Mahindra నుంచి వచ్చిన మొదటి Hero Electric స్కూటర్, ఇదే
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్ 'హీరో ఎలక్ట్రిక్' (Hero Electric) ఇప్పటికే 'మహీంద్రా' (Mahindra) గ్రూప్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ భాగస్వామ్యంతో దేశంలోని మహీంద్రా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఒక హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేశారు. ఈ మొదటి హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు రెండు కంపెనీలు ప్రకటించాయి. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంలో హీరో ఎలక్ట్రిక్ యొక్క వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ తీర్చడానికి హీరో ఎలక్ట్రిక్ గత నెలలో మహీంద్రా గ్రూప్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కారణంగానే మహీంద్రా గ్రూప్ హీరో ఎలక్ట్రిక్ యొక్క ఆప్టిమా మరియు ఎన్‌వైఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లను పితంపూర్‌లోని తన ఫెసిలిటీలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారుచేయనున్నట్లు తెలిపింది.

మహీంద్రా మరియు హీరో ఎలక్ట్రిక్ సహకారం లూథియానాలో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని విస్తరించడంతో, హీరో ఎలక్ట్రిక్ 2022 నాటికి సంవత్సరానికి ఒక మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయగలదని తెలిపింది. కావున దేశంలో కంపెనీ యొక్క డిమాండ్ పూర్తి స్థాయిలో తప్పకుండా తీర్చవచ్చు.

ఇందులో భాగంగానే హీరో ఎలక్ట్రిక్ ఎండి, 'నవీన్ ముంజాల్' మాట్లాడుతూ.. మహీంద్రా కంపెనీ కలయికతో కంపెనీ యొక్క డిమాండ్‌ను తీర్చడానికి ఇప్పుడు ఉత్పత్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయి. అంతే కాకుండా ఈ సహకారంతో దేశంలో కొత్త హబ్‌లను కూడా చేరుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, అన్నారు. అంతే కాకూండా, ఈ భాగస్వామ్యంతో రెండు కంపెనీలు EVల గురించి లోతైన జ్ఞానాన్ని పొందేందుకు మరియు రాబోయే సంవత్సరాలలో కొత్త ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడానికి వీలు కల్పిస్తుంది.

ప్యుగోట్ మోటోసైకిల్స్ పోర్ట్‌ఫోలియో యొక్క విద్యుదీకరణ కోసం ప్లాట్‌ఫారమ్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడంలో హీరో ఎలక్ట్రిక్ మరియు మహీంద్రా గ్రూప్ మధ్య సహ-అభివృద్ధి ప్రయత్నాలు కూడా కీలకమైన అంశం. ఇటీవల హీరో ఎలక్ట్రిక్ తన కస్టమర్లకు సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్‌లను అందించడానికి యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు అధికారికంగా తెలిపింది.

హీరో ఎలక్ట్రిక్ కస్టమర్‌లు ఇప్పుడు కనీస డాక్యుమెంటేషన్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం లోన్ పొందవచ్చు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు కోసం పొందే లోన్ వల్ల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. ఇది కంపెనీ యొక్క అమ్మకాలను తప్పకుండా మరింత పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగం పెరుగుతున్న సమయంలో తప్పకుండా కంపెనీ అందిస్తున్న ఈ కొత్త ఫైనాన్సింగ్ స్కీమ్ వినియోగదారులకు తప్పకుండా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం అందుబటులో ఉన్న హీరో ఎలక్ట్రిక్ యొక్క 750 కి పైగా డీలర్ల విస్తృత నెట్‌వర్క్‌లో వినియోగదారులు ఈ టూవీలర్ ఫైనాన్సింగ్‌ను ఎంచుకోవచ్చు.

యాక్సిస్ బ్యాంక్ కస్టమర్‌లు మరియు డీలర్‌ల కోసం కంపెనీ లోన్ మొత్తాన్ని మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ కాల వ్యవధిని కూడా అందిస్తుంది. కావున ఈ లోన్ పొందేవారు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా ఉండదు. భారతీయ మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన 'హీరో ఎలక్ట్రిక్' వచ్చే ఐదేళ్లలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 లక్షల యూనిట్లకు పెంచుకునేందుకు ఒక అద్భుతమైన ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో కంపెనీ తన లూథియానా ప్లాంట్‌లో తమ ఉత్పత్తిని కూడా 2022 మధ్య నాటికి సంవత్సరానికి 5 లక్షల యూనిట్లకు పెంచుతుంది.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సబ్సిడీలు మరియు రాయితీలను అందిస్తోంది. ఇందులో ఫేమ్-2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీ సబ్సిడీ అందిస్తోంది. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చాలామేరకు పెరిగాయని హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజాల్ తెలిపారు.

అంతే కాకూండా గత ఎనిమిది నెలలుగా హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిందని కూడా ఆయన చెప్పారు. దీనికి ప్రస్తుతం అందుబటులో ఉన్న సబ్సిడీలే ప్రధాన కారణం అన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబటులో ఉన్న డిమాండ్ ని తీర్చడానికి మరియు సరైన సమయానికి కస్టమర్లకు వాహనాలను అందించడానికి ఉత్పత్తి సామర్త్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరో ఎలక్ట్రిక్ పూర్తి సామర్థ్యంతో ఇప్పుడు ఉత్పత్తి చేస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1 లక్ష యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రెట్టింపు. ఇది కాకుండా, ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపరచడంలో కూడా కంపెనీ పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. కంపెనీ 2022 జనవరి అమ్మకాల ప్రకారం 26,193 యూనిట్ల హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. అదే సమయంలో గత ఏడాది కంపెనీ కేవలం 4,899 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు భారీగా పెరిగాయని మనకు స్ఫష్టంగా అర్థమౌతోంది.


Click it and Unblock the Notifications








