కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, పెట్రోల్ టూవీలర్లను విక్రయించే టాప్ కంపెనీలు కూడా ఇప్పుడు కనీసం ఒక్కటైనా ఎలక్ట్రిక్ టూవీలర్ ను అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ కోవలోనే దేశపు టాప్ టూవీలర్ బ్రాండ్లలో ఒకటైన టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఐక్యూబ్ (iQube) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను విక్రయిస్తోంది. తాజాగా, ఇందులో కంపెనీ ఓ కొత్త 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. మరి ఈ కొత్త మోడల్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

2022 టీవీఎస్ ఐక్యూబ్ - వేరియంట్లు, ధరలు

ఇప్పటి వరకూ టీవీఎస్ ఐక్యూబ్ ఒక్క వేరియంట్లో మాత్రమే లభ్యమవుతూ వచ్చింది. కాగా, ఈ కొత్త 2022 మోడల్ లో కంపెనీ ఇప్పుడు మూడు వేరియంట్లను పరిచయం చేసింది. ఈ వేరియంట్లను బట్టి, ఇందులో లభించే ఫీచర్లు, వాటి రేంజ్ కూడా మారుతూ ఉంటాయి. ఈ కొత్త వేరియంట్లలో ఐక్యూబ్ (iQube), ఐక్యూబ్ ఎస్ (iQube S) మరియు ఐక్యూబ్ ఎస్‌టి (iQube ST) వేరియంట్లు ఉన్నాయి. ఇందులో ఐక్యూబ్ వేరియంట్ ధర రూ. 98,564 కాగా, ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ధర రూ. 1,08,690 గా ఉంది (అన్ని ధరలు ఆన్ రోడ్, ఢిల్లీ). కాగా, ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

2022 టీవీఎస్ ఐక్యూబ్ - డిజైన్

కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ డిజైన్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు లేవు. దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ఈ కొత్త 2022 మోడల్ కొద్దిగా 'బాక్సీ' డిజైన్‌ ను కలిగి ఉంటుంది. కాగా, TVS iQube S మరియు TVS iQube ST వేరియంట్‌ల విజర్ డిజైన్ లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉంటాయి. అలాగే, ఈ రెండు వేరియంట్లు కూడా స్టాండర్డ్ వేరియంట్ కన్నా కొంచెం పెద్దగా ఉండే టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతాయి.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

2022 టీవీఎస్ ఐక్యూబ్ - ఫీచర్లు

టీవీఎస్ తమ పెట్రోల్ పవర్డ్ స్కూటర్లలో అందిస్తున్న లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని ఈ కొత్త ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా పరిచయం చేసింది. కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ ఇప్పుడు ఈ బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ (TVS SmartXonnet) కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. దీనికోసం ఇందులో 5 ఇంచ్ ఫుల్ కలర్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లేను 5-వే జాయ్‌స్టిక్ ద్వారా నావిగేట్ చేయవచ్చు.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

కాగా, iQube S మరియు iQube ST వేరియంట్లు అప్‌గ్రేడ్ చేయబడిన 7 ఇంచ్ ఫుల్ కలర్ TFT యూనిట్‌ను పొందుతాయి. అయితే ఇందులో ST వేరియంట్ మాత్రమే టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఆప్షన్ ను పొందుతుంది. లేటెస్ట్ TVS SmartXonnect సిస్టమ్ సాయంతో రైడర్లు మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్, OTA అప్‌డేట్‌లు, వాహన ఆరోగ్య స్థితి, భద్రతా నోటిఫికేషన్‌లు మరియు బహుళ బ్లూటూత్ మరియు క్లౌడ్ కనెక్టివిటీ ఎంపికలతో సహా అనేక కనెక్టివిటీ ఫీచర్‌లను పొందుతారు.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

టాప్-ఎండ్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక అడ్జస్టబుల్ ట్విన్ షాక్‌లు, ఫ్రంట్ 220 మిమీ డిస్క్ బ్రేక్‌లు, వెనుక 130 డ్రమ్ బ్రేక్, ఎల్ఈడి లైటింగ్, మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, కీలెస్ అన్‌లాకింగ్, సోషల్ మీడియా, ఇరువైపులా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై 90/90-12 సెక్షన్ టైర్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

2022 టీవీఎస్ ఐక్యూబ్ - బ్యాటరీ, రేంజ్, పవర్‌ట్రైన్ మరియు పెర్ఫార్మెన్స్

టీవీఎస్ తమ కొత్త 2022 మోడల్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో బ్యాటరీ ప్యాక్స్ ని అప్‌గ్రేడ్ చేసింది. ఇందులోని ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ రెండు వేరియంట్లు కూడా ఒకే రకమైన 3.4 kwh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటాయి. ఇవి రెండూ పూర్తి ఛార్జ్‌ పై గరిష్టంగా 100 కిమీ రేంజ్ ను అందిస్తాయి. కాగా, కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ లో పెద్ద 5.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 140 కిలోమీటర్ల రియల్ టైమ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

గతంలో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కేవలం 2.2kWh బ్యాటరీ ప్యాక్‌ని మాత్రమే ఉపయోగించేది. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ కొత్త 2022 మోడల్ ను పెద్ద 3.4kWh మరియు 5.1kWh బ్యాటరీ ప్యాక్ లతో అందిస్తోంది. అంతేకాకుండా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ఇప్పుడు అదనపు 'పవర్' మోడ్‌తో వస్తుంది. ఈ పవర్ మోడ్ సాయంతో రైడర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో రైడ్ చేయవచ్చు.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎలక్ట్రిక్ మోటార్ లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. మునుపటి మమోడళ్లలో ఉపయోగించిన అదే 4.4kW ఎలక్ట్రిక్ మోటారును ఈ కొత్త 2022 మోడల్ లో కూడా ఉపయోగించింది. అయితే, TVS ఇందులో ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని అప్‌గ్రేడ్ చేసింది. ఇందులోని బ్రష్‌లెస్ హబ్-మౌంటెడ్ DC మోటారు ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఇది గరిష్టంగా 5.9 బిహెచ్‌పి శక్తిని మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

ఈ బ్యాటరీ ప్యాక్‌లు అన్నీ కూడా IP67 మరియు AIS156 సర్టిఫైడ్ చేయబడి, UL2271, ISO 12405 మరియు UN38.3 నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మూడు వేరియంట్‌లు కూడా కేవలం 4.2 సెకన్లలో గంటకు గరిష్టంగా 0 నుండి 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు . వీటిలో iQube మరియు iQube S యొక్క టాప్ స్పీడ్ 78 kmph గా ఉంటే, iQube ST యొక్క టాప్ స్పీడ్ 84 kmph గా ఉంటుంది.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

2022 టీవీఎస్ ఐక్యూబ్ - చార్జింగ్

టీవీఎస్ తమ కొత్త 2022 మోడల్ ఐక్యూబ్ కోసం చార్జర్ ఆప్షన్లను కూడా అప్‌గిరేడి చేసింది. ఇందులో ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ వేరియంట్లు రెండూ కూడా 650W మరియు 950W ఛార్జర్ లను సపోర్ట్ చేస్తాయి. ఇవి 650W ఛార్జర్‌తో చార్జ్ చేసినప్పుడు నాలుగున్నర గంటల వ్యవధిలో 0-100 శాతం ఛార్జ్ అవుతాయి. అదే 950W ఛార్జర్ తో అయితే ఆ సమయాన్ని కేవలం 2 గంటల 50 నిమిషాలకు తగ్గించవచ్చు. కాగా, ఐక్యూబ్ ఎస్‌టి వేరియంట్ 950W మరియు 1.5kW ఛార్జర్లను సపోర్ట్ చేస్తుంది. ఇది 950W ఛార్జర్‌ తో 4 గంటల 6 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది మరియు1.5kW (1500W) ఛార్జర్ కేవలం రెండున్నర గంటలలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది.

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

2022 టీవీఎస్ ఐక్యూబ్ - కలర్ ఆప్షన్లు

గతంలో టీవీఎస్ ఐక్యూబ్ కేవలం ఒకే ఒక (వైట్ కలర్) రంగులో మాత్రమే విక్రయించబడేది. కాగా, ఈ కొత్త 2022 మోడల్ ఐక్యూబ్ మొత్తం 11 ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. వీటిలో ఐక్యూబ్ కోసం 3, ఐక్యూబ్ ఎస్ కోసం 4 మరియు ఐక్యూబ్ ఎస్‌టి కోసం 4 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వేరియంట్ల వారీ కలర్ ఆప్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి:

టీవీఎస్ ఐక్యూబ్ కలర్స్:

- షైనింగ్ రెడ్

- టైటానియం గ్రే గ్లోసీ

- పెరల్ వైట్

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ కలర్స్:

- మెర్క్యూరీ గ్రే గ్లోసీ

- మింట్ బ్లూ

- లూసిడ్ యల్లో

- కాపర్ బ్రాంజ్ గ్లోసీ

టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి కలర్స్:

- స్టార్‌లైట్ బ్లూ గ్లోసీ

- టైటానియం గ్రే మ్యాట్

- కోరల్ శాండ్ గ్లోసీ

- కాపర్ బ్రాంజ్ మ్యాట్

కొత్త 2022 టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి డీటేల్స్.. మీ కోసం..

2022 టీవీఎస్ ఐక్యూబ్ - హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధరలు

హైదరాబాద్ మార్కెట్లో కొత్త 2022 మోడల్ టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ.1,67,725 కాగా, ఇందులో రూ.51,000 ఫేమ్ 2 సబ్సిడీ పోనూ రూ.1,14,725 లకే లభిస్తుంది.

అలాగే, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ.1,71,846 కాగా, ఇందులో రూ.51,000 ఫేమ్ 2 సబ్సిడీ పోనూ రూ.1,20,846 లకే లభిస్తుంది.

(అన్ని ధరలు ఆన్-రోడ్ హైదరాబాద్, మే 20, 2022 నాటికి).

Most Read Articles

English summary
Everything you need to know about new 2022 tvs iqube price battery range specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X