కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి, తద్వారా వాహన దారుల మరణాల రేటును పూర్తిగా రూపుమాపడానికి మోటార్ వాహన చట్టాలు చాలా కఠినంగా అమలులో ఉన్నాయి. అంతే కాకూండా ఇందులో ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలను కూడా చోటు చేసుకుంటాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడానికి కొత్త భద్రతా నియమాలను వెల్లడించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

వెల్లడైన కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలతో బైక్ డ్రైవర్ ప్రయాణిస్తే, అప్పుడు ఆ పిల్లలు కూడా తప్పనిసరిగా హెల్మెట్ మరియు సేఫ్టీ బెల్ట్ వంటివి తప్పకుండా ధరించాలి. అది మాత్రమే కాకుండా పిల్లలతో పాటు బైక్ నడుపుతున్నప్పుడు బైక్ గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించకూడదు. వాహన వినియోగదారులు తప్పకుండా దీనిని దృష్టిలో ఉంచుకోవాలి.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

దేశంలో మరణాల రేటును తగ్గినచడానికి ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న పిల్లలకు మరింత భద్రత కల్పించేందుకు కేంద్ర మోటారు వాహన చట్టాన్ని సవరించారు. ఈ నియమం నాలుగు సంవత్సరాల వయస్సు వరకు పిల్లలకు రహదారిపై భద్రతను అందిస్తుంది.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

ప్రభుత్వం వెల్లడించిన ఈ కొత్త ట్రాఫిక్ నిబంధనను ఉల్లంఘిస్తే వారికి గరిష్టంగా రూ. 1,000 జరిమానా విధించబడుతుంది. అంతే కాకుండా మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన ఈ కొత్త నిబంధనను 2023 నుంచి అమలు చేస్తుంది.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

కొత్త నిబంధనల ప్రకారం, ఉపయోగించే సేఫ్టీ హార్నెస్ అనేది తేలికైనది, వాటర్ ప్రూఫ్, మంచి కుషన్‌ వంటి వాటిని కలిగి ఉండటంతో పాటు 30 కేజీల వరకు బరువును మోసే సామర్థ్యం కలిగి ఉండాలి. రైడింగ్ సమయంలో పిల్లలను సురక్షితంగా ఉంచడానికి రైడర్ రెండు పట్టీలతో వచ్చే చైల్డ్ సేఫ్టీ హార్నెస్ తప్పకుండా ఉపయోగించాలి. ఇది వారి భద్రతకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

2023 నుంచి రానున్న ఈ కొత్త రూల్స్ ప్రకారం, బైక్ నడుపుతున్న పిల్లలు కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి. వెనుక ప్రయాణించే పిల్లవాడు సైకిల్ హెల్మెట్ లేదా క్రాష్ హెల్మెట్ ధరించాలని ఇందులో సూచించడం జరిగింది. ఈ హెల్మెట్ తప్పనిసరిగా ISI గుర్తుతో కూడిన హెల్మెట్ అయి ఉండాలి.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

ఇప్పటికే చాలా కంపెనీలు పిల్లల కోసం ప్రత్యేకంగా హెల్మెట్‌లను తయారు చేయడం ప్రారంభించాయి. దీని కోసం కేంద్రం ఇప్పటికే హెల్మెట్ తయారీదారులకు నోటీసు కూడా ఇచ్చింది. కావున కంపెనీలు పిల్లలకు అనుకూలమైన మరియు వారికి నచ్చిన హెల్మెట్స్ తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నాయి.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

2021 అక్టోబర్ నెలలో రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇందులో పిల్లల రక్షణకు సంబంధించిన కొత్త రూల్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇందులో పిల్లల కోసం సేఫ్టీ హార్నెస్ హెల్మెట్లను మరియు రైడర్లు క్రాష్ హెల్మెట్‌లను తప్పకుండా ధరించాలి అని ప్రతిపాదించారు.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

భారతదేశంలో ప్రతి సంవత్సరం లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో లక్షల మంది మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది ప్రమాదాలకు గురవ్వడానికి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడం. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదంలో కూడా ప్రాణాలను రక్షించుకోవచ్చు.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

ప్రమాదంలో హెల్మెట్ ధరించిన చాలామంది బైక్ రైడర్లు ప్రమాదంలో కూడా ప్రాణాలతో బయటపడిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. కావున ప్రయాణికుడికి రక్షణ కవచంలాగా ఈ హెల్మెట్లు పనిచేస్తాయి, కావున తప్పకుండా రైడర్ మరియు పిలియన్ హెల్మెట్ ధరించాలి. అప్పుడే ప్రమాదంలో మరణాలను రూరం చేసుకోవచ్చు.

కొత్త హెల్మెట్ రూల్స్ ప్రకటించిన కేంద్రం.. 2023 నుంచి అమలు

కేంద్ర ప్రభుత్వం తెలిపిన ఈ నియమ ప్రకారం, వాహన వినియోగదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. లేకుంటే భారీ జరిమానాలు చెల్లించడమే కాకూండా, జైలు శిక్ష లేదా లైసెన్స్ రద్దు వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రానున్న ఈ కొత్త రూల్ తప్పకుండా మరింత తక్కువ మరణాల రేటును తీసుకువస్తుందని ఆశిస్తున్నాము.రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ కొత్త హెల్మెట్ రూల్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 ఉంచి అమలులోకి వస్తుంది. కావున వచ్చే ఏడాది నుంచి వాహన వినియోగదారులు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి.

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2022, 9:44 [IST]
English summary
Helmet and safety harness for minor pillion rider compulsory from 2023 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+