ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఆ పేరులో ఓ ప్రత్యేకమైన వైబ్రేషన్స్ ఉన్నాయి. భారతదేశపు పురాతన మోటార్‌సైకిల్ కంపెనీ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు మార్కెట్లో ఓ తిరుగులేని శక్తివంతమైన టూవీలర్ బ్రాండ్ గా అవతరించింది. ప్రతి ఒక్క ద్విచక్ర వాహన ఔత్సాహికుడు తమ జీవితంలో ఒక్కసారైనా నడపాలనుకునే బైక్ బ్రాండ్ గా మారింది. అంతేకాదు, ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్లకు ఉన్నన్ని కస్టమైజేషన్ ఆప్షన్స్ దేశంలోని మరే ఇతర టూవీలర్ బ్రాండ్ కి లేవు. కస్టమర్లు ఈ బైక్ లను తమకు నచ్చినట్లుగా, తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

సాధారణంగా, బైక్ మోడిఫికేషన్ చేసే వారు మరియు చేయించుకునే వారి మొదటి ఎంపిక రాయల్ ఎన్‌ఫీల్డ్. మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ లో ఉత్తమమైన బ్రాండ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మొదటి స్థానంలో ఉంటుంది. కంపెనీకి కూడా ఈ విషయం బాగా తెలుసు. అందుకే, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు కస్టమ్ వరల్డ్ చొరవను ప్రారంభించింది. అంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీయే స్వయంగా తమ మోటార్‌సైకిళ్లను విభిన్న రీతిలో కస్టమైజ్ చేయడం ప్రారంభించింది. ఇకపై ఇలాంటి కస్టమైజేషన్ల కోసం కస్టమర్లు ఇతర థర్డ్ పార్టీ కంపెనీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఈ కొత్త చొరవ మోటార్ సైకిల్‌దారులలో సృజనాత్మకతను ప్రేరేపించడానికి మరియు పెంపొందించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. అలాగే, ఇదివరకు చెప్పినట్లుగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు మోటార్‌సైకిల్ కమ్యూనిటీలో తమ సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి ఓ అత్యుత్తమ ప్లాట్‌ఫామ్ గా ఉపయోగపడుతాయి. ఈ కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌లు కేవలం మోటార్‌సైకిల్ యొక్క వివిధ డిజైన్ అంశాలను సవరించడం మాత్రమే కాకుండా, వివిధ నైపుణ్యాలు మరియు ఇంజనీరింగ్‌ను కలిగి ఉన్న ఒక కళారూపంగా చెప్పవచ్చు.

ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

అలాగే, ఇది కస్టమైజ్ చేయించుకోవాలనుకునే సదరు మోటార్‌సైకిల్ యజమాని యొక్క వ్యక్తీకరణ మరియు భావోద్వేగాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత ఆరు సంవత్సరాలలో భారతదేశం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, యూరప్ మరియు అమెరికాలకు చెందిన వివిధ కస్టమ్ బిల్డర్‌లతో కలిసి సుమారు 80 కంటే ఎక్కువ కస్టమ్ మోటార్‌సైకిళ్లను రూపొందించింది.

ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

ఇప్పుడు, ఈ కస్టమ్ వరల్డ్ చొరవలో భాగంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ ఆధారంగా నాలుగు ప్రత్యేకమైన కస్టమ్ బిల్డ్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. ఈ నాలుగు మోటార్‌సైకిళ్లు బెంగళూరు, పూణే, ముంబై మరియు ఢిల్లీ అనే నాలుగు వేర్వేరు ప్రదేశాలలో ఏకకాలంలో ఆవిష్కరించబడ్డాయి. ఈ కస్టమ్-బిల్ట్ మోటార్‌సైకిళ్ల విషయానికి వస్తే, ప్రతి కస్టమ్ మోటార్‌సైకిల్‌ను భారతదేశంలోని వ్యక్తిగత కస్టమ్ బిల్డర్లయిన రాజ్‌పుతానా కస్టమ్ మోటార్‌సైకిల్స్, ఓల్డ్ ఢిల్లీ మోటార్‌సైకిల్స్ కో, నీవ్ మోటార్‌సైకిల్స్ మరియు ఎమ్ఎస్ కస్టమ్స్ అనే కంపెనీలు డిజైన్ చేశాయి.

ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

ఈ కస్టమైజ్డ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లన్నీ కూడా భారతీయ కస్టమ్ మోటార్‌సైకిల్ విభాగం యొక్క అందం మరియు కల్పనను సూచిస్తాయి మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌లో కస్టమైజేషన్ కు గల అవకాశాలను కూడా మనకు తెలియజేస్తాయి. రాజ్‌పుతానా కస్టమ్ మోటార్‌సైకిల్స్ ద్వారా కస్టమైజ్ చేయబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 "టైమ్‌లెస్ క్లాసిక్" మోటార్‌సైకిల్‌ను ప్రతిబింబిస్తుంది మరియు దీన్ని సాధ్యం చేయడానికి, ఇందులోని చాలా భాగాలు చేతితోనే నిర్మించబడ్డాయి.

ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్ వివిధ కాలాలకు చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ల నుండి ప్రేరణ పొందింది. ఓల్డ్-స్కూల్ గిర్డర్ ఫ్రంట్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్‌లు, లెదర్ సీట్ వంటి మరెన్నో క్లాసిక్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఈ జాబితాలో తదుపరి మోటార్‌సైకిల్ నీవ్ మోటార్‌సైకిల్స్ నిర్మించిన 'డివైన్'. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్‌పై బంగారు పిన్-స్ట్రిపింగ్ మరియు గోల్డ్ లీఫ్ వర్క్‌ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్‌లో కస్టమ్ స్వింగార్మ్, ఫ్యూయల్ ట్యాంక్, మెషిన్ మరియు చేతితో చెక్కిన అలంకారాలు చాలానే ఉన్నాయి.

ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

ఇకపోతే, తదుపరి మోటార్‌సైకిల్ ఓల్డ్ ఢిల్లీ మోటార్‌సైకిల్స్ కో నిర్మించిన 'ఢిల్లీ', రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రకారం, ఈ మోటార్‌సైకిల్ ఢిల్లీ యొక్క నిరంతరం అభివృద్ధి చెందుతున్న స్ఫూర్తికి మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఆత్మకు వందనం చేసే ఓ రూపక నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. చివరగా, ఎమ్ఎస్ కస్టమ్స్ క్లాసిక్ 350 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఒక మోటార్‌సైకిల్‌ను నిర్మించింది. ఈ మోటార్‌సైకిల్ చాలా స్పోర్టీగా ఉంటుంది. ఇందులో 1960 కాలం నాటి బైక్ ల నుండి స్పూర్తి పొందిన హెడ్‌లైట్ క్లస్టర్, కస్టమ్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు స్వింగ్‌ఆర్మ్, చక్రాలు మరియు టైర్‌లతో దాని ఉద్దేశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం..

ఈ కథనం ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లు ఎల్లప్పుడూ కస్టమైజేషన్ కోసం బెస్ట్ ఛాయిస్ గా ఉంటాయి. ఇవి చాలా సింపుల్ డిజైన్ ను కలిగి ఉండి కస్టమైజర్లకు మంచి యాక్సెసిబిలిటీని అందిస్తాయి. అందుకే, ఇవి వారి ప్రధాన ఎంపికగా ఉంటాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమ్ వరల్డ్ వంటి కార్యక్రమాలతో, ఇప్పుడు ఎక్కువ మంది వ్యక్తులు తమ స్వంత కస్టమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను నిర్మించడానికి ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Custom built royal enfield motorcycles showcased details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X