రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

భారతదేశపు పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తమ కొత్త స్క్రామ్ 411 (Scram 411) స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఇది ఈ విభాగంలో యెజ్డీ స్క్రాంబ్లర్‌ (Yezdi Scrambler) తో పోటీ పడుతుంది. మరి ఈ రెండు మోటార్‌సైకిళ్లు వాటి ఇంజన్, ఫీచర్‌లు, టెక్నాలజీ, ఛాసిస్, సస్పెన్షన్, టైర్లు, బ్రేక్‌లు మరియు ధరల వంటి అంశాల పరంగా ఒకదానితో ఒకటి ఏవిధంగా పోటీ పడుతాయి మరియు ఈ రెండింటిలో ఏది ఉత్తమంగా ఉంటుంది అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

పవర్‌ట్రైన్ (ఇంజన్, గేర్‌బాక్స్)

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 స్కాంబ్లర్ మోటార్‌సైకిల్ లో కంపెనీ యొక్క ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హిమాలయన్ (Himalayan) లో ఉపయోగిస్తున్న అదే 411 సిసి, ఎయిర్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 24.3 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 32 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

ఇక యెజ్డీ స్క్రాంబ్లర్ (Yezdi Scrambler) విషయానికి వస్తే, కొన్ని దశాబ్ధాల తర్వాత మహీంద్రా గ్రూప్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ క్లాసిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్, తమ స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ లో అధునాతనమైన 334 సిసి డిఓహెచ్‌సి లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించింది. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 29.7 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 29.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. యెజ్డీ స్క్రాంబ్లర్ స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

ఫీచర్స్ మరియు టెక్నాలజీ

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 తో పోలిస్తే, యెజ్డీ స్క్రాంబ్లర్ ఫీచర్ల పరంగా చాలా అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇందులో ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు, ఏబిఎస్, మూడు రైడింగ్ మోడ్‌లు, రెండు యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌లు (ఒకటి USB-A టైప్, మరొకటి USB-C టైప్) మరియు వన్ స్టెప్ అడ్జస్టబల్ రియర్ బ్రేక్ లివర్ వంటి మరిన్నో ఫీచర్లు, పరికరాలను కలిగి ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం తమ స్క్రామ్ 411 మోటార్‌సైకిల్ లో ఇప్పటికీ ఓల్డ్ స్కూల్ టైప్ హాలోజన్ హెడ్‌ల్యాంప్ ను అందిస్తోంది. అలాగే, ఇందులో టర్న్ ఇండికేటర్లు మరియు ఇతర లైట్లు కూడా అన్ని హాలోజెన్ రూపంలో ఉన్నాయి. ప్రస్తుత, ఆధునిక యుగంలో ఇంత ఖరీదైన ఇలాంటి పాత ఫీచర్లను అందించడం కాస్తంత విచారకమైన విషయమే. అయితే, ఆసక్తిగల కస్టమర్ల కోసం కంపెనీ ఇందులో ఆప్షనల్ ట్రిప్పర్ నావిగేషన్ యూనిట్‌ను కూడా అందిస్తోంది. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

చాస్సిస్ మరియు సస్పెన్షన్

మెకానికల్‌గా చూస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 హాఫ్-డ్యూప్లెక్స్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది మరియు ముందు వైపు 190 మిమీ వీల్ ట్రావెల్‌తో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుక వైపు 180 మిమీ వీల్ ట్రావెల్ తో కూడిన మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ హార్డ్‌వేర్ సెటప్ కారణంగా, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 బైక్‌ని కఠినమైన ఆఫ్-రోడ్ మార్గాల్లో కూడా సులువుగా నడపడానికి వీలవుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

ఇక దీని యెజ్డీ స్క్రాంబ్లర్ తో పోల్చి చూస్తే, ఈ బైక్‌ను డబుల్-క్రెడిల్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇందులో ముందు వైపు 150 మిమీ వీల్ ట్రావెల్‌తో కూడిన టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు వెనుక వైపు 130 మిమీ వీల్ ట్రావెల్‌తో కూడిన డ్యూయల్ గ్యాస్-ఛార్జ్డ్ షాక్‌ అబ్జార్వర్లను ఉపయోగించారు. ఈ రెండిటినీ పోల్చి చూస్తే, మెకానికల్ విషయంలో Scram 411 కంటే Yezdi Scrambler తక్కువ ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

టైర్లు మరియు బ్రేక్‌లు

యెజ్డీ స్క్రాంబ్లర్ బైక్ లో ముందు వైపు 100/90 సెక్షన్ టైర్‌తో కూడిన ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీ 19 ఇంచ్ స్పోక్డ్ వీల్ ఉంటుంది. అలాగే, వెనుకవైపు 140/70 సెక్షన్ టైర్‌తో కూడిన 17 ఇంచ్ వీల్ ఉంటుంది. ఇక స్క్రామ్ 411 బైక్ కూడా ఇదే రకమైన చక్రాలు మరియు టైర్లను కలిగి ఉంటుంది. కాకపోతే, స్క్రామ్ 411 పై మరింత ఆఫ్-రోడ్ యోగ్యమైన సీయట్ గ్రిప్ టైర్లను ఉపయోగించారు. ఇక బ్రేకుల విషయానికి వస్తే, యెజ్డీ ముందు భాగంలో 320 మిమీ డిస్క్‌లను ఉపయోగించారు. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411లో ఉన్నదాని కంటే 20 మిమీ పెద్దదిగా ఉంటుంది. కాగా, వెనుక వైపు ఈ రెండు మోడళ్లలో ఒకే 240 మిమీ డిస్క్‌ను ఉపయోగించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

ధరలు

ఇక చివరిగా ధరల విషయానికి వస్తే, కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 ధర రూ. 2.03 లక్షల నుండి 2.08 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్యలో ఉంది. ఇది ఏడు ఆకర్షణీమయైన రంగులలో లభిస్తుంది. కాగా, మార్కెట్లో యెజ్డీ స్క్రాంబ్లర్ ధరలు రూ. 2.04 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభం అవుతాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వర్సెస్ యెజ్డీ స్క్రాంబ్లర్: ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు? ఎందుకు?

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 అనేది ప్రాథమికంగా ఆఫ్-రోడ్ ప్రయోజనాన్ని ఉద్దేశించి తయారు చేయబడిన మోటార్‌సైకిల్. అయితే, దీనిని ఆన్-రోడ్ పై సాధారణంగా కూడా ఉపయోగించేలా డ్యూయెల్ పర్పస్‌తో కంపెనీ దీనిని డిజైన్ చేసింది. కాగా, యెజ్డీ స్క్రాంబ్లర్ మరింత రోడ్-బయాస్డ్ మోటార్‌సైకిల్‌పై ఆధారపడి తయారు చేయబడింది కాబట్టి, ఇది ప్రధానంగా సిటీ మరియు హైవే రైడ్‌ల కోసం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ మీరు తరచూ ఆఫ్-రోడింగ్ చేసేవారు అయితే, మీకు స్క్రామ్ 411 అనుకూలంగా ఉంటుంది. అలాకాకుండా, మీరు నిత్యం సిటీ మరియు హైవేలపై ప్రయాణించే వారు అయితే, మీకు యెజ్డీ స్క్రాంబ్లర్ అనుకూలంగా ఉంటుంది. సో.. ఈ రెండింటిలో మీకు నచ్చిన బైక్ ఏది? కామెంట్ల ద్వారా తెలియజేయగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, March 17, 2022, 13:58 [IST]
English summary
Comparison between royal enfield scram 411 and yezdi scrambler engine specs features price and more
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+