Just In
- 29 min ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 1 hr ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 2 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 5 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Movies Mahi Shivan: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మహేశ్వరి.. ఎవరు పుట్టారో తెలుసా?
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350తో పోటీపడే ఇతర మోటార్‌సైకిళ్లు ఏవో తెలుసా..?
భారతదేశపు పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హంటర్ 350 (Hunter 350) మోటార్‌సైకిల్ దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైన సంగతి తెలిసినదే. ఈ సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) మోటార్‌సైకిల్ కేవలం రూ. 1.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదలైంది. హంటర్ 350 ఒక స్క్రాంబ్లర్ బాడీ టైప్ మోటార్‌సైకిల్ మరియు కంపెనీ దీనిని ప్రత్యేకించి మాస్ మార్కెట్ మరియు యవ రైడర్లను టార్గెట్ గా చేసుకొని విడుదల చేసింది.
రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 డిజైన్ మరియు దాని ప్రైస్ ట్యాగ్ ను చూస్తుంటే, ఈ మోటార్‌సైకిల్ యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న మోటార్‌సైకిల్ అని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే, ఇది చాలా గమ్మత్తైన సెగ్మెంట్, ఎందుకంటే ఇది ఈ విభాగంలో వివిధ రకాల మోటార్‌సైకిళ్లతో కూడా పోటీ పడుతుంది. వీటిలో హోండా సిబి300ఆర్ఎస్ (Honda CB300RS), జావా ఫోర్టీ టూ (Jawa 42) మరియు టీవీఎస్ రోనిన్ (TVS Ronin) వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పైన పేర్కొన్న ఈ నాలుగు మోడళ్లు కూడా ఒకే విధమైన డిజైన్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. వీటిలో వృత్తాకారపు హెడ్‌ల్యాంప్, టియర్-డ్రాప్-ఆకారపు ఇంధన ట్యాంక్ మరియు గుండ్రటి రియర్‌వ్యూ మిర్రర్స్ వంటి లక్షణాలతో ఇవి క్లాసిక్ హార్డ్ కోర్ స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ ను గుర్తుకు తెస్తాయి. మరి ఈ నాలుగు మోటార్‌సైకిళ్లు ఒదానితో మరొకటి ఎలా పోటీ పడుతాయో ఈ కథనంలో చూద్దాం రండి.
Specs | Hunter 350 | Ronin | Jawa 42 | CB350RS |
Engine cc | 349 cc | 225.9 cc | 293 cc | 348.36 cc |
Engine Type | Air-Oil Cooled, Fi | Air-Oil Cooled, Fi | Liquid Cooled | Air Cooled |
Power | 21 PS 6100 RPM | 20.4 PS 7750 RPM | 28 PS | 21 PS 5500 RPM |
Torque | 27 Nm 4000 RPM | 19.93 Nm 3750 RPM | 27.05 Nm | 30 Nm 3000 RPM |
Transmission | 5-speed | 5-speed | 6-speed | 5-speed |
Wheelbase mm | 1370 | 1357 | 1369 | 1441 |
Ground Clearance | 150.5 | 181 | 165 | 168 |
Seat Ht Rider | 800 | 795 | 765 | 800 |
Kerb Wt kgs | 177-181 | 160 | 172 | 179 |
Fuel Tank Litres | 13 | 14 | 14 | 15 |
Front Tyre | 110/70-17 | 110/70-17 | 90/90-18 | 100/90-19 |
Rear Tyre | 140/70-17 | 130/70-17 | 120/80-17 | 150/70-17 |
Front Disc | 300 mm | 300 mm | 280 mm | 310 mm |
Rear Disc | 270 mm | 240 mm | Drum | 240 mm |
ABS | Single / Dual | Single / Dual | Single / Dual | Dual Channel |
Front Suspension | Telescopic | USD | Telescopic | Telescopic |
Rear Suspension | Twin Shockers | Mono | Twin Shockers | Twin Shockers |
Headlight | Halogen | LED | Halogen | LED |
Taillight | Halogen / LED | LED | LED | LED |
Instrument Cluster | Analog / Digital | Digital | Semi Digital | Semi-Digital |
Bluetooth App | Optional | Yes | No | Yes |
USB Charger | - | - | No | No |
Ride Modes | No | Yes | No | No |
Bluetooth | Optional | Yes | No | Yes |
Price Range, Ex-Delhi | - | ₹1.49 Lakh - ₹1.70 Lakh | ₹1.74 Lakh - ₹1.96 Lakh | ₹2.03 Lakh |
ముందుగా పవర్‌ట్రెయిన్‌తో ప్రారంభించినట్లయితే, కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిలో కంపెనీ తమ పాపులర్ క్లాసిక్ 350 మరియు మీటియోర్ 350 మోడళ్లలో ఉపయోగిస్తున్న అదే 349 సీసీ ఇంజన్ ను ఉపయోగించింది. ఇది ఈ విభాగంలోని ఇతర మోడళ్ల కన్నా అతిపెద్ద ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఆ తర్వాత హోండా సిబి350ఆర్ఎస్, జావా 42 మరియు టీవీఎస్ రోనిన్ మోడళ్లు ఉన్నాయి. అయితే, వీటిలో అత్యంత శక్తివంతమైన ఇంజన్ మాత్రం జావా 42లో ఉంది.
పెద్ద ఇంజన్లను కలిగిన ఈ మోటార్‌సైకిళ్లు అన్నీ కూడా అప్రయత్నంగా ప్రయాణించేవే కాబట్టి, వీటిలో టార్క్ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఈ మోటార్సైకిళ్లన్నింటిలో, అత్యధిక టార్క్‌ని కలిగి ఉన్నది కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మాత్రం కాదు. అయితే, హోండా సిబి300ఆర్ఎస్ ఈ విభాగంలో అత్యధికంగా 30 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, సిబి300ఆర్ఎస్ na ఈ పీక్ టార్క్ కూడా చాలా తక్కువ ఆర్‌పిఎమ్ (3,000rp) వద్ద ఉత్పత్తి చేయబడుతుంది. కాబట్టి, హోండా సిబి350ఆర్ఎస్ ఎలాంటి శ్రమలేని రైడింగ్ అనుభవాన్ని ఇస్తుందనేది మా అభిప్రాయం.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ నాలుగు స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిళ్లు కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో లభిస్తాయి. అయితే, వీటిలో జావా 42 మాత్రం అదనపు కాగ్ని కలిగి ఉంటుంది మరియు ఈ గేర్‌బాక్స్ దాని పవర్‌ట్రెయిన్ యొక్క స్పోర్టీ క్యారెక్టర్‌కు కూడా సరిపోతుంది. ఈ మోటార్‌సైకిళ్లన్నీ ఒకే విధమైన కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్నందున, వాటి కొలతలు కూడా దాదాపు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే ఆశ్చర్యకరంగా, టీవీఎస్ రోనిన్ కేవలం 1,357 మిమీ వీల్‌బేస్‌తో వీటిలో అతి చిన్న మోటార్‌సైకిల్ గా ఉంటుంది.
అంతేకాకుండా, టీవీస్ రోనిన్ కేవలం 160 కేజీల బరువును మాత్రమే కలిగి ఉండి, ఈ నాలుగింటిలో అత్యంత తేలికైన మోటార్‌సైకిల్ గా ఉంటుంది. ఈ గ్రూప్‌లో తదుపరి తేలికైన మోటార్‌సైకిల్ జావా 42, దాని తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 మరియు హోండా సిబి350ఆర్ఎస్ మోడళ్లు ఉన్నాయి.
ఈ మోటార్‌సైకిళ్లను అప్పుడప్పుడు టూరింగ్ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతాయి కాబట్టి, ఈ మోటార్‌సైకిళ్లన్నీ కూడా తగినంత పెద్ద ఇంధన ట్యాంక్ లను కలిగి ఉంటాయి. అయితే, వీటిలో అతిపెద్ద ఇంధన ట్యాంక్ హోండా సిబి350ఆర్ఎస్ లో ఉంటుంది, ఇది 15-లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దాని తర్వాత జావా 42 మరియు టీవీఎస్ రోనిన్లలో 14-లీటర్ల ఇంధన ట్యాంక్, మరియు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350లో చిన్న 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది.
ఈ మోటార్‌సైకిళ్లన్నీ ఆధునిక వాహనాలే అయినప్పటికీ, టీవీఎస్ రోనిన్ మాత్రమే ఈ సమూహంలో ముందువైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఇకపోతే, మిగిలిన మూడు మోటార్‌సైకిళ్లు కూడా ముందు వైపున సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్లను కలిగి ఉంటాయి. అలాగే, అన్ని ఎల్ఈడి లైట్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు రైడ్ మోడ్లు వంటి అన్ని ఫీచర్లతో కూడిన ఏకైక మోటార్‌సైకిల్ టీవీఎస్ రోనిన్ మాత్రమే.
ఇక చివరిగా ధరల పరంగా చూస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ మరియు టీవీఎస్ కంపెనీ తమ మోటార్‌సైకిళ్ల ధరను కేవలం 1.49 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తుండగా, ఆశ్చర్యకరంగా, హోండా మాత్రం తమ సిబి350ఆర్ఎస్ ను రూ.2.03 లక్షల ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది మరియు ఇది ఈ విభాగంలోనే అత్యంత ఖరీదైనది.