EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

ఈ మధ్య కాలంలో భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ బైకులు మరియు స్కూటర్లు ఉన్నాయి. అయితే ఈ రోజు గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న '2022 ఈవి ఇండియా ఎక్స్‌పో' (2022 EV India Expo) లో 'ఈవిట్రిక్ మోటార్స్' (EVTRIC Motors) కంపెనీ తన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది.

Recommended Video

Ola Electric Scooter First Impressions In Telugu | S1Pro Model Range, Top Speed & Other Details

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క ధర మరియు రేంజ్ వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఈవిట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'రైడ్ హెచ్ఎస్' (Ride HS) కాగా, మరొకటి 'మైటీ ప్రో' (Mighty Pro) ఎలక్ట్రిక్ స్కూటర్. వీటి ధరలు వరుసగా రూ. 81,838 మరియు రూ. 79,567 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లేదా డీలర్‌షిప్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

EVTRIC రైడ్ హెచ్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్:

మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో 'Evtric రైడ్ హెచ్ఎస్' అనేది ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 81,838 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది మార్కెట్లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్షిస్తుంది.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

'EVTRIC రైడ్ హెచ్ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో విడుదలైంది. అవి రెడ్, బ్లాక్, వైట్ మరియు గ్రే కలర్స్. ఇవన్నీ కూడా చూడచక్కగా ఉంటాయి. కావున కస్టమర్లు ఈ నాలుగు కలర్స్ లో తమకి నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 55 కిమీ వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అమర్చబడిన బ్యాటరీ కేవలం 4 గంటల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. కావున ఛార్జ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదు.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

EVTRIC మైటీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్:

ఇక రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన 'EVTRIC మైటీ ప్రో' విషయానికి వస్తే, దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 79,567 (ఎక్స్-షోరూమ్). ఇది కేవలం మూడు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి రెడ్, వైట్ మరియు గ్రే కలర్స్. ఇది బ్లాక్ కలర్ లో అందుబాటులో లేదు.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

EVTRIC మైటీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. ఇది కూడా కేవలం 4 గంటల సమయంలో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకూండా దీని గరిష్ట పరిధి (రేంజ్) కూడా 120 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటకు 65 కిమీ వరకు ఉంటుంది.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలైనా సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ 'శ్రీ మనోజ్ పాటిల్' మాట్లాడుతూ.. భారతదేశం క్రమంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకెళుతోంది. కావున ఈ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో విడుదలకావల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో మేము రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల చేయడం జరిగింది.

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు EV ఎక్స్-పో ఇండియా వేదికపై విడుదల చేయడం వల్ల ఎంతోమంది ఔత్సాహికులు మరియు ఇతర పారిశ్రామిక వేత్తలు చూడగలరు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు తప్పకుండా తమ విభాగంలో మంచి ఆదరణ పొందుతాయని ఆశిస్తున్నామని అన్నారు.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

EVTRIC మోటార్స్ ప్రస్తుతం దేశీయ విఫణిలో రైడ్, యాక్సిస్, మైటీ, రైజ్, కనెక్ట్, రైడ్ ప్రో, రైడ్ హెచ్ఎస్ మరియు మైటీ ప్రో అనే మొత్తం 8 ఉత్పత్తులను విడుదల చేసింది. అంతే కాకుండా ఈ కంపెనీకి భారతదేశం అంతటా దాదాపు 200 కి పైగా డీలర్‌షిప్‌లు కూడా ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో కంపెనీ వీటి సంఖ్యను 500 కి పెంచడానికి తగిన ప్రయత్నాలు మరియు కృషి చేస్తోంది.

EV India Expo 2022: దేశీయ మార్కెట్లో రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

గ్రేటర్ నోయిడాలో ఎంతో అట్టహాసంగా జరుగుతున్న EV India Expo 2022 లో EVTRIC మోటార్స్ తమ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేయడం వల్ల ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్శించే అవకాశం ఉంది. కావున రానున్న రోజుల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. EV India Expo 2022 లో ఆవిష్కరించబడే వాహనాలు మరియు విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 7, 2022, 15:27 [IST]
English summary
Evtric motors ride hs mighty pro launched at ev india expo details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+