మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

మీ వద్ద పాత స్ప్లెండర్ మోటార్‌సైకిల్ ఉందా..? అయితే, ఇప్పుడు మీరు దానిని అధికారికంగా ఓ ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోవచ్చు. గత ఏడాది సెప్టెంబర్‌లో ముంబైకి చెందిన గోగో ఏ1 (GoGo A1) అనే స్టార్టప్ కంపెనీ, పెట్రోల్‌తో నడిచే హీరో స్ప్లెండర్ (Hero Splendor) బైక్‌లను బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చేందుకు గాను ఓ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఈ కిట్‌ను ఎవరైనా తమ స్ప్లెండర్ బైక్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే, ఈ కన్వర్షన్ కిట్ ఇన్‌స్టాలేషన్ కోసం గోగో ఏ1కు ఇప్పుడు ఏఆర్ఏఐ (ARAI) అనుమతి కూడా లభించింది.

మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

గోగో ఏ1 రూపొందించిన హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ లో భాగంగా పాత స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌లోని పెట్రోల్ ఇంజన్‌ను తొలగించి దాని స్థానంలో బ్యాటరీ ప్యాక్ మరియు వెనుక చక్రంలో హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగిస్తారు. ఈ కిట్ సాయంతో పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించవచ్చని దీనిని తయారు చేసిన ఇంజనీర్లు చెబుతున్నారు. కంపెనీ ఈ కిట్‌ను బ్యాటరీ లేకుండా అయితే రూ. 35,000 మరియు బ్యాటరీ ప్యాక్‌తో కలిపి అయితే రూ. 95,000 ధరతో పరిచయం చేసింది.

మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

జిఎస్టీతో కలుపుకుంటే, గోగో ఏ1 తయారు చేసిన ఎల‌క్ట్రిక్ కన్వ‌ర్ష‌న్ కిట్ ధ‌ర రూ.44,486 గా ఉంది. కాగా, కేవలం బ్యాట‌రీ ప్యాక్ ధ‌ర మాత్రమే రూ.55,606 గా ఉంది. అంటే, మీ వ‌ద్ద ఉన్న పాత హీరో స్ప్లెండర్ బైక్‌ను ఎల‌క్ట్రిక్ బైక్‌గా మార్చుకోవాలంటే అందుకు దాదాపుగా రూ.1 ల‌క్ష పైనే ఖర్చు అవుతుంది. అయితే, ఇలా పెట్రోల్ బైక్‌ను ఈవీగా మార్చుకోవడం వలన తరచూ పెట్రోల్ కొట్టించాల్సిన ప‌నిలేదు. ఇంధ‌నం ఖ‌ర్చు పూర్తిగా జీరో అవుతుంది. కాబట్టి, దీనిపై అధికంగా ఖ‌ర్చు చేసినప్పటికీ, ఇది దీర్ఘ‌కాలంలో ఎక్కువ ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది.

మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

సాధారణంగా, పెట్రోల్ ఇంధనంతో నడిచే మోటార్‌సైకిళ్లను ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లుగా మార్చకూడదు. అలా చేయాలంటే, ఆర్టీఓ కార్యాలయం నుండి లేదా సంబందిత ఏజెన్సీల నుండి తగిన అనుమతులు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో, గోగో ఏ1 తమ హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్ కోసం ఇప్పుడు ఏఆర్ఏఐ ధృవీకరణ కూడా పొందింది. అంటే, గోగో ఏ1 మోడిఫై చేసిన పెట్రోల్ టూ ఈవీ బైక్‌లను ఇప్పుడు అధికారికంగా రోడ్లపై తిప్పుకోవచ్చు. ఇందుకోసం యజమానులకు గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్ కూడా లభిస్తుంది మరియు ఇది ఎలక్ట్రిక్ వాహన రిజిస్ట్రేషన్ ను సూచిస్తుంది.

మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

గోగో ఏ1 యొక్క ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, వినియోగదారులు తమ హీరో స్ప్లెండర్ బైక్‌లను దేశవ్యాప్తంగా 36 ఆర్టీఓ స్థానాల్లో ఏర్పాటు చేసిన కంపెనీ ఇన్‌స్టాలేషన్ వర్క్‌షాప్‌లకు తీసుకురావాల్సి ఉంటుంది. కొత్త GoGo A1 యొక్క EV కన్వర్షన్ కిట్ విషయానికి వస్తే, ఇందులో 2 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది వెనుక చక్రంలోని హబ్‌పై అమర్చబడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 3.94 kW శక్తిని అందిస్తుంది మరియు ఆన్‌బోర్డ్ 2.8 kWh బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది.

మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

ఈ ఎలక్ట్రిక్ కన్వర్షన్ కిట్‌లో రియర్ హ‌బ్ మోటార్‌, రీజ‌న‌రేటివ్ కంట్రోల‌ర్‌, థ్రోటల్‌, డ్ర‌మ్ బ్రేక్‌, బ్యాట‌రీ ఎస్‌ఓసీ, వైరింగ్ హార్ నెస్‌, యూనివ‌ర్స‌ల్ స్విచ్‌, కంట్రోల‌ర్ బాక్స్‌, స్వింగ్ ఆర్మ్‌, డీసీ టు డీసీ క‌న్వ‌ర్ట‌ర్‌ మరియు యాంటీ థెఫ్ట్ డివైస్ వంటి పరికరాలు ఉంటాయి. ఈ కిట్ సాయంతో మోడిఫైడ్ స్ప్లెండర్ బైక్ గంట‌కు గ‌రిష్టంగా 75 నుంచి 80 కిలోమీట‌ర్ల వేగంతో పరుగులు తీస్తుంది మరియు పెట్రోల్ పవర్డ్ వాహనాల యొక్క పెర్ఫార్మెన్స్‌కు సమానంగా ఉంటుంది.

మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

కంపెనీ అందించే బ్యాటరీ ప్యాక్‌లో 72 వోల్టుల 40 యాంప్‌ల లిథియ‌మ్ అయాన్ బ్యాట‌రీ ఉంటుంది. అయితే ఈ బ్యాట‌రీ ప్యాక్‌కు రూ.55,000 ఖ‌ర్చు పెట్టడం ఎందుకు అనుకునే కస్టమర్లు వాటిని అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఈ బ్యాటరీని ఒక‌సారి పూర్తిగా చార్జ్ గ్ చేస్తే, గరిష్టంగా 120-150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రతిరోజు దాదాపు 120-15 కిమీ దూరం ప్రయాణించే వారికి ఈ హీరో స్ప్లెండర్ కన్వర్షన్ కిట్ చాలా పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

వాహనాల వలన కలిగే కాలుష్యాన్ని అంతమొందించేందుకు భారత ప్రభుత్వం రోడ్లపై క్రమంగా ఐస్ (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) వాహనాలను క్రమంగా తొలగించడానికి ప్రయత్నిస్తున్నందున, భవిష్యత్తులో ఇటువంటి ఈవీ కన్వర్షన్ కిట్‌లు సర్వసాధారణం అవుతాయని తెలుస్తోంది. నార్త్‌వే మోటార్‌స్పోర్ట్స్‌లో కొన్ని ఈవీ కన్వర్షన్ కిట్‌లు కూడా అమ్మకానికి ఉన్నాయి, అయితే ఇవి కార్లు మరియు చిన్న వాణిజ్య వాహనాల కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

మీ పాత స్ప్లెండర్ బైక్‌ను ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకోండి.. దీనికి ఇప్పుడు ఆర్టీఓ అనుమతి కూడా వచ్చేసింది..!

భారత మార్కెట్లో హీరో స్ప్లెండర్ అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ మోటార్‌సైకిల్, కాబట్టి ఇది ఎలక్ట్రిక్ కన్వర్షన్ కు చాలా అత్యుత్తమైన ఎంపికగా ఉంటుంది. ఇలాంటి ఈవీ కన్వర్షన్ కిట్‌లు ప్రజలకు సరసమైన ధరలకే ఎలక్ట్రిక్ మొబిలిటీని అందించడానికి ఒక ఆచరణాత్మక పరిష్కారంగా ఉంటాయి మరియు త్వరలో ఇలాంటి మరిన్ని కిట్‌లు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Gogo a1 s electric conversion kit approved by arai here are all the details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X