ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్ అందించే EVTRIC RISE బైక్ భారత్‌లో విడుదల: పూర్తి వివరాలు

భారతీయ ఎలక్ట్రిక్ వాహన విభాగం రోజు రోజుకి బాగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగానే చాలా వాహన తయారీ సంస్థలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ వాహనాలను భారతీయ మార్కెట్లో విడుదల చేసాయి.. విడుదల చేస్తున్నాయి. అయితే ఇప్పుడు పూణెకి చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఈవిట్రిక్ మోటార్స్' (EVTRIC Motors) దేశీయ విపణిలో ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ పేరు 'ఈవిట్రిక్ రైస్' (EVTRIC RISE). ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్ అందించే EVTRIC RISE బైక్ భారత్‌లో విడుదల: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఈవిట్రిక్ రైస్' (EVTRIC RISE) ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 1,59,990 (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతే కాకూండా ఇది కంపెనీ యొక్క హై-ఎండ్ టెక్నాలజీ కలిగిన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్ అందించే EVTRIC RISE బైక్ భారత్‌లో విడుదల: పూర్తి వివరాలు

కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తమ 125 టచ్ పాయింట్ల ద్వారా విక్రయించబడుతుంది. ఇప్పటికే కంపెనీ దేశీయ మార్కెట్లో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయిస్తోంది. అవి ఈవిట్రిక్ యాక్సిస్ (Evtric Axis), ఈవిట్రిక్స్ రైడ్ (Evtric Ride) మరియు ఈవిట్రిక్స్ మైటీ (Evtric Mighty). ఇప్పుడు విడుదలైన కొత్త 'ఈవిట్రిక్స్ రైజ్' ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ యొక్క నాల్గవ మోడల్ అవుతుంది.

ఈవిట్రిక్స్ రైజ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ పూర్తిగా మేడ్-ఇన్-ఇండియా ప్రొడక్ట్. ఈ బైక్ బ్లాక్ అండ్ రెడ్ కాల్సర్స్ లో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు ఎల్ఈడీ టెయిల్‌లైట్ మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటి వాటిని పొందుతుంది. కావున డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్ అందించే EVTRIC RISE బైక్ భారత్‌లో విడుదల: పూర్తి వివరాలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ 70v/40ah లిథియం-అయాన్ బ్యాటరీతో జత చేయబడిన 2000 వాట్ BLDC మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది కేవలం 4 గంటల సమయంలోనే ఫుల్ ఛార్జ్ చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్ తో దాదాపు 110 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 70 కిలోమీటర్లు. కస్టమర్ల సౌలభ్యం కోసం కంపెనీ ఆటో కట్ ఫీచర్‌తో లభించే 10 యంపియర్ మైక్రో ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. ఈ బైక్ డిటాచబుల్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి ఛార్జింగ్ కూడా సులభంగా చేసుకునే అవకాశం ఉంటుంది.

ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్ అందించే EVTRIC RISE బైక్ భారత్‌లో విడుదల: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లోని కస్టమర్లు ఎపుడూ లేటెస్ట్ బైకులనే కొనుగోలు చేయడానికి ఆసక్తు చూపుతున్నారు, కావున కంపెనీ కూడా తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను లేటెస్ట్ డిజైన్ తో విడుదల చేసింది. ఈ ఆధునిక డిజైన్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉన్న కారణంగా ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున ఈ 'ఈవిట్రిక్ రైస్' (EVTRIC RISE) ఎలక్ట్రిక్ బైక్ కూడా తప్పకుండా ఉత్తమ అమ్మకాలను పొందుతుంది అని ఆశిస్తున్నాము. ఎలక్ట్రిక్ వాహనాలు ఇంధన ధరల నుంచి విముక్తి కల్పించడమే కాకుండా కాలుష్య రహిత వాతావరణాన్ని నెలకొల్పడానికి ఉపయోగపడుతుంది.

ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్ అందించే EVTRIC RISE బైక్ భారత్‌లో విడుదల: పూర్తి వివరాలు

'ఈవిట్రిక్ రైస్' (EVTRIC RISE) ఎలక్ట్రిక్ బైక్ విడుదల సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు మరియు మ్యానేజింగ్ డైరెక్టర్ 'శ్రీ మనోజ్ పాటిల్' మాట్లాడుతూ.. మా ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ యొక్క మొట్టమొదటి 'మేక్ ఇన్ ఇండియా' ప్రోడక్ట్. కావున మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని కూడా తెలిపారు. ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన మా కొత్త ఎలక్ట్రిక్ బైక్ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నామన్నారు.

ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్ అందించే EVTRIC RISE బైక్ భారత్‌లో విడుదల: పూర్తి వివరాలు

ఇక 'ఈవిట్రిక్ మోటార్స్' (EVTRIC MOTORS) కంపెనీ విషయానికి వస్తే, ఇది పూణేలో 2021 వ సంవత్సరంలో స్థాపించబడింది. డీఐ ప్రధాన కార్యాలయం పూణేలోనే ఉంది. కావున వాహనాల డిజైన్ మొత్తం కూడా దాదాపుగా ఇక్కడే జరుగుతుంది. అయితే ఈ కంపెనీకి ఆటోమొబైల్ రంగంలో మంచి అనుభవం కూడా ఉంది. ఈ కారణంగానే దేశీయ విఫణిలో అధునాతన వాహనాలను విడుదలచేయడంలో విజయం పొందుతోంది.

ఒక్క ఛార్జ్‌తో 110 కిమీ రేంజ్ అందించే EVTRIC RISE బైక్ భారత్‌లో విడుదల: పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఈవిట్రిక్ మోటార్స్ నుంచి ఎట్టకేలకు 'ఈవిట్రిక్ రైస్' (EVTRIC RISE) ఎలక్ట్రిక్ బైక్ విడుదలైంది. అదే సమయంలో బుకింగ్స్ కూడా ప్రారంభించబడ్డాయి. అయితే ఈ బైక్ ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది, మంచి సంఖ్యలో అమ్ముడవుతుందా, భారతీయ మార్కెట్లో విజయం పొందుతుందా అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Most Read Articles

English summary
Evtric rise electric motorcycle launched in india details
Story first published: Wednesday, June 22, 2022, 12:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X