Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ మామూలుగా లేదు, దీనికి ప్రధాన కారణం పెరిగిన ఇంధన ధరలు. అంతే కాకూండా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపైన ఎక్కువ ఆఫర్స్ మరియు డిస్కౌంట్ అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి.

ఇప్పుడు గ్రేటా ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రెటా గ్లైడ్‌ (Greta Glide) ను విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

భారతీయ విఫణిలో విడుదలైన కొత్త గ్రెటా గ్లైడ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 80,000 (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఇప్పుడు ఈ స్కూటర్ యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభించింది. అంతే కాకుండా ఈ స్కూటర్ కొనుగోలుపైన కొంత తగ్గింపులను కూడా అందించనున్నట్లు ప్రకటించింది.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వినియోగదారులు ఆన్‌లైన్ లో రో. 6,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే డీలర్‌షిప్‌ల ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేస్తే బుకింగ్ ధరలో కూడా రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది. కావున కొనాలనుకునే కస్టమర్లు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

గ్రెటా గ్లైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 2.5 గంటల వ్యవధిలో 0 నుంచి 100% వరకు ఛార్జ్ చేయవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులు సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

గ్రెటా గ్లైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక ఆధునిక ఫీచర్స్ తో పరిచయం చేయబడింది. ఈ కొత్త స్కూటర్ మార్కెట్లో 7 విభిన్న రంగులలో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ కలర్స్ అన్నీ కూడా చాలా అకర్షణీయంగా ఉంటాయి. ఎక్కువ కలర్ ఆప్సన్స్ అందుబటులో ఉండటం వల్ల మీకు నచ్చిన కలర్ ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు LED DRL వంటివి ఉన్నాయి. ఇది మధ్యలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో బైక్ లాంటి స్ట్రెయిట్ హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్‌లో DRL, EBS మరియు స్మార్ట్ షిఫ్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

గ్రెటా గ్లైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్ అయిన రివర్స్ మోడ్‌తో పాటు మూడు-స్పీడ్ మోడ్‌ను కూడా పొందుతుంది. అంతే కాకూండా ఇందులో ఎల్ఈడీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ స్టార్ట్ మరియు ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ వంటి వాటిని కూడా పొందుతుంది.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

కంపెనీ ఈ స్కూటర్‌ను సురక్షితంగా ఉంచడానికి మరియు దొంగతనాల భారీ నుంచి కాపాడటానికి, ఫైండ్ మై వెహికల్ అలారం మరియు యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లను కూడా అందించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, పెద్ద లెగ్‌రూమ్, లెదర్ సీట్ కవర్ మరియు మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం USB పోర్ట్ కూడా ఉన్నాయి.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

గ్రేటా గ్లైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5-ఇంచెస్ వెడల్పు గల ట్యూబ్‌లెస్ టైర్‌తో వస్తుంది, కావున ఇది రహదారిపై మెరుగైన పట్టును అందించగలదు. స్కూటర్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు డ్యూయల్ హైడ్రాలిక్ సెల్ షాకర్లను పొందుతుంది. బ్రేకింగ్‌ను మెరుగుపరచడానికి కంపెనీ ఈ స్కూటర్ యొక్క రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లను అందించింది.

Greta Glide ఎలక్ట్రిక్ స్కూటర్: ధర తక్కువ & రేంజ్ అదుర్స్

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విభిన్న శ్రేణి బ్యాటరీ ప్యాక్‌లతో అందిస్తోంది. కావున ఇవన్నీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పరిధిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులో 60 కిలోమీటర్ల పరిధికి వి2 48వి-24యాంపియర్ బ్యాటరీ ప్యాక్ మరియు 100 కిలోమీటర్ల పరిధి కోసం వి3 48వి-30యాంపియర్ బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఇవి మంచి పనితీరుని మరియు అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగాలను పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫేమ్-2 స్కీమ్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలు అందుబటులో ఉన్నాయి. కావున ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులు ఇప్పుడు ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, March 4, 2022, 9:28 [IST]
English summary
Greta glide electric scooter launched price features range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+