GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది, దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను విరివిగా విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ 'జిటి ఫోర్స్' (GT Force) రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

'జిటి ఫోర్స్' (GT Force) విడుదల చేసిన రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'జిటి సోల్ వేగాస్' (GT Soul Vegas) కాగా, మరొకటి 'జిటి డ్రైవ్ ప్రో' (GT Drive Pro). ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు సరసమైన ధర వద్ద అందుబాటులో ఉంటాయి, అదే సమయంలో ఇవి మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతాయి.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

జిటి సోల్ వేగాస్ (GT Soul Vegas):

కంపెనీ విడులా చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి 'జిటి సోల్ వేగాస్'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 47,370 (లీడ్-యాసిడ్ బ్యాటరీ) మరియు రూ. 63,641 (లిథియం-అయాన్ బ్యాటరీ). ఈ స్కూటర్ ని కంపెనీ ప్రత్యేకంగా తక్కువ దూరాలకు ప్రయాణించే రైడర్లను దృష్టిలో ఉంచుకుని తయారుచేసింది. కావున ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిమీ వరకు ఉంటుంది.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

జిటి సోల్ వేగాస్ లీడ్ యాసిడ్ బ్యాటరీ వేరియంట్ ఒక ఫుల్ ఛార్జ్ పైన 50 కిమీ నుంచి 60 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ ఒక ఫుల్ ఛార్జ్ పైన 60 కిమీ నుంచి 65 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ బ్యాటరీ ఛార్జ్ కావడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

బ్యాటరీ వారంటీ విషయానికి వస్తే, కంపెనీ 18 నెలల మోటార్ వారంటీ, ఒక సంవత్సరం లీడ్ బ్యాటరీ వారంటీ మరియు మూడు సంవత్సరాల లిథియం-అయాన్ బ్యాటరీ వారంటీ అందిస్తుంది.

జిటి సోల్ వేగాస్ లీడ్ యాసిడ్ బ్యాటరీ కలిగిన వేరియంట్ మొత్తం 95 కేజీలు కాగా, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ బరువు 88 కేజీల వరకు ఉంటుంది. అయితే లోడింగ్ కెపాసిటీ 150 కేజీల వరకు ఉంటుంది. కావున లగేజ్ వంటివి మోయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

జిటి సోల్ వేగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ వరకు ఉంటుంది, కావున ఇది భారతీయ రోడ్లపైన నిరాఘాటంగా ముందుకు సాగుతుంది. ఈ స్కూటర్ యొక్క సీటు ఎత్తు 760 మిమీ.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో యాంటీ-థెఫ్ట్ అలారం, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఇగ్నిషన్ లాక్ స్టార్ట్, హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు రియర్ సస్పెన్షన్‌లో డ్యూయల్ ట్యూబ్ టెక్నాలజీ ఉన్నాయి. ఇవన్నీ కూడా రైడర్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్లోసీ రెడ్, గ్రే మరియు ఆరెంజ్ అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

జిటి డ్రైవ్ ప్రో (GT Drive Pro):

జిటి ఫోర్స్ యొక్క మరో ఎలక్ట్రిక్ స్కూటర్ 'జిటి డ్రైవ్ ప్రో'. ఇది కూడా రెండు బ్యాటరీ ప్యాక్ అప్సన్స్ పొందుతుంది. కావున లీడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్ కలిగిన జిటి డ్రైవ్ ప్రో ధర రూ. 67,208, కాగా లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగిన జిటి డ్రైవ్ ప్రో ధర రూ. 82,751. ఇవి రెండూ కూడా గంటకు 25 కిమీ వరకు వేగవంతం అవుతాయి. కావున ఇవి స్లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఉంటాయి.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

జిటి డ్రైవ్ ప్రో లీడ్-యాసిడ్ బ్యాటరీ (48V 28Ah) ఒక ఫుల్ ఛార్జ్ కావడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో ఇది ఒక ఛార్జ్ పైన 50 కిమీ నుంచి 60 కిమీ పరిధిని అందిస్తుంది.

ఇక జిటి డ్రైవ్ ప్రో లిథియం అయాన్ (48V 26Ah) వేరియంట్ ఛార్జ్ కావడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 60 కిమీ నుంచి 65 కిమీ పరిధిని అందిస్తుంది. కావున ఈ రెండు స్కూటర్లు తక్కువ దూరాలకు మరియు రోజు వారీ ప్రయాణాలకు కనుకూలంగా ఉంటాయి.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

జిటి డ్రైవ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 140 కేజీల లోడింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ స్కాటర్ యొక్క సీటు ఎత్తు 760 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ వరకు ఉంటుంది. ఇది వైట్, బ్లూ, ఎరుపు మరియు చాక్లెట్ అనే నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటాయి.

GT Force నుంచి విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర తక్కువ & రేంజ్ ఎక్కువ

జిటి డ్రైవ్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆధునిక ఫీచర్స్ అయిన యాంటీ-థెఫ్ట్ అలారం, సెంట్రల్ లాకింగ్, పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్ మరియు ఆటో కటాఫ్‌తో మొబైల్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను పొందుతుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పైన ఒక-సంవత్సరం లీడ్ బ్యాటరీ వారంటీ మరియు మూడు సంవత్సరాల లిథియం బ్యాటరీ వారంటీని అందిస్తుంది.

Most Read Articles

English summary
Gt force launches soul vegas and drive pro e scooters in india details
Story first published: Friday, September 30, 2022, 17:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X