భారత మార్కెట్లో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్: ధర రూ. 64,000 మాత్రమే
భారతీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ స్టార్టప్ కంపెనీ క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) ఇప్పుడు మార్కెట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) దేశీయ మార్కెట్లో కొత్త స్నో ప్లస్ (Snow+) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 64,000 (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది, అంతే కాకుండా ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది.

కొత్త స్నో ప్లస్ (Snow+) ఎలక్ట్రిక్ స్కూటర్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీనిని తక్కువ దూరాలకు ప్రయాణించడానికి కంపెనీ ప్రత్యేకంగా తయారుచేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 250 వాట్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. అదే సమయంలో ఇది గరిష్టంగా 25 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. కావున నగరంలో రోజువారీ ప్రయాణాలకు ఇది ఎంతగానో సహాయపడుతుంది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, మంచి అమ్మకాలను పొందుతున్న స్నో (Snow) స్కూటర్ యొక్క కొత్త వెర్షన్ స్నో ప్లస్ (Snow+) ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఆధునిక మరియు అప్డేటెడ్ స్కూటర్ డిజిటల్ స్పీడోమీటర్‌తో సెంట్రల్ లాకింగ్, మొబైల్ కోసం USB ఛార్జింగ్, యాంటీ థెఫ్ట్, జియో ట్యాగింగ్ మరియు జిపిఎస్ నావిగేషన్ వంటి ఫీచర్లను పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది. అవి సూపర్ వైట్, క్లాసిక్ గ్రే, సన్‌షైన్ ఎల్లో మరియు ఫ్లూరీ రెడ్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. కావున తప్పకుండా మంచి అమ్మకాలను పొందటంలో సహాయపడతాయి.
స్నో ప్లస్ (Snow +) ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల సందర్భంగా, క్రేయాన్ మోటార్స్ సహ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ మయాంక్ జైన్ మాట్లాడుతూ.. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నగరంలో ప్రయాణించే వారికి మంచి ఎంపిక అవుతుంది అన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం తక్కువ ధరకే ఈ స్కూటర్ లభిస్తోంది, కావున ఇది మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుంది అని ఆశిస్తున్నామన్నారు.

క్రేయాన్ మోటార్స్ ఇప్పుడు విడుదల చేసిన ఈ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మాత్రమే కాకుండా వచ్చే సంవత్సరానికి హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అంతే కాకూండా కంపెనీ ఈ నెలాఖరు నాటికి రెండు కొత్త హై-స్పీడ్ మోడళ్లను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు విడుదలైన కొత్త లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్నో ప్లస్ (Snow +) దేశ రాజధాని నగరం ఢిల్లీతో పాటు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్ మరియు బీహార్‌ల వంటి రాష్ట్రాల్లోని కంపెనీకి చెందిన 100 కు పైగా రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంది. కావున కొనుగోలుదారులు దీనిని సులభంగా కొనుగోలు చేయవచ్చు.

దేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి అనేక సబ్సిడీలు మరియు రాయితీలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫేమ్-2 కింద భారీ తగ్గుదల అందుబాటులో ఉంటుంది, కావున ఇప్పుడు ఈ స్కూటర్ కూడా రాష్ట్రాన్ని బట్టి అక్కడ అందుబాటులో ఉండే స్కీమ్ లను బట్టి రాయితీలు అందుబాటులో ఉంటాయి. కావున ధర కూడా చాలా వరకు తగ్గుతుంది.
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన పెరుగుదల రోజురోజుకి పెరుగుతోంది, దీనికి ప్రధాన కారణం పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు. పెరిగిన ఈ ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలు ఎక్కువగా డీజిల్ మరియు పెట్రోల్ భారాలను మోయాల్సి వస్తుంది. ఈ సమయంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.
మొత్తానికి క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) యొక్క కొత్త స్నో ప్లస్ (Snow +) ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు ఈ స్కూటర్ దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది మరియు ఏ కంపెనీ స్కూటర్లను ప్రత్యర్థిగా ఉంటుంది అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఆటో మొబైల్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








