Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

బెంగళూరుకు చెందిన షేర్డ్ స్కూటర్ మొబిలిటీ కంపెనీ బౌన్స్ (Bounce), గతేడాది డిసెంబర్ నెలలో భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ "బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1" (Bounce Infinity E1) ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదలస చేసిన సంగతి తెలిసినదే. కాగా, వినియోగదారులు ఇప్పుడు ఈ బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కంపెనీ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తమ అత్యాధునిక తయారీ కేంద్రంలో ఇన్ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించింది మరియు ఇవి ప్లాంట్ నుండి డీలర్లకు విడుదల కావడం కూడా ప్రారంభమైంది.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడిన ఈ మేడ్ ఇన్ ఇండియా బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఏప్రిల్ 18, 2022 వ తేదీ నుండి దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2 లక్షల స్కూటర్లు. ప్రస్తుతం, ఏటా రెండు లక్షల యూనిట్లను తయారు చేస్తున్న ఈ ప్లాంట్, భారత ఈవీ మార్కెట్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్ ను సమర్థవంతంగా తీర్చగలదని భావిస్తున్నారు. ఇది కాకుండా, ఈ ఏడాది చివర్లో, దక్షిణ భారతదేశంలో ఏటా 5 లక్షలకు పైగా స్కూటర్లను ఉత్పత్తి చేయగల మరో యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయాలని బౌన్స్ యోచిస్తోంది.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

ఈ సందర్భంగా బౌన్స్ ఇన్ఫినిటీ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ వివేకానంద హలేక్రే మాట్లాడుతూ, "తమ ప్లాంట్ నుండి బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడం పట్ల తాము సంతోషంగా ఉన్నామని, మొదటి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు త్వరలోనే విడుదల కానున్నాయని చెప్పారు. దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ను కస్టమర్‌లకు డెలివరీ చేయబడుతుందని, భారతదేశంలో మారుతున్న మొబిలిటీ యొక్క భవిష్యత్తు గురించి తాము సంతోషిస్తున్నాము మరియు దానిలో భాగమైనందుకు గర్విస్తున్నామని" ఆయన అన్నారు.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1 (Bounce Infinity E1) ధర రూ.45,099 మాత్రమే!

బౌన్స్ తమ ఇన్ఫినిటీ ఇ1 ఇ-స్కూటర్ ను కేవలం రూ.45,099 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే విక్రయిస్తోంది. అయితే, ఈ ధర వద్ద కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే లభిస్తుంది, అందులో బ్యాటరీ ప్యాక్ ఉండదు. మరి బ్యాటరీ లేకుండా ఎలా నడపాలనేదే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నా.. కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) అనే ఆప్షన్ ను అందిస్తోంది. అంటే, కస్టమర్లు స్కూటర్‌ను మాత్రమే కొనుగోలు చేసి, బ్యాటరీని అద్దెకు తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన కస్టమర్లు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారిపోవచ్చు.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

భారతదేశంలో స్వాప్ చేయగల బ్యాటరీని సేవగా అందించే ఏకైక స్కూటర్ బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1. ఈ సేవలో భాగంగా కస్టమర్ బ్యాటరీకి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది అద్దెకు బ్యాటరీని కొనుగోలు చేయడం లాంటిది. కంపెనీ తమ స్కూటర్‌ల కోసం బ్యాటరీ మార్పిడి నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. ఈ చార్జింగ్ పాయింట్ల వద్ద వినియోగదారులు తమ స్కూటర్‌లో ఖాళీ అయిన బ్యాటరీని అక్కడే వదిలేసి, పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

ఇందుకోసం బ్యాటరీ స్వాప్ రుసుము మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అలా కాదనుకుంటే, అద్దెకు తీసుకున్న బ్యాటరీని కస్టమర్లు తమ ఇంటి వద్ద కానీ లేదా ఏదైనా పబ్లిక్ చార్జింగ్ పాయింట్ వద్ద కానీ చార్జ్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు అందులో ఉపయోగించే బ్యాటరీపై యాజమాన్యాన్ని కలిగి ఉండరు, బ్యాటరీలపై పూర్తి హక్కులు బౌన్స్ సంస్థకే ఉంటాయి. ఇలా చేయడం వలన సాంప్రదాయ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధరతో పోలిస్తే బౌన్స్ ఇ1 స్కూటర్ కొనుగోలు ధర దాదాపు 40 శాతం వరకు తక్కువగా ఉంటుంది.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యంత ఖరీదైన భాగం, అందులోని బ్యాటరీ. కాబట్టి, ఎలక్ట్రిక్ స్కూటర్ ను బ్యాటరీ లేకుండా విక్రయించడం ద్వారా తక్కువ ధరకే వీటిని ఎక్కువ మందికి అందించాలనేది కంపెనీ ముఖ్య ఉద్దేశ్యం. అలాకాకుండా, బ్యాటరీతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకునే వారికి కూడా కంపెనీ అవకాశాన్ని ఇస్తోంది. బ్యాటరీ మరియు హోమ్ చార్జర్‌తో కలిపి ఇన్ఫినిటీ ఇ1 స్కూటర్‌ను కొనుగోలు చేయాలంటే, కస్టమర్లు రూ.68,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) చెల్లించాల్సి ఉంటుంది.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1 (Bounce Infinity E1) రేంజ్ 85 కిమీ!

బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై ఎకో మోడ్‌లో గరిష్టంగా 85 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. అదే పవర్ మోడ్‌లో దీని రేంజ్ 65 కిమీలుగా ఉంటుంది. ఇదొక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇది గరిష్టంగా గంటకు 65 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్‌ను నడపడానికి రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి. ఇది కేవలం 8 సెకండ్లలోనే గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ 48V లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. ఈ స్కూటర్‌ను ఏదైనా సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్ నుండి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులోని బ్యాటరీ పూర్తిగా 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ లోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 83 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన బ్రేకింగ్ కోసం ఇందులో ముందు మరియు వెనుక వైపుల డిస్క్ బ్రేక్‌లు అమర్చారు. ఇవి రెండూ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ (EBS)ని కలిగి ఉంటాయి. ఇందులోని బ్రేక్ రీజనరేషన్ టెక్నాలజీ వలన బ్రేక్స్ వేసిన ప్రతిసారి బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది.

Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం.. ఏప్రిల్ 18 నుండి డెలివరీలు స్టార్ట్..

బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి హెడ్‌లైట్, 12-లీటర్ల బూట్ స్పేస్, హైడ్రాలిక్ సస్పెన్షన్, డిజిటల్ స్పీడోమీటర్‌, జియోఫెన్సింగ్, డ్రాగ్ మోడ్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీథెఫ్ట్ అండ్ టో అలర్ట్ వంటి ఫీచర్లు లభిస్తాయి. ఈ స్కూటర్‌ను యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ తో అనుసంధానం చేసుకోవడం కోసం కంపెనీ ఓ బ్లూటూత్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను కూడా అందిస్తుంది. ఈ స్కూటర్ స్పోర్టీ రెడ్, పెరల్ వైట్, స్పార్కిల్ బ్లాక్, కామెట్ గ్రే మరియు డెసర్ట్ సిల్వర్ అనే ఐదు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, April 8, 2022, 9:09 [IST]
English summary
Bounce infinity e1 electric scooter production begins deliveries to start from 18th april 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+