కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

దేశీయ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారు ఇమోటోరాడ్ (EMotorad, EM) మార్కెట్లో రెండు కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో ఇమోటోరాడ్ టి-రెక్స్ ప్లస్ (EMotorad T-Rex +) అనే అధునాతన ఎలక్ట్రిక్ సైకిల్ మరియు ఇమోటోరాడ్ లిల్ ఈ (EMotorad Lil E) అనే ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్‌లు ఉన్నాయి. ఇందులో ఇమోటోరాడ్ లిల్ ఈ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ చాలా ప్రత్యేకమైనది. ప్రస్తుతం, కంపెనీ దీనిని కేవలం రూ.26,999 పరిచయ ప్రారంభ ధరకే విక్రయిస్తోంది. వచ్చే నెలలో దీని ధర రూ.29,999 లకు చేరుకోనుంది.

కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

ఇమోటోరాడ్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం ఐదు మోడళ్లు ఉన్నాయి. వీటిలో టి-రెక్స్ (T-Rex), టి-రెక్స్ ప్లస్ (T-Rex +), ఈఎమ్ఎక్స్ (EMX) మరియు డూడుల్ (Doodle) అనే నాలుగు మోడళ్లు ఎలక్ట్రిక్ సైకిళ్లు కాగా, లిల్ ఈ (Lil E) అనేది ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ గా ఉంటుంది. మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

* ఇమోటోరాడ్ లిల్ ఈ - రూ.26,999

* ఇమోటోరాడ్ టి-రెక్స్ ప్లస్ - రూ.42,999

* ఇమోటోరాడ్ టి-రెక్స్ ప్లస్ - రూ.49,999

* ఇమోటోరాడ్ ఈఎమ్ఎక్స్ - రూ.58,999

* ఇమోటోరాడ్ డూడుల్ - రూ.79,800

కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

ఇమోటోరాడ్ అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లు అన్నీ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ సైకిళ్లు. ఇవి గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే పరుగులు తీస్తాయి. కాబట్టి, వీటిని రోడ్లపై నడిపేందుకు రిజిస్ట్రేషన్, లైసెన్స్ వంటి వి అవసరం లేదు. ఈ మోడళ్లన్నీ కూడా గరిష్టంగా పూర్తి చార్జ్ పై 35 నుండి 45 కిలోమీటర్లకు పైగా రేంజ్ ను అందిస్తాయి. అదే పెడల్ పవర్ ను కూడా ఉపయోగించినట్లయితే, వీటి రేంజ్ మరింత ఎక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

అత్యాధునిక సాంకేతికత మరియు సుస్థిరతను మేళవించి తమ ఇ-సైకిళ్లను తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. కొత్త Lil-E ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్ ప్రారంభంతో, భారతదేశంలో eMotorad ఓ కొత్త అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం సరికొత్త అంచనాలను ఏర్పాటు చేసింది. రద్దీగా ఉండే పట్టణాలలో చిన్నపాటి దూరాలను చేరుకునేందుకు లిల్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఫోల్డింగ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది కాబట్టి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించే వారు కూడా దీన్ని సులువుగా మడతపెట్టి, తమ వెంట తీసుకెళ్లవచ్చు.

కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

ఇమోటోరాడ్ లిల్ ఈ (EMotorad Lil E) స్పెసిఫికేషన్లు:

ఇమోటోరాడ్ లిల్ ఈ ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్‌ను ధృడమైన అల్లాయ్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఇందులో ఐపి65 రేటెడ్ 250 వాట్ ఫ్రంట్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ఆన్‌బోర్డ్ 36 వోల్ట్ 7.5 యాంప్స్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 20 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిస్‌ప్లే, ఇరు వైపులా 85 ఇంచ్ హనీకోంబ్ టైర్లు మరియు వైనుక వైపు డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

ఇమోటోరాడ్ టి-రెక్స్ (EMotorad T-Rex) స్పెసిఫికేషన్లు:

ఇమోటోరాడ్ టి-రెక్స్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను 17 ఇంచ్ యునిసెక్స్ అల్యూమినియం అల్లాయ్ 6061 ఫ్రేమ్‌పై తయారు చేశారు. ఇందులో ఐపి65 రేటెడ్ 250 వాట్ బిఎల్‌డిసి రియర్ జియాబో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ప్రంట్ ఫ్రేమ్‌కి అమర్చిన 36 వోల్ట్ 7.5 యాంప్స్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 35 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది. అదే పెడల్ అసిస్ట్‌ను ఉపయోగిస్తే దాని రేంజ్ 50 కి.మీ వరకూ ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 5-6 గంటల సమయం పడుతుంది. ఇందులో 3 ఇంచ్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఇరు వైపులా డిస్క్ బ్రేకులు, ముందు వైపు 100 మిమీ ట్రావెల్‌తో కూడిన సస్పెన్షన్, 7-స్పీడ్ షిమానో గేర్‌బాక్స్ మరియు 26" x 2.0" షావోయాంగ్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

ఇమోటోరాడ్ టి-రెక్స్ ప్లస్ (EMotorad T-Rex +) స్పెసిఫికేషన్లు:

ఇమోటోరాడ్ టి-రెక్స్ ప్లస్‌ను కూడా టి-రెక్స్ ఫ్రేమ్‌పైనే తయారు చేశారు. ఇందులో ఐపి65 రేటెడ్ 250 వాట్ బిఎల్‌డిసి రియర్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ప్రంట్ ఫ్రేమ్‌కి అమర్చిన 36 వోల్ట్ 10.4 యాంప్స్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 45 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది. అదే పెడల్ అసిస్ట్‌ను ఉపయోగిస్తే దాని రేంజ్ 60 కి.మీ వరకూ ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 4-5 గంటల సమయం పడుతుంది. ఇందులో 3 ఇంచ్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఇరు వైపులా డిస్క్ బ్రేకులు, ముందు వైపు 100 మిమీ ట్రావెల్‌తో కూడిన సస్పెన్షన్, 7-స్పీడ్ షిమానో గేర్‌బాక్స్ మరియు 27.5" x 2.0" ఆల్-టెర్రైన్ టైర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

ఇమోటోరాడ్ ఈఎమ్‌ఎక్స్ (EMotorad EMX) స్పెసిఫికేషన్లు:

ఇమోటోరాడ్ ఈఎమ్‌ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిల్‍ను 16 ఇంచ్ యునిసెక్స్ అల్యూమినియం అల్లాయ్ 6061 ఫ్రేమ్‌పై తయారు చేశారు. ఇందులో 36 వోల్ట్ 250 వాట్ బిఎల్‌డిసి రియర్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ప్రంట్ ఫ్రేమ్‌కి అమర్చిన 36 వోల్ట్ 10.4 యాంప్స్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 50 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది. అదే పెడల్ అసిస్ట్‌ను ఉపయోగిస్తే దాని రేంజ్ 70 కి.మీ వరకూ ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 4-5 గంటల సమయం పడుతుంది. ఇందులో 5 ఇంచ్ మల్టీ ఫంక్షనల్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఇరు వైపులా డిస్క్ బ్రేకులు, ముందు వైపు 100 మిమీ ట్రావెల్‌తో కూడిన సస్పెన్షన్, 21-స్పీడ్ షిమానో గేర్‌బాక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి

కేవలం రూ.26,999 ఎలక్ట్రిక్ కిక్ స్కూటర్..! స్పీడ్ 25 కిలోమీటర్లు.. రేంజ్ 45 కిలోమీటర్లు..!!

ఇమోటోరాడ్ డూడుల్ (EMotorad Doodle) స్పెసిఫికేషన్లు:

ఇమోటోరాడ్ డూడుల్ 16 ఇంచ్ యునిసెక్స్ అల్యూమినియం అల్లాయ్ 6061 ఫ్రేమ్‌పై తయారు చేశారు. ఇందులో ఐపి65 రేటెడ్ 250 వాట్ బిఎల్‌డిసి రియర్ హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది ప్రంట్ ఫ్రేమ్‌కి అమర్చిన 36 వోల్ట్ 10 యాంప్స్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 40 కిలోమీటర్ల వరకూ రేంజ్‌ను అందిస్తుంది. అదే పెడల్ అసిస్ట్‌ను ఉపయోగిస్తే దాని రేంజ్ 50 కి.మీ వరకూ ఉంటుంది. ఈ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 5-6 గంటల సమయం పడుతుంది. ఇందులో 3 ఇంచ్ మల్టీఫంక్షనల్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఇరు వైపులా డిస్క్ బ్రేకులు, ముందు వైపు 100 మిమీ ట్రావెల్‌తో కూడిన సస్పెన్షన్, 7-స్పీడ్ షిమానో గేర్‌బాక్స్ మరియు 20" x 4" ఫ్యాట్ టైర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Emotorad launches t rex plus e cycle and lil e electric kick scooter price specs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X