‘షట్ అప్ అండ్ రైడ్’..! ఇది ఫైర్‌ఫాక్స్ బ్యాడ్ యాటిట్యూడ్ టెన్ యొక్క అసలైన యాటిట్యూడ్..!!
బైసైకిల్ లేదా సైకిల్.. చిన్నప్పుడు అందరూ దీనిని నడిపే ఉంటారు. నిజానికి, ఆ సమయంలో ఇదే మనకు హ్యార్లే డేవిడ్సన్ లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో సమానంగా భావించే వాళ్లం. సైకిల్ నడపడం అనేది కొందరికీ అవసరం, మరికొందరికీ సరదా, ఇంకొందరికి ఇది వ్యాయామం. అవసరం ఏదైనప్పటికీ బైసైకిల్స్ మాత్రం పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైన రవాణా మార్గం మరియు ఆరోగ్యకరం కూడా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికీ చాలా మంది బైసైకిల్స్ ఉపయోగిస్తుంటారు. కొనుగోలుదారుల అవసరాల కోసం అనేక రకాల బ్రాండ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

మనదేశంలో సైకిల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే రెండు ప్రధాన బ్రాండ్లు అట్లాస్ మరియు హీరో. అయితే, గ్లోబలైజేషన్ పుణ్యమా అని అనేక అంతర్జాతీయ బైసైకిల్ బ్రాండ్లు ఇప్పుడు మనదేశంలో లభిస్తున్నాయి. అలాంటి పాపులర్ అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీగా మన స్వదేశీ సైకిల్ బ్రాండ్ ఫైర్‌ఫాక్స్ (Firefox) సరికొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లో విక్రయిస్తోంది. రైడర్ అవసరాలను బట్టి, కంపెనీ వివిధ సైక్లింగ్ విభాగాలలో బైసైకిళ్లను అందిస్తోంది. ధృడమైన లైట్ వెయిట్ ఫ్రేమ్స్, సరికొత్త గేర్ సిస్టమ్స్, అధునాతన టెక్నాలజీ మరియు ఫీచర్లతో రూపొందించిన సైకిళ్లు ఈ ఫైర్‌ఫాక్స్ బ్రాండ్ నుండి లభిస్తున్నాయి.

విభిన్నమైన మరియు విలక్షణమైన ఉత్పత్తులతో భారత ప్రీమియం సైకిల్ తయారీదారుల విభాగంలో ఫైర్‌ఫాక్స్ బ్రాండ్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. కాగా ఈ బ్రాండ్ అందిస్తున్న లేటెస్ట్ మోడల్ "ఫైర్‌ఫాక్స్ బ్యాడ్ యాటిట్యూడ్ టెన్" (Firefox Bad Attitude X) ను మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ రైడ్ చేసింది. మరి ఇది మిమ్మల్నిఆకట్టుకుందో లేదో ఈ కథనంలో చూద్దాం రండి.

అన్‌బాక్సింగ్ మరియు అసెంబ్లీ
ఫైర్‌ఫాక్స్ సైకిళ్లను స్థానిక డీలర్‌షిప్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని, ఇంటి వద్ద డెలివరీ కూడా పొందవచ్చు. చాలా సమయాల్లో, మెయిల్ ద్వారా ప్యాకేజీని డెలివరీ తీసుకోవడం చాలా ఉత్తేజకరంగా అనిపిస్తుంది. అందులోనూ, ప్యాకేజీ పెద్ద పరిమాణంలో ఉండి, దానికి ఇరువైపులా 'ఫైర్‌ఫాక్స్ సూపర్‌బైక్' అనే పదాలు కనిపించినప్పుడు ఆ ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఈ సైకిల్ బాక్స్ ను అన్‌బాక్స్ చేయడం చాలా సులువుగా అనిపించింది. ఇరువైపులా ఉన్న పట్టీలను కత్తిరించగానే, బ్యాడ్ యాటిట్యూడ్ బైక్ మీకు స్వాగతం చెబుతుంది.

భారతదేశంలో ఫైర్‌ఫాక్స్ బ్రాండ్ అందిస్తున్న ఉత్తమమైన సైకిళ్లలో Firefox Bad Attitude X కూడా ఒకటి. ఈ పేరులోని 'X' రోమన్ అంకెల్లో ఉంది, అందుకే దీనిని బ్యాడ్ యాటిట్యూడ్ 10 (టెన్) అని పిలుస్తారు. ఈ బాక్స్ ను ఓపెన్ చేయగానే, చిన్నపాటి అసెంబ్లింగ్ చేయడం ద్వారా మీరు ఈ యాటిట్యూడ్ సైకిల్‌ను పరుగులు పెట్టించవచ్చు. ఈ సైకిల్‌ను అసెంబుల్ చేయడానికి మనమేమీ ఇంజనీర్లు కానవసరం లేదు. దీని అసెంబ్లింగ్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. హ్యాండిల్‌బార్‌ని స్ట్రెయిట్ చేసి, ఆపై బిగించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే, పెడల్‌లను క్రాంక్ ఆర్మ్‌పై అమర్చాలి మరియు సీటు ఎత్తును సర్దుబాటు చేయాలి. వీటన్నింటికీ మా సమయం ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు.

డిజైన్ మరియు స్టైల్
సైకిల్ డిజైన్ సంవత్సరాలుగా మారుతూ వస్తోంది. నేటి ఆధునిక సైకిళ్లలో అనేక విభాగాలు ఉన్నాయి. వీటిలో రోడ్ బైక్‌లు, హైబ్రిడ్ బైక్‌లు, మౌంటైన్ బైక్‌లు అంటూ అనేక రకాలు ఉన్నాయి. చాలా మంది తయారీదారులకు ఒక స్టాండర్డ్ ఫ్రేమ్ డిజైన్ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మరియు అనుకూల సైకిళ్లు మాత్రమే భిన్నమైన ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. ఫైర్‌ఫాక్స్ తమ బ్యాడ్ యాటిట్యూడ్ టెన్ సైకిల్‌ను మౌంటెన్ బైక్‌గా వర్గీకరించింది, కాబట్టి దీని ఫ్రేమ్ డిజైన్ సాధారణమైనదిగా ఉండదు. ఈ సైకిల్‌పై వెనుక సస్పెన్షన్ లేనందున ఇది హార్డ్-టెయిల్ ఫ్రేమ్ గా ఉంటుంది. అయితే, స్మూత్ రైడ్స్ కోసం దీని ముందు భాగంలో టెలీస్కోపిక్ ఫోర్క్ హ్యాండ్లింగ్ సస్పెన్షన్ ఉంటుంది.

డైమండ్ ఫ్రేమ్ డిజైన్ ఆధారంగా బ్యాడ్ ఆటిట్యూట్ టెన్ రూపొందించబడింది. అయితే, ఇది హార్డ్‌కోర్ మౌంటెన్ బైక్ కాదు. ఈ సైకిల్ డిజైన్ దాదాపుగా హైబ్రిడ్ సైకిల్ కేటగిరీలోకి వస్తుంది. ఈ సైకిల్‌పై కనిపించే నాబీ టైర్లు సైకిల్‌కు మంచి లుక్ ని ఇవ్వడమే కాకుండా, మెరుగైన పనితీరును కూడా అందిస్తాయి. DSI ద్వారా తయారు చేయబడిన ఈ టైర్లు రగ్గడ్ లుక్ లో ఉంటాయి మరియు వదులుగా ఉన్న భూభాగంలో మంచి గ్రిప్‌ను అందిస్తాయి. స్టైలింగ్ పరంగా, బ్యాడ్ యాటిట్యూడ్ టెన్ లో చెప్పుకోదగిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇందులో సైకిల్‌పై కనిపించే బాంకర్స్ పెయింట్ జాబ్ మరియు గ్రాఫిక్స్ స్కీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఈ సైకిల్ యొక్క ప్రధాన బాడీ కలర్ సీసా గ్రీన్ మరియు ఆలివ్ గ్రీన్‌ల మిశ్రమంలా ఉంటుంది. అయితే, కంపెనీ మాత్రం కేవలం 'గ్రీన్' అని పిలవడానికే ఇష్టపడుతుంది. ఈ మోడల్ కేవలం ఒకే ఒక రంగులో లభిస్తుంది, అది ఇదే. బాడ్ యాటిట్యూడ్ X సైకిల్‌పై కేవలం 'గ్రీన్' కలర్ మాత్రమే కనిపించదు, ఇందులో నలుపు మరియు కొంచెం లేత నీలం రంగు కూడా కనిపిస్తుంది. ఫైర్‌ఫాక్స్ లోగో ఆకుపచ్చ ఫ్రేమ్ పై నలుపు రంగులో ఉంటుంది. ఫ్రంట్ ఫోర్క్ పూర్తిగా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడింది. సీటు ట్యూబ్ నుండి, ఒక గ్లోస్ బ్లాక్ షేడ్ కనిపిస్తుంది, ఇది ఒక రఫ్ ఫినిషింగ్ లాగా ఉంటుంది.

ఈ ఫ్రేమ్ యొక్క డౌన్ ట్యూబ్‌లో ఫైర్‌ఫాక్స్ బ్యాడ్జింగ్ మరియు లోగో నలుపు రంగులో ఉంటుంది, కానీ ఇది బ్లూ థీమ్ లో ఉంటుంది. ఈ రంగుల కలయికతో బ్యాడ్ యాటిట్యూడ్ టెన్ చాలా ప్రత్యేకమైన లుక్‌ను కలిగి ఉండి, స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులోని రిమ్స్ కూడా బ్లాక్‌లోనే ఉంటాయి. కాగా, గేర్లు కాంస్య రంగులో మెరుస్తుంటాయి. దీని డౌన్‌ట్యూబ్ బాటిల్ హోల్డర్ మౌంటు పాయింట్‌లను కలిగి ఉంటుంది, అయితే, ఈ బాటిల్ హోల్డర్ యాక్ససరీగా మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, దీనిని విడిగా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.

ఈ సైకిల్‌లో ఆఫ్-రోడ్ సైక్లింగ్‌కు అవసరమైన డెరైల్లర్ ప్రొటెక్టర్ (మడ్‌గార్డ్స్) కూడా లేవు. అయితే, కావాలనుకుంటే, కస్టమర్లు వీటిని విడిగా కొనుగోలు చేయవచ్చు. అలాగే, సైకిల్ లో అత్యంత అవసరమైన ఫీచర్ బెల్ కూడా ఇందులో లేదు, దీనిని కూడా విడిగా కొనుగోలు చేయవచ్చు. ఈ సైకిల్ వెనుక సబ్‌ఫ్రేమ్‌పై ముద్రించిన ఓ కోట్ ఈ సైకిల్ వైఖరి గురించి వివరిస్తుంది. వెనుక భాగంలో 'షట్ అప్ అండ్ రైడ్' అని రాసి ఉంటుంది. ఇది ఈ సైకిల్ యొక్క పాత్ర మరియు వైఖరిని నిర్వచించే ప్రకటన. నిజానికి, ఇది ఆ స్టేట్‌మెంట్ తగినట్లుగానే ప్రవర్తిస్తుంది.

రైడ్ మరియు హ్యాండ్లింగ్
ఫైర్‌ఫాక్స్ ఈ సైకిల్‌ను మౌంటైన్ బైక్‌గా వర్గీకరించినప్పటికీ, పైన పేర్కొన్న విధంగా, దీని డిజైన్ హైబ్రిడ్ బైక్‌గా ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది కొనుగోలుదారులు ఎక్కువ సమయం సైకిల్‌ను రోడ్డుపైనే ఉపయోగించడానికి ఇష్టపడుతారు. మనదేశంలో సైకిల్ పై ఆఫ్-రోడ్ విహారయాత్రలు చాలా అరుదుగా ఉంటాయని తెలుస్తుంది. అంటే, ఈ ఫైర్‌ఫాక్స్ బాడ్ యాటిట్యూడ్ టెన్ సైకిల్‌తో ఆన్-రోడ్‌పై రెండు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఆఫ్-రోడ్‌లో దాదాపు 10 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించగలము. రోడ్డు ఏదైనప్పటికీ, ఈ సైకిల్ యొక్క రైడ్ మరియు హ్యాండ్లింగ్ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవనే చెప్పాలి.

సీటుపై కూర్చొని, పెడల్‌పై కాలు వేసి ముందుకు నడపగానే, దీని రైడింగ్ పొజిషన్ హార్డ్‌కోర్ మౌంటెన్ బైక్‌లాగా అనిపిస్తుంది. అయితే, ఇది రైడర్ అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేయగల సీటు ఎత్తుపై ఆధారపడి ఉంటుంది. హ్యాండిల్ బార్ దాదాపుగా పరిపూర్ణంగా ఉంటుంది మరియు సీటుపై కూర్చున్నప్పుడు అలాగే స్టాండ్-అప్ రైడింగ్ పొజిషన్‌లలో సైకిల్‌ను తొక్కడం చాలా సులభంగా అనిపిస్తుంది. సీటు అందించే సౌలభ్యం అది తీర్చడానికి ఉద్దేశించిన వినియోగానికి ఖచ్చితంగా సరిపోతుందని మేము గుర్తించాము.

అయితే, సీట్ కంఫర్ట్ అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు. వివిధ రకాల వ్యక్తుల శారీర శౌష్టవాన్ని బట్టి భిన్నమైన ఆకారంలో మరియు ప్యాడ్‌తో కూడిన సీట్లు అవసరమని మేము అర్థం చేసుకున్నాము. కాబట్టి, ఇది పూర్తిగా మీరే నిర్ణయించుకోవాల్సిన విషయం. మరింత సౌకర్యవంతమైన సీట్లను కోరుకునే వారికి మెమొరీ ఫోమ్ సీట్లు ఫైర్‌ఫాక్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి, అవసరమైన వారు లేదా ఆసక్తి ఉన్న వారు వీటిని అదనంగా కంపెనీ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.

ఫైర్‌ఫాక్స్ బ్యాడ్ యాటిట్యూడ్ డ్రైవ్‌ట్రెయిన్ చాలా మృదువైనదిగా ఉంటుంది. ఈ మొత్తం గేర్‌షిఫ్టింగ్ మెకానిజం మైక్రోషిఫ్ట్ నుండి తీసుకోబడింది. ఇందులో షిఫ్టర్‌లు, కేబుల్‌లు మరియు డీరైలర్‌లు ఉన్నాయి. మైక్రోషిఫ్ట్ 1999 నుండి వ్యాపారంలో ఉంది, కాబట్టి డ్రైవ్‌ట్రెయిన్ విషయంలో ఈ బ్రాండ్ కు చాలా అనుభవం ఉంది. ఇది బాడ్ యాటిట్యూడ్ Xలో పని చేసే మెకానిజమ్‌ల యొక్క మృదువైన మార్పులు మరియు సులభమైన స్వభావాన్ని వివరిస్తుంది. ఇందులో అప్‌షిఫ్ట్‌లు మరియు డౌన్‌షిఫ్ట్‌లు రెండింటినీ చేతి బొటనవేలు సాయంతో కంట్రోల్ చేయవచ్చు. ఇది కొత్తవారికి కొద్దిగా గందరగోళంగా ఉంటుందేమో కానీ, త్వరగానే అలవాటైపోతుంది.

ఇందులో ఫాన్సీగా మరియు కూల్‌గా కనిపించే గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంటుంది, అయితే దాని రీడౌట్ కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. క్రాంక్ వద్ద మూడు డ్రైవ్ నిష్పత్తులను హ్యాండిల్ చేసే హ్యాండిల్‌బార్ యొక్క ఎడమ వైపున ఉన్న షిఫ్టర్ చివరలలో 1 & 3 వ్రాయబడిన సూచిక ఉంటుంది. అంటే, ఇది 2వ గేర్/నిష్పత్తిలో ఉన్నట్లు స్పష్టంగా చూపిస్తుంది. అయితే, వెనుక కాగ్ సెట్‌ను హ్యాండిల్ చేసే కుడి వైపు షిఫ్టర్ 1 మరియు 7 మార్కింగ్‌లను కలిగి ఉంటుంది మరియు సూచిక మధ్యలో ఉన్నప్పుడు, అది 3వ, 4వ లేదా 5వ గేర్‌లో ఉందో లేదో అని చెప్పడం కష్టంగా అనిపిస్తుంది.

మీరు ఖచ్చితంగా ఏ గేర్‌లో ప్రయాణిస్తున్నారో తెలుసుకోవాలని మీరు భావించినట్లయితే, ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అయితే, దాని వలన ఎటువంటి సమస్యలు లేవనుకోండి. ఇక సైకిల్ యొక్క హ్యాండ్లింగ్ విషయానికి వస్తే, దీని టైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మీరు ప్రయాణించే రోడ్డు లేదా టెర్రైన్‌తో సంబంధం లేకుండా ఈ టైర్లు తమ పట్టును (గ్రిప్ ను) బాగా నిర్వహిస్తాయి. మేము ఈ సైకిల్ ను తారు రోడ్డుపై మరియు బురదతో నిండిన ఆఫ్-రోడ్ ట్రాక్‌లపై ప్రయత్నించాము. ఎక్కడా కూడా ఇవి రాజీ పడలేదని మేము గుర్తించాము.

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఫైర్‌ఫాక్స్ బాడ్ యాటిట్యూడ్ X ముందు మరియు వెనుక భాగంలో పెటల్ డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఇవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి మరియు టార్మాక్‌లో ఉన్నప్పుడు సైకిల్ వేగాన్ని చాలా వేగంగా తగ్ంచి, సమర్థవంతమైన బ్రేకింగ్ ను అందిస్తాయి. బురద మరియు కంకరపై అయితే, వెనుక చక్రం చాలా సులభంగా లాక్ అవుతుంది. ఈ బ్రేకింగ్ పవర్ చాలా వినోదభరితమైన స్వారీ అనుభవాన్ని అందిస్తుంది. ఫైర్‌ఫాక్స్ బాడ్ యాటిట్యూడ్ X కేవలం ఫ్రంట్ ఫోర్కును మాత్రమే కలిగి ఉంటుంది. ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌ను ఉంటుంది.

ఈ సస్పెన్షన్ సెటప్ తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఎగుడుదిగుడుగా ఉండే ఆఫ్-రోడ్ ట్రాక్‌లపై ప్రయాణిస్తున్నప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అధిక వేగం వద్ద ఇది డంపింగ్ చర్యను కోల్పోతుంది. సస్పెన్షన్ రీబౌండ్ చాలా బలంగా అనిపిస్తుంది. ఈ సైకిల్ వెనుక భాగంలో కూడా సస్పెన్షన్ సెటప్ అందించి ఉంటే చాలా బాగుండేది. మొత్తమ్మీద ఇది చాలా సరదా పాత్రతో కూడిన సరదాగా ప్రయాణించే సైకిల్ (ఫన్ టూ రైడ్ సైకిల్). అలాగని, ఇది పూర్తి ఆఫ్-రోడర్ సైకిల్ కూడా కాదు.

దీర్ఘకాల పనితీరు
ఫైర్‌ఫాక్స్ బ్యాడ్ యాటిట్యూడ్ టెన్ సైకిల్‌ను మేము ఒక గంటో లేదా ఒక రోజో పరీక్షించలేదు. ఈ సైకిల్‌ను మేము దాదాపు ఆరు నెలలకు పైగా వినియోగిస్తున్నాము. ఈ సైకిల్ తొక్కడం వలన అలసట వస్తుందని మేము భావించాము. అయితే, అలాంటి సూచనలేమీ కనిపించలేదు. ఇందులోని మెకానికల్ బిట్స్ కూడా ఎలాంటి జనరల్ మెయింటినెన్స్ అవసరం లేకుండానే చాలా బాగా పనిచేస్తాయి. సైక్లింగ్ ఔత్సాహికులు సైకిల్‌ను బలంగా ఉంచడానికి క్రమం తప్పకుండా లూబింగ్ చేస్తూ, ఎప్పటికప్పుడు సైకిల్ ను క్లీన్ గా ఉంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు. అయితే ఈ ఫైర్‌ఫాక్స్ సైకిల్ విషయంలో మేము ఎలాంటి మెయింటెనెన్స్ చేయకుండానే ఇది ఇప్పటికీ బలంగా ఉండి, దీర్ఘకాల పనితీరును అందిస్తోంది.

యాక్ససరీలు మరియు వాటి ధరలు
పైన పేర్కొన్న విధంగా, Firefox Bad Attitude X కేవలం ఒక కలర్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే, 2021 చివరి నాటికి మేము ఈ సైకిల్‌ను స్వీకరించినప్పుడు, దాని ధర రూ. 15,800. ఏప్రిల్ 2022లో అయితే, ఇది రూ. 17,500 గా ఉంది. అంటే ఆరు నెలల వ్యవధిలో ఈ సైకిల్ ధర సుమారు రూ.1,700 పెరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత ఖచ్చితమైన ధర వివరాల కోసం Firefox వెబ్‌సైట్‌ని చెక్ చేయండి.

ఫైర్‌ఫాక్స్ సైకిల్ మరియు రైడర్స్ కోసం కంపెనీ అనేక ఉపకరణాలను కూడా విక్రయిస్తుంది. వీటి ధరలు రూ.3,650 నుంచి రూ.10,110 మధ్యలో అందుబాటులో ఉంటాయి. కంపెనీ వీటి కిట్స్ రూపంలో లేదా వ్యక్తిగతంగా కూడా విక్రయిస్తుంది. ఉదాహరణకు, సైకిల్ బెల్ రూ.120 నుంచి, లైట్లు రూ.1,050 నుంచి మరియు తాళాలు రూ.300 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సైకిల్ కోసం అతి తక్కువ ఖరీదుతో కూడిన సాడిల్ కవర్ ధర రూ.880 గా ఉంటుంది. ఇవే కాకుండా, కంపెనీ కార్ క్యారియర్లు, సైకిల్ ట్రైనర్‌లు, లగేజీ బ్యాగులు, సైకిల్ కవర్లు, వాటర్ బాటిళ్లు మొదలైన అనేక ఇతర ఉపకరణాలు కూడా విక్రయిస్తోంది.

చివరిమాట
రూ. 20,000 లోపు మంచి మౌంటెన్ కావాలనుకునే వారికి ఫైర్‌ఫాక్స్ బాడ్ యాటిట్యూడ్ X మంచి ఆప్షన్‌గా ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో పోటీపడే వివిధ బ్రాండ్‌ల నుండి అనేక సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఫైర్‌ఫాక్స్ బాడ్ యాటిట్యూడ్ X వాటన్నింటినీ పక్కకు నెట్టి, డిజైన్, స్టైలింగ్ మరియు పనితీరు వంటి అంశాల్లో ముందు వరుసలో నిలుచుంటుంది. ఇదొక ఫన్ టూ రైడ్ సైకిల్. కేవలం సరదా కోసం మాత్రమే కాకుండా, మీ నిత్యావసర ప్రయాణాలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. షట్ అప్ అండ్ రైడ్ అన్నట్లుగానే.. మేము కూడా ఎక్కువ మాట్లాడటం మానేసి ఈ సైకిల్‌ను ఎక్కువగా తొక్కేస్తున్నాం..!! మరి మీ సంగతేంటి..??


Click it and Unblock the Notifications








