భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే వాటికి కావలసిన మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం కావలసినన్ని అందుబాటులో లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటును ప్రోత్సహిచడం జరుగుతోంది. ఇందులో భాగంగానే బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'బౌన్స్ ఇన్ఫినిటీ' (Bounce Infinity) ఇప్పుడు దేశంలోని అతిపెద్ద ఇంధన సరఫరాదారులలో ఒకటైన 'భారత్ పెట్రోలియం'తో భాగస్వామం కుదుర్చుకుంది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

నివేదికల ప్రకారం, ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారీ సంస్థ 'బౌన్స్ ఇన్ఫినిటీ' ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ఏర్పాటుకి భారత్ పెట్రోలియంతో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యంతో బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ దేశంలోని భారత్ పెట్రోలియం ఫ్యూయెల్ స్టేషన్స్ వద్ద తన బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీ మార్పిడి) స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఇది కూడా దశల వారీగా జరుగుతుంది.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

కంపెనీ ఏర్పరచుకున్న ఈ భాగస్వామ్యంలో భారతదేశంలోని టాప్ 10 నగరాల్లో దాదాపు 3,000 బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలోని ఖాళీ అయిన బ్యాటరీని మార్చుకోవాలనుకున్నప్పుడు బౌన్స్ యాప్‌లో సమీపంలోని స్వాపింగ్ లొకేషన్ కోసం వెతుక్కోవచ్చు. కంపెనీ కేవలం వాహనాల విక్రయాలను మాత్రమే కాకుండా బ్యాటరీ స్వాపింగ్ మరియు సర్వీస్ వంటి సదుపాయాలను కూడా కల్పిస్తుంది.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

బౌన్స్ ఇన్ఫినిటీ ఏర్పాటు చేయనున్న ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ లో కేవలం బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లకు మరియు ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు కూడా ఈ బ్యాటరీలను అందిస్తుంది. కావున ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

ఇక ఈ బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీ మార్పిడి) విషయానికి వస్తే, ఇది ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రక్రియలో ప్రత్యేకంగా బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. వినియోగదారుడు ఉపయోగించే ఎలక్ట్రిక్ వెహికల్ లో పూర్తిగా ఛార్జ్ ఖాళీ అయిన బ్యాటరీని తీసివేసి దాని స్థానంలో ఫుల్ ఛార్జ్ చేయబడిన బ్యాటరీని రీప్లేస్ చేయవచ్చు.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ కోసం మీరు యాప్ ద్వారా సర్చ్ చేయవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ. అయితే వినియోగదారుడు చేయాల్సిందల్లా ఒకటే బ్యాటరీకి సంబంధించిన సర్వీస్ ఛార్జ్ చెల్లించడమే. ఇది వినియోగదారులు ఎల్‌పిజి సిలిండర్‌లను ఉపయోగించే విధానాన్ని పోలి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని మార్చుకోవడానికి పట్టే సమయం బైక్‌లో పెట్రోల్ నింపడానికి పట్టే సమయానికి సమానంగా ఉంటుంది.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

పెట్రోల్ వాహనాలకు ఏదైనా పెట్రోల్ పంపు వద్ద పెట్రోల్ నింపుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం బ్యాటరీ స్వాపింగ్ కోసం స్థిరమైన ఆపరేటర్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఇన్ఫినిటీ స్వాపింగ్ స్టేషన్లు ఇంధన స్టేషన్ల మాదిరిగానే పనిచేస్తాయి. ఇక్కడ, ఇన్ఫినిటీ బ్యాటరీ మార్పిడి స్టేషన్‌లు ఛార్జ్ చేయబడిన మరియు ఛార్జ్ చేసి సిద్ధంగా ఉన్న బ్యాటరీలను కలిగి ఉంటాయి. కావున వినియోగదారుడు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

భారతీయ మార్కెట్లో బౌన్స్ వంటి కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు తమ వినియోగదారులకు సబ్‌స్క్రిప్షన్‌ విధానంతో బ్యాటరీలను అందించడం జరుగుతుంది. కావున బౌన్స్ కస్టమర్లు కంపెనీకి చెందిన ఏదైనా స్వాపింగ్ స్టేషన్‌లను సందర్శించడం ద్వారా బ్యాటరీని మార్చుకోవచ్చు.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

ఇక బౌన్స్ (Bounce) కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్పోర్టీ రెడ్, పెర్ల్ వైట్, స్పార్కిల్ బ్లాక్, కామెట్ గ్రే మరియు డెసర్ట్ సిల్వర్ కలర్స్.

భారత్ పెట్రోలియంతో చేతులుకలిపిన బౌన్స్.. ఎందుకో తెలుసా?

కంపెనీ ఈ స్కూటర్‌లో 48వి IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. కావున ఈ స్కూటర్‌ను ఏదైనా సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్ నుండి ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ లో ఉండే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ (0% నుంచి 100%) చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ 83 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

Most Read Articles

English summary
Bounce infinity partners with bharat petroleum for ev battery swapping stations
Story first published: Tuesday, May 31, 2022, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X