Ducati నుంచి కొత్త బైక్ వచ్చేసింది.. ధర రూ. 12.89 లక్షలు
ప్రముఖ ఇటాలియన్ సూపర్‌బైక్ బ్రాండ్ డుకాటి (Ducati) భారతీయ మార్కెట్లో తన కొత్త 'డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో' (Ducati Scrambler 1100 Tribute PRO) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 12,89,000 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకూండా ఇది అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. కావున బైక్ వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద ఈ కొత్త బైక్ ప్రత్యేక మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది.

డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్ దాని ఎయిర్-కూల్డ్ ట్విన్-సిలిండర్ ఇంజన్ చరిత్రకు నివాళులు అర్పించేందుకు తయారుచేయబడినట్లు తెలుస్తోంది. కావున ఇది బ్లాక్ ఫ్రేమ్‌తో కూడిన స్పెషల్ "గియాలో ఓక్రా" లివరీ మరియు సబ్ ఫ్రేమ్‌తో బ్రౌన్ సీటు వంటి వాటిని కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.

డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్ దాని స్క్రాంబ్లర్ DNAకి కట్టుబడి ఉంటుంది, అదే సమయంలో బోర్గో పానిగేల్ చరిత్రకు ప్రత్యేకమైన "గియాలో ఓక్రా" లివరీ ద్వారా నివాళులర్పించింది. ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో కంపెనీ యొక్క మొదటి లాంచ్ డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో. ఇది చాలా ఆకర్షణీయమైన కలర్ ఆప్సన్ కూడా పొందుతుంది.

కొత్త డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో అనేది ఎయిర్-కూల్డ్ ట్విన్-సిలిండర్ ఇంజన్ చరిత్రకు నివాళి అర్పించడానికి రూపొందించబడింది. దాదాపు యాభై సంవత్సరాల తర్వాత, ఇది 1971లో డుకాటి 750 GTతో మొదటిసారిగా డుకాటీలో ప్రవేశపెట్టబడింది. ఇది బోర్గో పానిగేల్ సంస్థ యొక్క చరిత్రకు నివాళులు అర్పిస్తుంది.

డుకాటి ట్విన్-సిలిండర్ 450 డెస్మో మోనో మరియు 750 స్పోర్ట్ ఆఫ్ 1972లో ఉపయోగించింది. ఇది ట్రిబ్యూట్ 1975 నుండి స్పగ్గియారీ టీమ్ ఉపయోగించిన 750 సూపర్‌స్పోర్ట్‌ను గుర్తుచేస్తుంది. అంతే కాకూండా ఇది మరొక గొప్ప డుకాటీ రైడర్ ఫ్రాంకో అన్‌సిని యొక్క పురాణ కాలానికి నాంది పలికింది.

డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో, 1970ల నాటి ఐకానిక్ డుకాటి లోగో, బ్లాక్ స్పోక్డ్ వీల్స్, సర్క్యులర్ రియర్-వ్యూ మిర్రర్‌లు మరియు డెడికేటెడ్ స్టిచింగ్‌తో బ్రౌన్ సీటుతో రూపొందించబడిన ఐకానిక్ 1970ల వినియోగానికి సంబంధించిన మరిన్ని స్టైలింగ్ ఎలిమెంట్స్ పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో బైక్ లేటెస్ట్ క్లాసిక్ బైక్‌లను ఇష్టపడే వారి కోసం కంపెనీ రూపొందించిన అద్భుతమైన మోటార్‌సైకిల్.

ఈ కొత్త బైక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో డెస్‌మోడ్రోమిక్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఎయిర్ కూలింగ్‌తో 1079cc L-ట్విన్ ఇంజన్ ఉంది. ఇది 7,500 rpm వద్ద 86 బిహెచ్‌పి పవర్ మరియు 4,750 rpm వద్ద 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

డుకాటి స్క్రాంబ్లర్ కుటుంబంలోని దాదాపు అన్ని బైక్‌లకు విలక్షణమైన ఛాసిస్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో కార్నరింగ్ ABS మరియు డుకాటి ట్రాక్షన్ కంట్రోల్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా డుకాటి ప్రియులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. కావున మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తాయి.

మొత్తం మీద 2022 సంవత్సరంలో డుకాటి నుంచి కొత్త 'డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో' విడుదలైంది. అయితే దేశీయ మార్కెట్లో ఈ బైక్ ఎలాంటి అమ్మకాలను పొందుతుంది మరియు ప్రజాదరణ పొందటంలో విజయం సాధిస్తుందా అనే మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఈ బైక్ యొక్క డెలివరీలు కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. కొనుగోలుదారులు ఇప్పుడే త్వరపడవచ్చు. డెలివరీలు కూడా త్వరలోనే జరుగుతాయి. అంతే కాకూండా ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.మీకు నచ్చిన బైక్ మరియు కారు గురించి మొత్తం సమాచారం తెలుసుకోండి.


Click it and Unblock the Notifications








