భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

ఇటాలియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ డ్యుకాటి (Ducati) భారత మార్కెట్లో రెండు కొత్త అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది. డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 (Ducati Multistrada V2) మరియు డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2ఎస్ (Ducati Multistrada V2S) అనే బైక్‌లను కంపెనీ విడుదల చేసింది. ఇవి రెండూ ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉన్నప్పటికీ, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఇవి కాస్తంగా భిన్నంగా ఉంటాయి. మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి.

  • Ducati Multistrada V2 - రూ. 14.65 లక్షలు
  • Ducati Multistrada V2S - రూ. 16.65 లక్షలు

(పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 లైనప్ ఈ బ్రాండ్ యొక్క కార్నరింగ్ లైట్స్ ఫంక్షన్‌తో కూడిన అగ్రెసివ్ ఎల్ఈడి హెడ్‌లైట్‌లతో ముందు వైపు నుండి చాలా షార్ప్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని బ్రేక్ లైట్లు కూడా ఎల్ఈడి రూపంలో ఉంటాయి మరియు ఇవి ఎమర్జెన్సీ స్టాప్ సమయంలో లేదా హార్డ్ బ్రేకింగ్ సందర్భంలో ఆటోమేటిక్‌గా ఫ్లాష్ అవుతాయి. అలాగే, బైక్ యొక్క లీన్ యాంగిల్‌ను (బైక్‌ను వాల్చే లేదా మరల్చే వైపును) బట్టి దాని ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు కూడా ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ అవుతాయి.

భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

మల్టీస్ట్రాడా వి2ఎస్ మోడల్ లో ప్రత్యేకమైన ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో 5 అంగుళాల కలర్ టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్ ఉంటుంది. ఇది మెనూ, క్రూయిజ్ కంట్రోల్ మరియు హ్యాండ్స్-ఫ్రీ సిస్టమ్‌ను నావిగేట్ చేయడాన్ని సులభతరం చేసే సహజమైన ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో వెహికల్ హోల్డ్ కంట్రోల్ కూడా ఉంది, ఇది వినియోగదారుడు మోటార్‌సైకిల్ ను స్థిరంగా ఉంచి, సైడ్ స్టాండ్ ను తీసివేసినప్పుడు ముందు బ్రేక్ లివర్‌పై లేదా వెనుక బ్రేక్ పెడల్‌పై అధిక ఒత్తిడిని వర్తింపజేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా వెనుక బ్రేక్‌పై జోక్యం చేసుకోవడం ద్వారా వాహనాన్ని చురుగ్గా నిశ్చలంగా ఉంచేందుకు సహకరిస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగించకపోతే 30 సెకన్ల తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది.

భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు వి2ఎస్ రెండూ కూడా డ్యుకాటి రెడ్ పెయింట్ స్కీమ్‌లో అందుబాటులో ఉంటాయి. ఇందులో బ్లాక్ ఫ్రేమ్ మరియు రెడ్ ట్యాగ్‌లతో కూడిన బ్లాక్ వీల్ రిమ్‌లు ఉంటాయి. కాగా, మల్టీస్ట్రాడ్ వి2ఎస్ మోడల్ స్ట్రీట్ గ్రే మరియు బ్లాక్ ఫ్రేమ్‌తో పాటుగా "GP రెడ్" వీల్ రిమ్‌లతో అదనపు లివరీ ఆప్షన్ ను పొందుతుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇవి రెండూ ఒకే రకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయి.

భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

మల్టీస్ట్రాడా వి2 మరియు వి2ఎస్ మోడళ్లలో ఒకే 937 సిసి డ్యుకాటి టెస్టాట్రెట్టా 11° L-ట్విన్ ఇంజన్‌ ను కలిగి ఉంటాయి. ఇది డెస్మోడ్రోమిక్ డిస్ట్రిబ్యూషన్‌తో 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 111.3 బిహెచ్‌పి పవర్ ను మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 94 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త మల్టీస్ట్రాడా వి2 లైనప్‌ లోని ఇంజన్ కొత్త కనెక్టింగ్ రాడ్‌ లను కలిగి ఉంటుంది మరియు ఇది స్ట్రెయిట్ కట్ గేర్‌ లతో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ కు జత చేయబడి ఉంటుంది. రైడర్‌ లు సులువుగా గేర్ ‌లను మార్చుకుంనేందుకు ఇందులో క్విక్‌షిఫ్టర్‌ తో కూడిన కొత్త 8 డిస్క్ హైడ్రాలిక్ క్లచ్ కూడా ఉంటుంది.

భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

కొత్త 2022 డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 లైనప్ మోటార్‌సైకిళ్లు మల్టిపుల్ రైడింగ్ మోడ్‌ లను కలిగి ఉంటాయి. వీటిలో స్పోర్ట్, టూరింగ్, అర్బన్ మరియు ఎండ్యూరో అనే రైడ్ మోడ్స్ ఉంటాయి. రైడర్ సెలక్ట్ చేసుకునే రైడ్ మోడ్ ని బట్టి ఇంజన్ పనితీరు మారుతూ ఉంటుంది. అంతేకాకుండా, కొత్త మల్టీస్ట్రాడా వి2 మోటార్‌సైకిల్స్‌ లో 8 స్థాయిలో సర్దుబాటు చేయగల ట్రాక్షన్ కంట్రోల్ మరియు 3 స్థాయిలలో సర్దుబాటు చేయగల కార్నరింగ్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

మల్టీస్ట్రాడా వి2 మరియు వి2ఎస్ మెకానిల్స్ ను గమనిస్తే, ఇవి స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ పై తయారు చేయబడ్డాయి. ఇందులో ముందు వైపు 48 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2లో ముందు మరియు వెనుక సస్పెన్షన్ రెండూ పూర్తిగా సర్దుబాటు చేయడానికి వీలు ఉంటుంది మరియు వెనుక భాగంలో డబుల్ సైడెడ్ అల్యూమినియం స్వింగార్మ్ కూడా ఉంటుంది.

భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2ఎస్ సస్పెన్షన్ సెటప్‌ ను డ్యుకాటి యొక్క స్కైహుక్ సస్పెన్షన్ EVO సెటప్‌తో సరికొత్త స్థాయికి తీసుకువెళ్లింది, ఇది ఎలక్ట్రానిక్‌గా కంప్రెషన్‌ను సర్దుబాటు చేస్తుంది మరియు ముందు, వెనుక సస్పెన్షన్ రెండింటికీ రీబౌండ్ డంపింగ్ చేస్తుంది. ఈ రెండు మోడళ్లలో ముందు మరియు వెనుక సస్పెన్ష్లు 170 మిమీ వీల్ ట్రావెల్‌ను అందిస్తాయి. ఇది అన్ని రకాల రోడ్ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది.

భారత మార్కెట్లో డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు మల్టీస్ట్రాడా వి2ఎస్ బైక్స్ విడుదల: ధరలు, ఫీచర్లు

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి2 మరియు వి2ఎస్ మోడళ్లలో ముందువైపు 19 ఇంచ్ వీల్ చక్రం మరియు వెనుకవైపు 17-ఇంచ్ వీల్ ఉంటాయి. ఈ అల్లాయ్ వీల్స్ పై యూనిట్‌ను 120/90 ZR 19 (ముందు) మరియు 170/60 ZR 17 (వెనుక) ప్రొఫైల్‌తో కూడిన పిరెల్లి స్కార్పియన్ ట్రయిల్ II టైర్‌లు అమర్చబడి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు బ్రెంబో మోనోబ్లాక్ 4-పిస్టన్ 2-ప్యాడ్ కాలిపర్‌లను కలిగి ఉండే రెండు 320 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు 2-పిస్టన్ బ్రెంబో ఫ్లోటింగ్ కాలిపర్‌లతో కూడిన సింగిల్ 265 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటటాయి. ఇవి రెండు సర్దుబాటు చేయగల కార్నరింగ్ ఏబిఎస్ (ABS) ఫీచర్‌‍ ను కలిగి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 25, 2022, 17:16 [IST]
English summary
Ducati launches multistrada v2 and v2s adventure tourer bikes in india prices specs features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+