2022 డాకర్ ర్యాలీ 9వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్ కూడా ముగిసింది. ఫలితాలు కూడా వచ్చేసాయి. ఈ 9 వ స్టేజిలో బైక్‌ విభాగంలో హోండా రైడర్ 'జోస్ కార్నెజో' విజయం సాధించగా, కార్ల విభాగంలో గినియెల్ డివిలియర్స్ ముందు వరుసలో నిలిచాడు. 9 వ స్టేజ్ డాకర్ ర్యాలీ ఫలితాలను గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

డాకర్ ర్యాలీలో బైక్‌ విభాగం:

ఈ 9 వ స్టేజి బైక్ విభాగంలోని వివిధ బైక్ రైడర్లు ఎంతో సాహసాలను ప్రదర్శించి అందరిని ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే మొత్తానికి ఈ విభాగంలో హోండా రైడర్ జోస్ కార్నెజో విజయం సాధించాడు. యితడు తన ప్రత్యర్తులకు గట్టి పోటీనే ఇచ్చాడు. మొత్తానికి యితడు 287 కిలోమీటర్ల పరిధిని 2 గంటల 29 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేసాడు.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

అయితే ఈ స్టేజిలో బ్రబెక్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బ్రబెక్ కెటిఎమ్ రైడర్ కెవిన్ బెనవిడెస్ కంటే ముందు ఈ స్టేజిని పూర్తి చేసి రెండవ స్థానంలో నిలిచాడు. మొత్తానికి ఈ స్టేజిలో జోక్విమ్ రోడ్రిగ్స్ అత్యధిక ర్యాంక్‌లో ఉన్న రైడర్‌గా నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

అదే సమయంలో పోర్చుగీస్ రైడర్ స్టేజిని ముగించి 11వ స్థానంలో నిలిచాడు, మరియు రుయ్ గొంకాల్వేస్ ఇందులో 16వ స్థానంలో నిలిచాడు. హీరో యొక్క దక్షిణాఫ్రికా రైడర్ ఆరోన్ మేర్ స్పానిష్ TVS షెర్కో రైడర్ లోరెంజో శాంటోలినో కంటే 4 స్థానాలు ఆధిక్యంలో 21వ స్థానంలో నిలిచాడు. భారత రైడర్ హరిత్ నోహ్ చివరి TVS రైడర్‌గా 31వ స్థానంలో నిలిచాడు.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

ఇందులో వాక్‌నర్ గ్యాస్‌గ్యాస్ రైడర్ సామ్ సుందర్‌ల్యాండ్ కంటే 2 నిమిషాల 12 సెకన్ల ముందు చేరుకున్నాడు. భారతీయ బైక్‌పై అత్యధిక ర్యాంక్ పొందిన రైడర్ టీవీఎస్ షెర్కో రైడర్ లోరెంజో శాంటోలినో మొత్తం ర్యాంకింగ్స్‌లో 7 వ స్థానంలో ఉన్నాడు. హీరో రోడ్రిగ్స్ మరియు మారే ప్రస్తుతం వరుసగా 15 వ మరియు 17 వ స్థానాల్లో ఉన్నారు. మొత్తానికి బైక్ విభాగం సజావుగా సాగింది.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

డాకర్ ర్యాలీలో కార్ విభాగం:

డాకర్ ర్యాలీ 2022 లోని కార్ విభాగంలో 287 కిలోమీటర్ల పొడవైన స్పెషల్ స్టేజిని గినియెల్ డి విలియర్స్, హెన్రిక్ లాటెగాన్ మరియు నాసర్ అల్-అత్తియా మంచి పర్ఫామెన్స్ చేశారు. మొత్తానికి డివిలియర్స్, లాటెగాన్ మరియు అల్-అత్తియా ముగ్గురూ కూడా ఒకరితో ఒకరు హోరా హోరీగా పోరాడారు.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

డివిలియర్స్ 118 కిమీ వే పాయింట్ వద్ద ఆధిక్యంలోకి వెళ్లాడు. డివిలియర్స్ చివరి వరకు తన ఆధిక్యాన్ని కొనసాగించగలిగాడు, అయితే లాటెగాన్‌ను కేవలం 9 సెకన్ల తేడాతో ఓడించి ముందు వరుసలో నిలిచాడు. డివిలియర్స్ మొత్తం ఈ స్టేజిని 2 గంటల 23 నిమిషాల 8 సెకన్లలో ముగించాడు.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

ఫైనల్ పోడియం స్పాట్‌ను నాజర్ అల్-అత్తియా కైవసం చేసుకున్నాడు, అతను ఫ్రెంచ్ ప్రత్యర్థి సెబాస్టియన్ లోబ్‌పై తన మొత్తం ప్రయోజనాన్ని పెంచుకుంటూ టయోటా గాక్సూ రేసింగ్ టీమ్ పోడియం స్థానాలను క్లీన్ స్వీప్ చేయడంలో సహాయపడింది. అల్-అత్తియా వేదికను 2 గంటల 24 నిమిషాల 12 సెకన్లలో పూర్తి చేసుకున్నాడు.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

మొత్తం స్టాండింగ్‌లలో, అల్-అత్తియా లోబ్‌ కంటే కూడా ముందు వరుసలో ఉన్నాడు. ఇక చివరగా సౌదీ డ్రైవర్‌ 58 నిమిషాల 44 సెకన్ల వెనుక ఉన్న యాజీద్ అల్-రాజీ చివరి పోడియం స్థానాన్ని క్లెయిమ్ చేశారు. మొత్తానికి ఈ విభాగం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ముగిసింది.

2022 డాకర్ ర్యాలీ 9 వ స్టేజ్: ఫలితాలు & విజేతలు

డాకర్ ర్యాలీ 2022 స్టేజ్ 9 పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

9 వ స్టేజి డాకర్ ర్యాలీ బైక్ విభాగంలో మరోసారి ఆధిక్యం చేతులు మారింది. ఇందులో ఆస్ట్రియన్ రైడర్ మాథియాస్ వాక్‌నర్ ఇప్పుడు ర్యాలీలో ముందంజలో ఉన్నాడు. కార్ల విభాగంలో ఖతార్‌కు చెందిన నాజర్ అల్-అత్తియా ప్రత్యర్థి లోబ్‌పై తన ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. మొత్తానికి ఇందులో అందరూ కూడా ఎవరికి ఎవరూ తీసిపోని రీతిలో సాహసం చేసారు.డాకర్ ర్యాలీ నెక్స్ట్ స్టేజి ఫలితాలు కూడా త్వరలో మీ ముందుకు రాబోతున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Dakar rally 2022 stage 9 results jose cornejo claim victory in the bikes category
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X