అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మంటల్లో కాలిపోతున్న ఘటనలు అధికమైన సంగతి మనందరికీ తెలిసినదే. వరుస ఈవీ ప్రమాదాల నేపథ్యంలో, ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈవీలలో అగ్ని ప్రమాదాలకు జరగడానికి కారణాలను వివరించాలని కోరుతూ సదరు కంపెనీలకు నోటీసులు కూడా పంపుతోంది. తాజాగా, ఇదే విషయంపై దేశపు అతిపెద్ద ఈవీ తయారీదారు అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (Central Consumer Protection Authority) నోటీసులు జారీ చేసింది.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

గత మార్చి నెల నుండి, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక బ్యాటరీ వాహనాలు అగ్నికి ఆహుతైన సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు షాక్‌కు గురయ్యారు. కొన్ని సంఘటనలు ఛార్జింగ్‌లో ఉండగా జరిగితే, మరికొన్ని రోడ్డుపై వెళ్తున్నప్పుడు జరిగాయి. దీంతో ఏదైతే వాహనం అగ్ని ప్రమాదానికి గురైందో ఆ బ్యాచ్‌కు సంబంధించిన వాహనాలన్నింటినీ రీకాల్ చేసి, తనిఖీ చేయాలని ప్రభుత్వం సదరు తయారీదారులకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

ఓ నివేదిక ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటలకు సంబంధించిన ఇటీవలి సంఘటనల గురించి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క విభాగం అయిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నుండి నోటీసును అందుకుంది. ఈ నోటీసులపై స్పందించడానికి ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ CCPA 15 రోజుల గడువు ఇచ్చింది. జూన్‌ మధ్యలో నోటిఫికేషన్‌ వెలువడింది. గత నెలలో ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్‌ మరియు ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీల ఇ-స్కూటర్లలో మంటలు చెలరేగిన నేపథ్యంలో సిసిపిఏ ఆయా సంస్థలకు ఈ నోటీసులను పంపింది.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

ఇ-స్కూటర్లలో అగ్నిప్రమాదానికి గల కారణాలు, వాహనం తయారీలో పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలపై వివరణ ఇవ్వాలని సిసిపిఏ ఈ నోటీసులో కోరింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో ఓలా ఎలక్ట్రిక్ తన 1,441 స్కూటర్లను రీకాల్ చేసి పరీక్షిస్తోంది. ఓలా తన స్కూటర్ల వాడిన బ్యాటరీలకు AIS 156 సర్టిఫికేషన్ పొందింది. ఈ AIS ధృవీకరణ భారతదేశంలో అనుసరించే ప్రమాణం. కంపెనీ బ్యాటరీ కూడా ECE 136 తో రేట్ చేయబడింది, ఇది యూరోపియన్ ప్రమాణం. భారతదేశంలో ఉపయోగించే AIS ధృవీకరణ జపాన్, జర్మనీ మరియు USA వంటి దేశాలలో కూడా అనుసరించబడుతుంది.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

ప్యూర్ ఈవీ అనుసరించే నాణ్యత నియంత్రణలను సమీక్షించడానికి వినియోగదారుల రక్షణ కమిషన్ ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)ని సంప్రదించింది. ఇటీవలి నెలల్లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో మంటలు అంటుకున్న ఘటనలు తరచుగా నివేదించబడ్డాయి దీంతో తయారీదారులు కూడా తమ ఉత్పత్తులను రీకాల్ చేసి, లోపాల కోసం తనిఖీలు చేస్తున్నారు.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి కొన్ని ఘటనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఓ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనంలో పేలుడు సంభవించి, 40 ఏళ్ల వ్యక్తి మరణించిన తర్వాత, బూమ్ మోటార్స్ ఏప్రిల్ చివరి వారంలో కార్బెట్ బైక్స్ బ్రాండ్‌తో విక్రయించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేసింది. అలాగే, తెలంగాణలోని నిజామాబాద్‌లో ఓ స్కూటర్ బ్యాటరీ పేలుడు కారణంగా 80 ఏళ్ల వృద్ధుడు మరణించిన నేపథ్యంలో, ప్యూర్ ఈవీ దాదాపు 2,000 స్కూటర్లను రీకాల్ చేయాలని నిర్ణయించుకుంది.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

ఓలా ఎస్ ప్రో యూజర్ల కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

ఇదిలా ఉంటే, ఓలా ఎలక్ట్రిక్ తమ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ యూజర్ల కోసం ఓ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ని తీసుకువచ్చింది. మూవ్ ఓఎస్ 2.0 (Move OS 2.0) పేరుతో కంపెనీ ఓలా ఎస్1 ప్రో పనితీరును మెరుగుపరిచి మరియు రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని అందించే అనేక ఫీచర్లతో ఈ అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త అప్‌డేట్స్‌ లో భాగంగా కొత్త ఎకో మోడ్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ లాక్ మరియు అన్‌లాక్, నావిగేషన్, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి కొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

కొత్త ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్‌) కు అప్‌డేట్ అయిన తర్వాత కస్టమర్లు ఇప్పుడు పూర్తి చార్జ్ పై 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను పొందుతున్నారని కంపెనీ చెబుతోంది. ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్1 మరియు ఎస్1 ప్రో అనే రెండు స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ రెండింటిలో ఎస్1 ప్రో వేరియంట్ ఎక్కువగా అమ్ముడవుతోంది. కంపెనీ విడుదల చేసిన మూవ్ ఓఎస్ 2.0 ఓటిఏ అప్‌డేట్ కూడా ఈ ఎస్1 ప్రో మోడల్ కోసం మాత్రమే డిజైన్ చేయబడింది.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్‌కు ఇరువైపులా అమర్చిన ఫిక్స్డ్ 3.97 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌‌తో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8.5 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఈ మోడల్ పూర్తి చార్జ్ పై 181 కిమీ రేంజ్‌ను అందిస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఎస్1 ప్రో గరిష్టంగా గంటకు 0-60 కిమీ వేగాన్ని చేరుకోవడానికి నార్మల్ మోడ్‌‌లో 13.8 సెకన్లు, స్పోర్ట్స్ మోడ్‌లో 5.5 సెకన్లు మరియు హైపర్ మోడ్‌లో 3 సెకన్ల సమయం పడుతుంది.

అగ్ని ప్రమాదంపై విచారణ కోరుతూ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నుండి ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసులు..

ఇక టాప్ స్పీడ్ విషయానికి వస్తే, ఎకో మోడ్‌లో 40 కెఎంపిహెచ్, నార్మల్ మోడ్‌లో 80 కెఎంపిహెచ్, స్పోర్ట్స్ మోడ్‌లో 95 కెఎంపిహెచ్ మరియు హైపర్ మోడ్‌లో 116 కెఎంపిహెచ్ గా ఉంటుంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 750 వాట్ ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో పూర్తిగా చార్జ్ చేయటానికి 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది. అదే ఫాస్ట్ చార్జర్‌తో అయితే, కేవలం 1 గంట కన్నా తక్కువ వ్యవధిలోనే పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Ccpa sends notice to ola electric to explain e scooter fires
Story first published: Friday, June 24, 2022, 12:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X