డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డ్యుకాటి (Ducati) భారత మార్కెట్లో తమ కొత్త స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ (Ducati Scrambler Urban Motard) బైక్ ను విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ ధర రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించబడింది. కంపెనీ ఈ కొత్త బైక్ ను తమ పాపులర్ స్క్రాంబ్లర్ 800 సిరీస్‌ మోటార్‌సైకిల్ ఆధారంగా చేసుకొని తయారు చేసింది. కాబట్టి, ఈ రెండు మోడళ్లలో అనేక భాగాలు (ఇంజన్ తో సహా) ఒకేలా ఉంటాయి.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

డ్యుకాటి స్క్రాంబ్లర్ 800 మోటార్‌సైకిల్‌లో ఉపయోగించిన అదే 803సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ఎల్-ట్విన్ ఇంజన్ ను ఈ కొత్త డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ బైక్ లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 71.8 బిహెచ్‌పి పవర్ ను మరియు 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 66.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్ట్రెయిట్ కట్ గేర్‌లతో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ హైడ్రాలిక్ కంట్రోల్డ్ స్లిప్పర్ మరియు సెల్ఫ్-సర్వో వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్‌ను కలిగి ఉంటుంది.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ ఇతర స్క్రాంబ్లర్ 800 సిరీస్ మోటార్‌సైకిళ్ల నుండి ప్రత్యేకంగా నిలబడటానికి సహాయపడే కొన్ని విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్లలో స్టార్క్ వైట్ సిల్క్ మరియు డుకాటి GP '19 రెడ్ పెయింట్ జాబ్‌పై గ్రాఫిటీ-స్టైల్ బాడీ గ్రాఫిక్స్, నోస్ లాంటి హై-సెట్ ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు సైడ్ నంబర్ ప్లేట్‌లు మొదలైనవి ఉన్నాయి.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

ఈ అర్బన్ మోటార్డ్‌ కు ప్రత్యేకమైన ఇతర ఫీచర్లలో తక్కువ వేరియబుల్ సెక్షన్ అల్యూమినియం హ్యాండిల్‌బార్ మరియు లో అండ్ ఫ్లాట్ సీట్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ ఇద్దరికీ మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ బైక్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, మార్చుకోగలిగిన అల్యూమినియం ఫ్రేమ్‌ తో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్‌, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు మరియు ఫుల్ డిఫ్యూజన్ ఎల్ఈడి టైల్‌లైట్ ఉన్నాయి. ఈ బైక్ గేర్ మరియు ఇంధన స్థాయి సూచికలను సూచించే ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను కూడా కలిగి ఉంటుంది.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

ఇక మెకానిల్స్ విషయానికి వస్తే, డుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ ట్యూబ్యులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌ పై తయారు చేయబడింది. ఈ బైక్ ముందు వైపున కయాబా 41 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు మరియు వెనుకవైపు ప్రీ-లోడెడ్ అడ్జస్టబల్ సదుపాయంతో కూడిన మోనోషాక్ (కయాబా బ్రాండ్) సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. డ్యుకాటి స్క్రాంబ్లర్ 800 అర్బన్ మోటార్డ్ ముందు మరియు వెనుక సస్పెన్షన్ రెండూ కూడా 150 మిమీ ట్రావెల్ ను అందిస్తాయి.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

ఈ అర్బన్ మోటార్డ్ ఇరు వైపులా 17 ఇంచ్ స్పోక్డ్ అల్యూమినియం వీల్స్ ఉంటాయి. వాటిపై ముందు భాగంలో 120/70-ZR17 ప్రొఫైల్ తో కూడిన టైరు మరియు వెనుక భాగంలో 180/55-ZR17 ప్రొఫైల్ తో కూడిన టైరు ఉంటాయి. ఇవి రెండూ కూడా పిరెల్లీ డయాబ్లో రోస్సో 3 టైర్లు. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 330 మిమీ డిస్క్ ఉంటుంది, ఇది రేడియల్ 4-పిస్టన్ కాలిపర్‌ల ద్వారా బిగించబడి ఉంటుంది. అలాగే, వెనుకవైపు సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 245 మిమీ డిస్క్ బ్రేక్‌ ఉంటుంది.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

కొత్త డుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ లాంచ్ గురించి డ్యుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ, స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ అనేది డ్యుకాటి ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా సృష్టించబడిన మోటార్‌సైకిల్, ఇది పట్టణ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మరియు శక్తివంతంగా అనుభవించడం కోసం రూపొందించబడింది. ఈ బైక్ స్ట్రీట్ ఆర్ట్ మరియు మెట్రోపాలిటన్ గ్రాఫిటీ ప్రపంచం నుండి ప్రేరణ పొందింది మరియు దాని అసమానమైన స్టైల్ మరియు స్పోర్టి క్యారెక్టర్ కారణంగా ఇది గుర్తించబడుతుందని చెప్పారు.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ అనేది స్క్రాంబ్లర్ లైనప్‌లో ఒక విలక్షణమైన మోటార్‌సైకిల్ అని మరియు దానిని తమ రైడింగ్ కమ్యూనిటికీ పరిచయం చేయడానికి తాము ఎంతగానో సంతోషిస్తున్నామని ఆయన అన్నారు. డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ ఈ ఇటాలియన్ టూవీలర్ బ్రాండ్ స్క్రాంబ్లర్ 800 ఫ్యామిలీకి మరో కొత్త రూపాన్ని జోడించింది. దాని ప్రత్యేకమైన గ్రాఫిటీ స్టైల్ గ్రాఫిక్స్ మరియు అదనపు ఫీచర్ల కారణంగా ఈ స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్ మిగిలిన స్క్రాంబ్లర్ మోటార్‌సైకిళ్ల నుండి ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది.

డ్యుకాటి స్క్రాంబ్లర్ అర్బన్ మోటార్డ్‌ బైక్ విడుదల.. ధర రూ.11.49 లక్షలు, దీని స్పెషల్ ఏంటంటే..?

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల

ఇదిలా ఉంటే, డ్యుకాటి ఇఠీవలే భారత మార్కెట్లో రెండు కొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది. డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 (Ducati Multistrada V2) మరియు డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2ఎస్ (Ducati Multistrada V2S) అనే బైక్‌లను కంపెనీ విడుదల చేసింది. ఇవి రెండూ ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఇవి కాస్తంగా భిన్నంగా ఉంటాయి. దేశీయ విపణిలో వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 14.65 లక్షలు మరియు రూ. 16.65 లక్షలుగా ఉన్నాయి. - వీటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Ducati india launches scrambler urban motard price starts at rs 11 49 lakhs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X