భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త BMW S 1000 RR: ధర, వేరియంట్స్ & వివరాలు

బిఎండబ్ల్యు మోటొరాడ్ (BMW Motorrad) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన 'ఎస్ 1000 ఆర్ఆర్' బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త 'బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్' గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ ప్రారంభ ధరలు (స్టాండర్డ్ వేరియంట్) రూ. 20.25 లక్షలు, మిడ్-స్పెక్ ప్రో వేరియంట్ ధర రూ. 22.15 లక్షలు మరియు టాప్ వేరియంట్ ప్రో ఎమ్ స్పోర్ట్ ధర రూ. 24.45 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా రూ. 50,000 ఎక్కువ ధర కలిగి ఉంటాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త BMW S 1000 RR

కొత్త బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ 999సిసి, ఇన్‌లైన్-ఫోర్-సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 13,750 ఆర్‌పిఎమ్ వద్ద 206.5 బిహెచ్‌పి మరియు 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ కేవలం 3.2 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా దీని గరిష్ట వేగం 300 కిమీ/గం వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త BMW S 1000 RR బైక్ కొత్త స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్‌తో అప్డేట్ చేయబడిన ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌, అంతే కాకుండా ఇందులో స్లయిడ్ కంట్రోల్ ఫంక్షన్‌తో అప్డేట్ చేయబడిన ABS సెటప్‌ కూడా పొందుతుంది. ఇది రైడింగ్ సమయంలో రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఇది రైడర్ కి అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందించేలా రూపొందించబడింది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త BMW S 1000 RR

బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ (BMW S1000RR) ఇప్పుడు చాలా వరకు అప్డేట్స్ పొందింది. ఇందులో స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌ గా స్పోర్ట్స్ ఏరో వింగ్‌లెట్‌ ఉంటుంది. అంతే కాకుండా విండ్ డిఫ్లెక్షన్‌ ని మెరుగుపరచడానికి విండ్‌స్క్రీన్ కొంత పొడిగించబడింది. ఇందులోని ఎల్ఈడీ హెడ్‌లైట్ సెటప్ మునుపటి మోడల్ ని గుర్తుకు తెస్తుంది. ఈ బైక్ యొక్క వెనుక భాగం కూడా కొంత అప్డేట్ చేయబడినట్లు తెలుస్తుంది.

BMW S 1000 RR బైక్ అల్యూమినియం వీల్స్ కలిగి ఉండి, ముందు వైపు 120/70 R17 సెక్షన్ టైర్లు, వెనుక వైపు 190/55 R17 సెక్షన టైర్లను పొందుతుంది. ఈ కొత్త బైకులో హిల్ స్టార్ట్ కంట్రోల్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, లాంచ్ కంట్రోల్ మరియు పిట్ లేన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇది రెయిన్, రోడ్, డైనమిక్ మరియు రేస్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త BMW S 1000 RR

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త బిఎండబ్ల్యు ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ డుకాటి పానిగేల్ V4 మరియు కవాసకి ZX-10R వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. ఈ బైక్ ఇప్పుడు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంది కావున తప్పకుండా దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ బైక్ కోసం కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు సమాచారం.

దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే బిఎండబ్ల్యు మోటొరాడ్ తన కొత్త ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ విడుదల చేసింది. అయితే ఈ బైక్ దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతుందా.. లేదా అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఇలాంటి మరిన్ని కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 10, 2022, 15:50 [IST]
English summary
Bmw s 1000 rr launch in india price design variants
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+