డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

భారతీయ విఫణిలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఇటాలియన్ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ 'డుకాటి' (Ducati) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో ఓ కొత్త బైక్ లాంచ్ చెసింది. దాని పేరు 'స్ట్రీట్‌ఫైటర్ వి2' (Streetfighter V2). కంపెనీ యొక్క ఈ కొత్త బైక్ ధర రూ. 17.25 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Recommended Video

Royal Enfield నుంచి కొత్త Hunter 350 వచ్చేసింది | ధర & వివరాలు

ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

డుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి2 బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది దాదాపు 'స్ట్రీట్‌ఫైటర్ వి4' కి చాలా దగ్గరగా ఉంటుంది. కావున ఈ బైక్ యొక్క ముందు భాగంలోని ఎల్ఈడీ డిఆర్ఎల్ ఉంటుంది. ఫ్యూయెల్ ట్యాంక్ కూడా దీనికి మరింత ఆకర్షణను అందిస్తుంది. ఇందులోని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు. అంతే కాకుండా ఇందులో రేడియేటర్ ష్రడ్స్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టం, సింగిల్ సైడెడ్ సింగార్మ్ మరియు ఇంజిన్ కౌల్ వంటివి ఉన్నాయి.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 4.3 ఇంచెస్ కలర్ టి‌ఎఫ్‌టి క్లస్టర్ ఉంటుంది. ఇది బైక్ గురించిన మొత్తమ్ సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది. ఇందులో స్ట్రీట్‌ఫైటర్ V2 డుకాటి మల్టీమీడియా సిస్టమ్ (DMS) కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇప్పుడు రైడర్ ఇన్‌కమింగ్ కాల్‌లను స్వీకరించవచ్చు, అదే సమయంలో బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా SMS నోటిఫికేషన్‌లను కూడా పొందవచ్చు.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

కొత్త 2022 డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ V2 బైక్ అదే 955 సిసి సూపర్‌క్వాడ్రో ట్విన్-సిలిండర్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 153 బిహెచ్‌పి పవర్ మరియు 9000 ఆర్‌పిఎమ్ వద్ద 101.4 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇందులో హై,మిడ్ మరియు లో అనే మూడు పవర్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇది దాని పానిగేల్ V2 కంటే కూడా తక్కువ పవర్ అందిస్తుంది.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

2022 డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ V2 బైక్ లాంచ్ సందర్భంగా 'డుకాటి ఇండియా' మేనేజింగ్ డైరెక్టర్ 'బిపుల్ చంద్ర' మాట్లాడుతూ.. స్ట్రీట్‌ఫైటర్ V2 అనేది అత్యాధునిక ఎలక్ట్రానిక్స్‌తో విడుదలైన అధునాతన బైక్. ఈ బైక్ ఇప్పుడు స్ట్రీట్‌ఫైటర్ కుటుంబాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నామన్నారు.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

ఈ కొత్త బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ షోవా షార్క్ మరియు వెనుకవైపు ఫుల్లీ అడ్జస్టబుల్ సాక్స్ షాక్ అబ్జార్బర్ ఉంది.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో డ్యూయెల్ 320 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో డ్యూయెల్ పిస్టన్ కాలిపర్లతో 245 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అంతే కాకుండా పిరెల్లి డియాబ్లో రోసో IV 120/70 సెక్షన్ ఫ్రంట్ మరియు 180/60 సెక్షన్ రియర్ టైర్లను కలిగి ఉంటుంది. కావున రైడింగ్ సమయంలో మంచి గ్రిప్ అనిస్తుంది.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

2022 డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ V2 అనేది టు సీటర్ కాన్ఫిగరేషన్ లో అందుబాటులో ఉంటుంది. అయితే ఇది ఒకే వేరియంట్ మరియు ఒకే కలర్ ఆప్సన్ లో లభిస్తుంది. అది 'డుకాటి రెడ్' కలర్ ఆప్సన్. ఈ కలర్ ఆప్సన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

2022 డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వి2 బైక్ భారతీయ మార్కెట్లో ట్రైయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్, బిఎండబ్ల్యు ఎఫ్ 900 ఆర్ మరియు కవాసకి జెడ్900 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది మార్కెట్లో తన విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున అమ్మకాల్లో ఎలాటి పురోగతిని చూస్తుంది అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి.

డుకాటి నుంచి మరో కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 17.25 లక్షలు

ఇదిలా ఉండగా డుకాటి కంపెనీ ఇప్పటికే దేశీయ విపణిలో కొత్త డ్యుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి4 ఎస్‌పి విడులా చేసింది. దీని ధర రూ. 34.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ అద్భుతమైన డిజైన్ అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

డ్యుకాటి స్ట్రీట్‌ఫైటర్ వి4 ఎస్‌పి బైక్ ఫ్యూయల్-ఇంజెక్ట్, లిక్విడ్ కూల్డ్, 4-వాల్వ్ పర్ సిలిండర్, 1,103 సీసీ, 90 డిగ్రీ వి4 ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 13,000 ఆర్‌పిఎమ్ వద్ద 205 బిహెచ్‌పి పవర్ ను మరియు 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 123 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2022, 10:04 [IST]
English summary
Ducati launched new streetfighter v2 in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+