డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

భారతీయ మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకుండా అత్యంత ఖరీదైన బైకులకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే ఖరీదైన బైకులు కూడా దేశీయ విఫణిలో విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటి' (Ducati) ఒక కొత్త బైకుని మార్కెట్లో విడుదల చేసింది. డుకాటి విడుదల చేసిన ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

డుకాటి కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల మరో అడ్వెంచర్ బైక్ విడుదల చేసింది. దీని పేరు 'మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్' (Multistrada V4 Pikes Peak). ఈ కొత్త బైకు ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

ఈ కొత్త లేటెస్ట్ బైక్ కొనాలనుకునే కస్టమర్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, పూణె మరియు బెంగళూరులోని కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

కొత్త డుకాటి మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ప్రత్యేకంగా అడ్వెంచర్ చేయడానికి ఆసక్తి చూపే రైడర్ల కోసం రూపొందించబడింది. కావున చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో ఎలక్రికల్లీ అడ్జస్టబుల్ ఓహ్లిన్స్ సస్పెన్షన్, సింగిల్-సైడ్ స్వింగార్మ్ మరియు 17 ఇంచెస్ రిమ్స్ పొందుతుంది.

డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

డుకాటి మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్ బైక్ అద్భుతమైన పనితీరుని అందించడానికి ఇందులో 1,158 సిసి లిక్విడ్ కూల్డ్ 90-డిగ్రీ వి4 ఇంజిన్ అందించడం జరిగింది. కావున ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 170 హెచ్‌పి పవర్ మరియు 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.

డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

కొత్త డుకాటి బైక్ అడ్జస్టబుల్ సీటుని పొందుతుంది. కావున దీనిని రైడర్ 810 మిమీ నుంచి 860 మిమీ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది 22 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది, కావున లాంగ్ రైడ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. అదే సమయంలో ఇందులో అల్యూమినియం మోనోకోక్ ఫ్రేమ్ మరియు బ్రేకింగ్ హార్డ్‌వేర్ మొత్తం కూడా మల్టీస్ట్రాడా V4లో కనిపించే విధంగానే ఉంటాయి.

డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

ఈ కొత్త బైక్ అడ్వెంచర చేయడానికి అనుకూలంగా ఉండటానికి, ముందు భాగంలో 120/70-ZR17 మరియు వెనుక భాగంలో 190/55-ZR17 టైర్లతో 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. మొత్తం మీద ఈ బైక్ బరువు కూడా ఇప్పుడు దాని మునుపటి మోడల్స్ కంటే కొంత తక్కువగానే ఉంది.

డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

కొత్త మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్ బైక్ రియర్ సెట్ ఫుట్‌పెగ్‌లు, లో హ్యాండిల్‌బార్ మరియు చిన్న ఫ్రంట్ విండ్‌స్క్రీన్‌ వంటి వాటిని పొందుతుంది. అదే సమయంలో ఈ బైక్ 6.5 ఇంచెస్ TFT డిస్‌ప్లే కూడా పొందుతుంది. ఇందులో బైక్ గురించి మరింత సమాచారం రైడర్ తెలుసుకోవచ్చు. మొత్తం మీద ఈ బైక్ అన్ని విధాలుగా రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.

డుకాటి నుంచి విడుదలైన మరో కొత్త బైక్.. ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఈ పండుగ సీజన్లో విడుదలైన అత్యంత ఖరీదైన బైక్ ఇదే అని చెప్పాలి. ఈ బైక్ దేశీయ విఫణిలో బిఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ (BMW S 1000 XR) కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్ బైక్ ధర దాని ప్రత్యర్థి అయిన బిఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్ కంటే ఏకంగా రూ. 10 లక్షలు ఎక్కువ. కావున మార్కెట్లో ఈ బైక్ ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది, ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, October 11, 2022, 10:03 [IST]
English summary
Ducati multistrada v4 pikes peak launched price features specs and engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+