎక్స్‌క్లూజివ్ సీటు ఎలాంటి డిజైన్‌తో తయారు చేయబోతున్నారనే చిత్రం ఒకటి బయటకు వచ్చింది.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

ఈ లీక్ ఆధారంగా, BMW యొక్క నాణ్యమైన ఉత్పత్తి గురించి సమాచారం బయటి ప్రపంచానికి లీక్ చేయబడింది. అంతేకాకుండా, ఈ సీట్ సర్దుబాటు చేయగలిగేలా ఉంటుందని తెలిసింది. సాధారణంగా, సర్దుబాటు చేయగల సీటు ఎత్తు మరియు ముందు మరియు వెనుక చలనశీలతను కలిగి ఉంటుంది. అయితే బిఎమ్‌డబ్ల్యూ తయారు చేస్తున్న సీటును రైడర్ల సౌకర్యానికి అనుగుణంగా వెడల్పును కూడా మార్చుకునే సౌలభ్యంతో రూపొందుతున్నట్లు సమాచారం.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

టూవీలర్లలో ఇలాంటి ప్రత్యేకమైన సౌకర్యం కల్పించడం ఇదే తొలిసారి. ఇది రైడర్ల శారీరక సౌష్టవాన్ని బట్టి, వారికి తగినట్లుగా సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఇందుకోసం కంపెనీ మూడు భాగాలుగా విభజించి సిస్టమ్‌ను రూపొందించింది. వీటిలో ఒకటి మాత్రమే (మధ్యలో) ఇంధన ట్యాంక్‌కు జోడించబడింది. మిగిలిన రెండు కుడి-ఎడమ వంటి బాహ్య దిశలో కదలడానికి వీలుగా రూపొందించబడ్డాయి. దీని ద్వారా BMW రైడర్లకు అదనపు సీటింగ్‌ను అందించనుంది.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

సీటు పరిమాణాన్ని అవసరమైన విధంగా విస్తరించిన తర్వాత, ఆ పరిమాణాన్ని స్థిరీకరించడానికి లాకింగ్ సదుపాయం కూడా అందించబడుతుంది. అందువల్ల, భవిష్యత్తులో మరింత ఆసక్తిగల రైడర్‌లకు ఈ ఆవిష్కరణ మరింత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. బిఎమ్‌డబ్ల్యూ తమ తదుపరి తరం ఆర్1255జిఎస్ బైక్‌లో ఈ ఫీచర్-ప్యాక్డ్ సీటును పరిచయం చేయాలని భావిస్తున్నారు.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

దూర ప్రయాణాలను ఇష్టపడే వారికి ఇది చాలా ఇష్టమైన మోటార్‌సైకిల్. అందుకే ఈ బైక్‌పై బిఎమ్‌డబ్ల్యూ అడ్జస్టబుల్ సీట్‌ని అందించాలని చూస్తోంది. అదే సమయంలో, BMW తన వినియోగదారులకు మరింత లగ్జరీని అందించే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని కూడా తీవ్రతరం చేయడం ప్రారంభించింది. గత ఏడాది చివరి నుంచి కంపెనీ ఈ విషయంపై తీవ్రంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే, నవంబర్ 2021లో, బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ తమ కాన్సెప్ట్ మోడల్ సిఈ-04 (BMW CE-04) ఉత్పత్తిని ప్రారంభించింది.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 42 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్ మరియు 8.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుందని నివేదించబడింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో వెళ్లగలదు. అలాగే, ఈ సిఈ04 ఎలక్ట్రిక్ స్కూటర్ 3 సెకన్ల కంటే తక్కువ సమయంలో గంటకు 0 నుండి 50 మైళ్ల వేగాన్ని అందుకోగలదు. అదనంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 130 కి.మీ దూరం వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

ఇక భారతదేశంలో BMW Motorrad బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ భారత మార్కెయిలో తమ కొత్త బిఎమ్‌డబ్ల్యూ సి 400 జిటి (BMW C 400 GT) అనే మాక్సి స్టైల్ స్కూటర్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త మాక్సి-స్కూటర్‌ ధర రూ. 9.95 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో మాక్సీ స్కూటర్లకు డిమాండ్ స్వల్పంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, బిఎమ్‌డబ్ల్యూ మోటార్ తమ మాక్సీ స్కూటర్ ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, దేశంలోనే అత్యంత ఖరీదైన మాక్సీ స్కూటర్ గా నిలిచింది.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

బిఎమ్‌డబ్ల్యూ సి 400 జిటి మాక్సీ స్కూటర్ ఆల్పైన్ వైట్ మరియు స్టైల్ ట్రిపుల్ బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ డిజైన్ చాలా విశిష్టంగా ఉంటుంది. ప్రత్యేకించి, ఇది కంఫర్ట్ ఓరియెంటెడ్ మరియు ఇది మంచి రైడింగ్ పొజిషన్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ దూర ప్రయాణాలకు చాలా సౌకర్యవంతగా ఉంటుంది. పొడవైన విండ్‌స్క్రీన్, పుల్-బ్యాక్ హ్యాండిల్‌బార్, పెద్ద స్టెప్ సీట్ మరియు డ్యూయల్ ఫుట్‌రెస్ట్‌ వంటి డిజైన్ ఎలిమెంట్స్ తో ఇది చాలా అగ్రెసివ్ గా కనిపిస్తుంది.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

ఈ స్కూటర్ లో లభించే కొన్ని ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ మరియు రైడ్ అసిస్ట్ ఫీచర్లను పరిశీలిస్తే, ఇందులో ఫుల్లీ ఎల్ఈడి లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, హీటెడ్ గ్రిప్స్, హీటెడ్ సీట్లు, ఏబిఎస్, యాంటీ-థెఫ్ట్ అలారం సిస్టమ్ మరియు బ్లూటూత్-ఎనేబుల్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ఇవే కాకుండా, ఇందులో రైడ్-బై-వైర్ థ్రోటల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు మొదలైనవి ఉన్నాయి.

టూవీలర్లలో సర్దుబాటు చేయగల సీట్ టెక్నాలజీని పరిచయం చేయనున్న బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్

ఇక ఇంజన్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి మాక్సి స్కూటర్ లో శక్తివంతమైన ఇంజన్ ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ లో 350 సిసి, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 35 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ పరంగా కొత్త బిఎమ్‌డబ్ల్యూ సి400జిటి భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన స్కూటర్ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, January 24, 2022, 17:23 [IST]
English summary
Bmw motorrad to introduce a seat that can be adjusted sideways in two wheelers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+