'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

ప్రపంచమార్కెట్లో అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బ్రాండ్ బైకులు చెప్పుకోదగ్గవి మరియు ప్రత్యేకమైనవి. హార్లే డేవిడ్సన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే చాలా బైకులను విడుదల చేసి మంచి ప్రజాదరణ పొందుతోంది. అయితే ఇటీవల కంపెనీ తన 'పాన్ అమెరికా 1250' (Pan America 1250) బైకుపై గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది.

Recommended Video

Royal Enfield నుంచి కొత్త Hunter 350 వచ్చేసింది | ధర & వివరాలు

హార్లే డేవిడ్సన్ ఇప్పుడు తన 'పాన్ అమెరికా 1250' పై ఎంత డిస్కౌంట్ ప్రకటింహించింది, డిస్కౌంట్ తరువాత దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

హార్లే డేవిడ్సన్ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఇప్పుడు తన 'పాన్ అమెరికా 1250' పై ఏకంగా రూ. 4 లక్షల డిస్కౌంట్ ప్రకటిచింది. పాన్ అమెరికా 1250 అనేది రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి పాన్ అమెరికా స్టాండర్డ్, మరొకటి పాన్ అమెరికా స్పెషల్. ఈ రెండు వేరియంట్ల ధరల వరుసగా రూ. 16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 21.11 లక్షలు (ఎక్స్-షోరూమ్).

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

కంపెనీ అందించిన డిస్కౌంట్ తరువాత పాన్ అమెరికా స్టాండర్డ్ ధర రూ. 12.91 లక్షలు, కాగా పాన్ అమెరికా స్పెషల్ ధర రూ. 17.11 లక్షలకు చేరించి. కావున ఈ బైకును ఇప్పుడు భారీ తగ్గింపుతో సులభంగా కొనుగోలు చేయవచ్చు.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

భారతీయ మార్కెట్లో కంపెనీ తన అమ్మకాలను పెంచడానికి మరియు కస్టమర్లను ఆకర్శించడానికి ఈ అద్భుతమైన డిస్కౌంట్ ప్రవేశపెట్టింది. కావున తప్పకుండా రానున్న రోజుల్లో మరిన్ని ఎక్కువ 'పాన్ అమెరికా 1250' బైకులు దేశీయ మార్కెట్లో విక్రయించబడే అవకాశం ఉంది.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

హార్లే-డేవిడ్సన్ యొక్క పాన్ అమెరికా 1250 చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, బ్లూటూత్-కనెక్టివిటీతో 6.8-ఇంచెస్ కలర్ డిస్‌ప్లే మరియు USB C-టైప్ అవుట్‌లైట్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికన్ 1250 పూర్తిగా రీడిజైన్ చేసి అభివృద్ధి చేయబడిన కొత్త బైక్. ఇది సాహస ప్రియులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. కావున ఇందులో వెహికల్ లోడ్ కంట్రోల్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టాండర్డ్ సెంటర్ స్టాండ్, అడ్జస్టబుల్ రియర్ బ్రేక్ పెడల్, అల్యూమినియం స్కిడ్-ప్లేట్, హీటెడ్ హ్యాండ్ గ్రిప్స్, స్టీరింగ్ డంపర్, అడాప్టివ్ రైడ్ హైట్ మరియు ట్యూబ్‌లెస్‌ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 లో అతి ముఖ్యమైన ఫీచర్ దాని అడాప్టివ్ రైడర్ హైట్ సిస్టం. కంపెనీ ఈ కొత్త టెక్నాలజీని మొదటిసారిగా ఇందులో ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ సహాయంతో, బైక్ డ్రైవర్ తన సౌలభ్యం మేరకు బైక్ యొక్క ఎత్తును అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్‌తో, బైక్ యొక్క ఎత్తు డ్రైవ్ చేస్తున్నప్పుడు 890 మిమీ, అదేవిధంగా నిలబడినప్పుడు 855 మిమీ అవుతుంది.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 బైక్ 1250 సిసి వి ట్విన్ డిఓహెచ్సి ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 150 బిహెచ్‌పి పవర్ మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 127 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

అంతే కాకుండా ఈ బైక్ పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ కూడా పొందుతుంది. ఇందులో 21 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో ఇది లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌ను వివిధ రకాల రోడ్లపై నడపడానికి మల్టిపుల్ రైడ్ మోడ్‌లు ఇవ్వబడ్డాయి, ఇందులో స్పోర్ట్, రెయిన్, రోడ్, ఆఫ్ రోడ్ మరియు ఆఫ్ రోడ్ ప్లస్ వంటి రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

హార్లే-డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 లో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, టిసిఎస్, ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కావున ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

'పాన్ అమెరికా 1250' పై కనివిని ఎరుగని గొప్ప డిస్కౌంట్ అందించిన హార్లే డేవిడ్సన్.. కొనేవారికి ఇదే మంచి అవకాశం

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హార్లే-డేవిడ్సన్ కంపెనీ తన పాన్ అమెరికా 1250 పై ఏకంగా రూ. 4 లక్షలు డిస్కౌంట్ అందించడం నిజంగా హర్శించదగ్గ విషయం, అంతే కాకుండా ఇది హార్లే-డేవిడ్సన్ బైక్ ప్రియులకు గుడ్ న్యూస్ కూడా. కంపెనీ అందించిన ఈ డిస్కౌంట్ వల్ల ఎక్కువమంది ఈ బైకును కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ డిస్కౌంట్ ప్రవేశపెట్టిన తరువాత ఎలాంటి అమ్మకాలు పొందుతుంది అనేది తెలియాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 14, 2022, 9:56 [IST]
English summary
Harley davidson pan america motorcycle gets rs 4 lakh price discount details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+