భారతదేశంలో కొత్త తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ఇబైక్‌గో, సరికొత్త ట్రైక్ కూడా వస్తోంది..!
ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఇ-బైక్-గో (eBikeGo) దాని అనుబంధ సంస్థ అయిన వజ్రం ఎలక్ట్రిక్ (Vajram Electric) ద్వారా మువీ (Muvi) మరియు వెలోసిపెడో (Velocipedo) బ్రాండ్‌ల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు భారతదేశంలో తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం పవర్‌ట్రెయిన్‌లతో పాటు అనేక రకాల ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలతో ఈ సౌకర్యాన్ని అభివృద్ధి చేస్తామని ఇబైక్‌గో తెలిపింది.

త్వరలోనే త్రిచక్ర వాహనాల ఉత్పత్తి ప్రారంభం
వజ్రం ఎలక్ట్రిక్ అనేది ఇబైక్‌గో (eBikeGo) కంపెనీ యొక్క తయారీ అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక వ్యాపార సంస్థ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. స్పానిష్ ఆటోమోటివ్ కంపెనీ టారో నుండి యూరోపియన్ ఇ-స్కూటర్ మువీతో పాటు ఎలక్ట్రిక్ ట్రైక్ వెలోసిపెడో తయారీ హక్కులను కొనుగోలు చేస్తున్నట్లు కంపెనీ గత ఏడాది చివర్లో ప్రకటించిన సంగతి తెలిసినదే.

వజ్రం ఎలక్ట్రిక్ అత్యాధునిక టెక్నాలజీ మరియు బిజినెస్ ఇంటెలిజెన్స్ తో ఇంటిగ్రేటెడ్ EV (ఎలక్ట్రిక్ వెహికల్) పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుంది. వివిధ రకాల వాహనాల కాన్ఫిగరేషన్‌లను ఎనేబుల్ చేసే టూ-వీలర్ పవర్‌ట్రెయిన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. ఇబైక్‌గో మరియు దాని అనుబంధ సంస్థలు కలిసి దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాల యొక్క అనేక భవిష్యత్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలను తయారు చేయనున్నాయి.

ఈ సందర్భంగా ఇబైక్‌గో వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ, తమ కంపెనీ భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ ఈవీ పర్యావరణ వ్యవస్థను నిర్మించే మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుందని, ప్రస్తుతం మార్కెట్ కు ఈ డెడికేటెడ్ క్వాలిటీ ఈవీ తయారీ యూనిట్ యొక్క అవసరం చాలా ఉందని, ఈ నేపథ్యంలో వజ్రం ఎలక్ట్రిక్ ఈ లక్ష్యాన్ని సాధించడానికి మొదటి మరియు అన్నిటికంటే ముఖ్యమైన అడుగు అని చెప్పారు.

వజ్రం ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క భవిష్యత్తు రవాణా అవసరాలను తీర్చడానికి మాడ్యులర్, పర్పస్-బిల్ట్ ఈవీ లను అందిస్తుందని కంపెనీ తెలిపింది. వివిధ వినియోగ అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల శ్రేణి కోసం, కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ప్లాట్‌ఫారమ్ షేరింగ్‌ను ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఖర్చులను తగ్గించడంతో పాటు తక్కువ పరిమాణంలో మార్పులతో పనిచేయగలమని కంపెనీ తెలిపింది. ఈ విధానం వలన వాహనాల తయారీ ఖర్చు తక్కువగా ఉండి, సరసమైన ధరకే మార్కెట్ చేసే అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఇబైక్‌గో ప్రస్తుతం దేశంలోని ఏడు నగరాల్లో అందుబాటులో ఉంది మరియు అద్దెకు తీసుకున్న స్థలంలో 2,500 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం, ఈ కంపెనీ అన్ని ప్రధాన లాస్ట్-మైల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చాలా చురుకుగా పని చేస్తోంది మరియు దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో 2 శాతాన్ని లక్ష్యంగా చేసుకుని, దాదాపు 100 నగరాల్లో 2,00,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయాలనే ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉంది.

ఇ-బైక్-గో (eBikeGo) గడచిన ఆగస్ట్ 2021 నెలలో భారత మార్కెట్లో విడుదల తమ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ 'రగ్గడ్' (Rugged) ను విడుదల చేసింది. ఇది ఇటు సిటీ ప్రయాణానికి మరియు అటు ఆఫ్-రోడింగ్ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుంది. ఇదొక మోటో-స్కూటర్, అంటే ఇది చిన్న స్కూటర్ లాంటి టైర్లను మరియు మోపెడ్ లాంటి బాడీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇబైక్‌గో రగ్గడ్ ఎలక్ట్రిక్ బైక్ మొత్తం రెండు వేరియంట్లలో విడుదలైంది. వీటిలో G1 మరియు G1+ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి.

విడుదల సమయంలో రగ్గడ్ జి1 ధర రూ. 79,999 కాగా, రగ్గడ్ జి1+ ధర రూ. 99,999 (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటో స్కూటర్ దాని పేరుకు తగినట్లుగానే మంచి రగ్గడ్ పెర్ఫార్మెన్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటో-స్కూటర్ లో 3 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇందులో రెండి వేరు చేయగల 2 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. పూర్తి ఛార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 160 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

వజ్రం ఎలక్ట్రిక్ నుండి ఎలక్ట్రిక్ త్రీవీలర్ వస్తోంది
ఇబైక్‌గో గత ఏడాది నవంబర్‌లో ఆవిష్కరించిన Velocipedo ఎలక్ట్రిక్ త్రీవీలర్ స్టాండర్డ్ ద్విచక్ర వాహనం కంటే సురక్షితమైనదని కంపెనీ పేర్కొంది. వెలోసిపెడో ట్రైక్ దాని డిజైన్ మరియు ప్రాక్టికాలిటీకి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన 'రెడ్‌డాట్ డిజైన్ అవార్డ్'ని కూడా పొందింది. వెలోసిపెడో అనేది స్పానిష్ ఆటో కంపెనీ టొరోట్ చే తయారు చేయబడిన మూడు చక్రాల స్మార్ట్ ట్రైసైకిల్. దీనికి ముందు రెండు చక్రాలు మరియు వెనుక ఒక చక్రం ఉంటాయి. విశేషమేమిటంటే, ఈ ఎలక్ట్రిక్ ట్రైక్ బాడీ మొత్తం కార్బన్ ఫైబర్‌తో తయారు చేయబడింది. ఫలితంగా, ఇది లైట్ వెయిట్‌ను కలిగి ఉంటూనే ధృడమైన బాడీని కలిగి ఉంటుంది. ఇదొక డబుల్-సీటర్ త్రీవీలర్, దీనిపై ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.


Click it and Unblock the Notifications








