బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా.. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేయండి: ఎలా అనుకుంటున్నారా?
ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది షాపింగ్ చేసుకునే యాప్ అని. అయితే ఇప్పుడు ఇందులో బట్టలు, నిత్యాసరాలు మరియు ఇతరత్రా మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వినటానికి కొత్తగా ఉన్నా, ఇది నిజం. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'బౌన్స్' (Bounce) తన 'ఇన్ఫినిటీ ఈ1' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ విడుదల చేయనుంది.
భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించనున్న మొదటి కంపెనీ బౌన్స్ మొబిలిటీ కానుంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

బౌన్స్ కంపెనీ, ఇప్పుడు ఎక్కువమంది కస్టమర్లకు మరింత చేరువలో ఉండటానికి ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఇప్పుడు బౌన్స్ కంపెనీ యొక్క ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇది ఈ రోజునుంచే అందుబాటులోకి వస్తుంది.

కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే, బుక్ చేసుకున్న 15 రోజుల్లో కస్టమర్ల చెంతకే డెలివరీ చేయబడుతుంది. ప్రస్తుతం ఈ సదుపాయం కేవలం ఐదు రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అవి ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ మరియు మహారాష్ట్ర. తరువాత దశలో దేశవ్యాప్తంగా డెలివరీలు చేయడానికి సన్నాహాలు చేయనున్నారు.

కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసినప్పటికీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలను పొందవచ్చు. కావున నిస్సంకోచంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు. బౌన్స్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న తరువాత, బౌన్స్ డీలర్లు కస్టమర్‌తో సన్నిహితంగా ఉంటారు. అదే సమయంలో కస్టమర్‌కు స్కూటర్ రిజిస్ట్రేషన్ మరియు బీమాకు సంబంధించిన అని విషయాలలో కూడా వారు సహరిస్తూ ఉంటారు. అది మాత్రమే కాకుండా బుక్ చేసుకున్న తరువాత కస్టమర్లు డెలివరీ అయ్యే వరకు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. ఇది అన్ని విధాలుగా కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్:
బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 85 కిమీ (ఎకో మోడ్) పరిధిని అందిస్తుంది. అదేవిధంగా పవర్ మోడ్‌లో 65 కిమీల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటాకు 65 కిమీ/గం వరకు ఉంటుంది. ఈ స్కూటర్ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్పోర్టీ రెడ్, పెర్ల్ వైట్, స్పార్కిల్ బ్లాక్, కామెట్ గ్రే మరియు డెసర్ట్ సిల్వర్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

బౌన్స్ కంపెనీ ఈ స్కూటర్‌లో 48వి IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. కావున ఈ స్కూటర్‌ను ఏదైనా సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్ నుండి ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ లో ఉండే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇది కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. దీనికోసం కంపెనీ ఈ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు అందించింది. కంపెనీ దానిలో ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ (EBS)ని ఉపయోగించింది, ఇది బ్రేకింగ్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొత్త బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ హెడ్‌లైట్, 12-లీటర్ బూట్ స్పేస్ మరియు హైడ్రాలిక్ సస్పెన్షన్ మరియు డిజిటల్ స్పీడోమీటర్ వంటివి ఉంటాయి.

ఇక ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో జియోఫెన్సింగ్, డ్రాగ్ మోడ్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు యాంటిథెఫ్ట్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కు కనెక్ట్ చేయగల ఇన్ఫినిటీ స్మార్ట్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంటుంది.

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ స్మార్ట్, రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ అవసరమైనప్పుడు బయటకు తీయవచ్చు మరియు వినియోగదారుని సౌలభ్యం మేరకు దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్యాటరీ లేకుండా కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా ఇప్పుడు అందిస్తోంది. ఈ ఎంపిక కింద, వినియోగదారులు బ్యాటరీ లేకుండా స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
బౌన్స్ కంపెనీ తన 'ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్' ని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కస్టమర్లకు మరింత చేరువలోకి తీసుకెళ్లడానికి ఒక అడుగు ముందుకు వేసింది. అయితే ఇది తప్పకుండా విజయం సాధిస్తుందనే ఆశిస్తున్నాము. తద్వారా మంచి అమ్మకాలు కూడా పొందే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








