హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్‌ల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ (Hero MotoCopr), భారత మార్కెట్లో విక్రయిస్తున్న నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ (Hero Xtreme 160R) కోసం ఓ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించుకుంది. తొమ్మిది సార్లు జాతీయ డ్రాగ్ రేసింగ్ ఛాంపియన్ అయిన హేమంత్ ముదప్ప (Hemanth Muddappa) ను ఈ బైక్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

హీరో మోటోకార్ప్ బ్రాండ్ ద్వారా కొనసాగుతున్న ఎక్స్‌డ్రాగ్ (XDrags) తో హేమంత్ భారతదేశంలో డ్రాగ్ రేసింగ్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు, ఇదొక Hero Xtreme 160R తో జరిగిన పాన్-ఇండియా డ్రాగ్ రేసింగ్ అనుభవపూర్వక కార్యక్రమం. హీరో మోటోకార్ప్ మరియు హేమంత్ ముదప్ప ఇప్పటివరకు 16 ఎక్స్‌డ్రాగ్స్ ఈవెంట్‌లను హోస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన హేమంత్ డ్రాగ్ రేసింగ్ సర్క్యూట్‌లో ఎన్నో రికార్డులను సాధించారు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

ఈ నెల ప్రారంభంలో, హేమంత్ ముదప్ప MMSC FMSCI ఇండియన్ నేషనల్ డ్రాగ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ 2021లో తన ఐదవ వరుస టైటిల్‌ను గెలుచుకున్నాడు. హేమంత్ 1050 సీసీ (సూపర్ స్పోర్ట్), 851-1050 సీసీ (సూపర్ స్పోర్ట్) విభాగాల్లో రెండు స్వర్ణాలు సాధించాడు. ఈ రెండు విభాగాలలో గెలిచిన ఏకైక భారతీయ డ్రాగ్ రేసర్ మరియు భారతదేశంలో డ్రాగ్ స్ట్రిప్స్‌లో వేగవంతమైన సమయం రికార్డును కలిగి ఉన్న వ్యక్తిగా హేమంత్ ముదప్ప రికార్డు స్థాపించారు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

భారతదేశపు అత్యంత వేగవంతమైన మోటార్‌సైకిల్ రేసర్ టైటిల్‌ను గెలుచుకునే సమయంలో అతను ప్రమాదానికి గురయ్యాడు, ఆ ప్రమాదం తర్వాత అతను ఇకపై నడవలేడని వైద్యులు చెప్పారు. ముదప్ప రేసింగ్ కెరీర్ మరియు జీవితం స్ఫూర్తిదాయకంగా మరియు ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ మాట్లాడుతూ, "మా టీమ్‌లో కొత్త సభ్యుడిగా హేమంత్‌ను స్వాగతిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. అతను సాధించిన ఇటీవలి విజయం పట్ల మేము అతనిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము" అని అన్నారు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

భారతదేశంలో డ్రాగ్ రేసింగ్ సంస్కృతిలో ముదప్ప యొక్క ఉనికి మరియుపురోగతికి తమ బ్రాండ్ నిబద్ధతను బలపరుస్తుందని, డ్రాగ్ రేసింగ్ అనేది మోటర్‌స్పోర్ట్స్‌లో అతి తక్కువ మరియు వేగవంతమైన రూపమని మరియు హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, దాని విభాగంలో అత్యంత వేగవంతమైన 0-60 కి.మీ/గం బైక్ అని మరియు ఈ ఈ రేసింగ్ ఫార్మాట్‌ కు ఇది సరిగ్గా సరిపోతుందని రంజీవత్ అన్నారు.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

Hero Xtreme 160R గురించి క్లుప్తంగా..

హీరో మోటోకార్ప్ గత 2019 EICMAలో ప్రదర్శించిన 1.R కాన్సెప్ట్ మోడల్ నుండి ప్రత్యక్ష ప్రేరణ పొంది హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ బైక్‌ను డిజైన్ చేసింది. ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న హీరో బ్రాండ్ ఆర్ అండ్ డి ఫెసిలిటీలో డిజైన్ చేసి, డెవలప్ చేశారు. ఇది హీరో బ్రాండ్ నుండి వస్తున్న ప్రీమియం 160సీసీ మోటార్‌సైకిల్, ఇది బిఎస్6 కంప్లైంట్ ఇంజన్‌తో లభ్యం అవుతుంది. ఇందులో కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్ మరింత క్లాస్-లీడింగ్ పెర్ఫార్మెన్స్ మరియు యాక్సిలరేషన్ ఫిగర్‌లను అందిస్తుంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ ఫ్రంట్ డిస్క్ మరియు డబుల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో లభ్యం అవుతుంది. హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటారుసైకిల్‌లో 163 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8500 ఆర్‌పిఎమ్ వద్ద 15 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 14 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. ఇందులో హీరో బ్రాండ్ యొక్క ప్రోగ్రామ్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది సాటిలేని పెర్ఫార్మెన్స్‌ను, మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

సమాచారం ప్రకారం, కొత్త 2020 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ మోటార్‌సైకిల్ కేవలం 4.7 సెకన్లలోనే 0-60 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది సెగ్మెంట్లో కెల్లా ఉత్తతమైన పవర్-టు-వెయిట్ రేషియోని ఆఫర్ చేస్తుంది. బేస్-స్పెక్ మోడల్ మొత్తం 138.5 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇందులో టాప్-స్పెక్ ట్రిమ్ బేస్ ట్రిమ్ కన్నా 1 కేజీ అధనపు బరువును కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్ఈడి ఇండికేటర్స్ మరియు ఎల్ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్, ముందు మరియు వెనుక భాగంలో పెటల్ డిస్క్ బ్రేక్‌లు, వీటిని సపోర్ట్ చేసే సింగిల్-ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

హీరో ఎలక్ట్రిక్ టూవీలర్లు కూడా వస్తున్నాయి...

మన దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్, ఇప్పుడు తమ స్వంత బ్రాండ్ క్రింద కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి హీరో ఎలక్ట్రిక్ అనే సబ్ బ్రాండ్ ద్వారా కంపెనీ లో-స్పీడ్ మరియు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, హీరో మోటోకార్ప్ బ్రాండ్ ద్వారా ఓలా ఎస్1, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి మోడళ్లకు పోటీగా కంపెనీ ఓ అధునాతన స్కూటర్ ను తీసుకురావాలని చూస్తోంది.

హీరో ఎక్స్‌ట్రీమ్ 16ఆర్ (Hero Xtreme 160R) బ్రాండ్ అంబాసిడర్‌గా హేమంత్ ముదప్ప, ఎవరితను..?

కంపెనీ తమ Vida బ్రాండ్‌లో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జూలై 1, 2022న విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. హీరో మోటోకార్ప్ ఛైర్మన్ మరియు సిఇఒ డాక్టర్ పవన్ ముంజాల్ విడా బ్రాండ్ లోగోను బ్రాండ్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో వెల్లడించారు. కొత్త బ్రాండ్ లాంచ్ కాకుండా, పవన్ ముంజాల్ 100 మిలియన్ డాలర్ల గ్లోబల్ సస్టైనబిలిటీ ఫండ్‌ను కూడా ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిధిని వినియోగించనున్నట్లు ముంజాల్ తెలిపారు.

Most Read Articles

English summary
Hemanth muddappa is the new brand ambassador for hero xtreme 160r details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X