మార్చి 2022 నెలలో బెస్ట్ టూవీలర్ బ్రాండ్స్.. పెట్రోల్ టూవీలర్లతో పోటీగా ఎలక్ట్రిక్ టూవీలర్లు..
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ విప్లవం మొదలైంది. పెట్రోల్ వాహనాలతో పోటీగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించేందుకు కంపెనీలు పోటీపడతున్నాయి. కస్టమర్లు కూడా పెట్రోల్ టూవీలర్లతో పోల్చుకుంటే, ఎలక్ట్రిక్ టూవీలర్ల ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ, మైలేజ్, రన్నింగ్ మరియు మెయింటినెన్స్ కాస్ట్ వంటి అంశాల నేపథ్యంలో, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

తాజాగా, మార్చి నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసిన టూవీలర్ బ్రాండ్ల వివరాలు వెల్లడయ్యాయి. ఆసక్తికరమైన విషం ఏంటంటే, గత సంవత్సరం ఇదే సమయంలో అమ్మకాల గణాంకాలతో పోలిస్తే, గత నెలలో (మార్చి 2022లో) ఈ పెట్రోల్ టూవీలర్ బ్రాండ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కాగా, ఇదే సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ టాప్ 10 టూవీలర్ బ్రాండ్ల జాబితాలో మూడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు స్థానం దక్కించుకున్నాయి.

1. హీరో మోటోకార్ప్ (3,73,528 యూనిట్లు)
భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) గడచిన మార్చి 2022 నెలలో మొత్తం 3,73,528 యూనిట్ల మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లను విక్రయించింది. ఈ అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ, మార్చి 2021 నెలలో విక్రయించిన 3,99,206 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 6 శాతం క్షీణతను నమోదు చేశాయి. అయితే, ఫిబ్రవరి 2022 నెలతో పోలిస్తే, గత నెలలో హీరో మోటోకార్ప్ అమ్మకాలు 20 శాతం కంటే ఎక్కువ నెలవారీ వృద్ధి రేటును నమోదు చేశాయి.
| Rank | 2W Retail Sales | Mar-22 | Mar-21 | Growth (%) YoY |
| 1 | Hero | 3,73,528 | 3,99,206 | -6.43 |
| 2 | Honda | 2,81,725 | 3,16,936 | -11.11 |
| 3 | TVS | 1,81,328 | 1,79,521 | 1.01 |
| 4 | Bajaj | 1,23,413 | 1,38,290 | -10.76 |
| 5 | Royal Enfield | 50,762 | 60,847 | -16.57 |
| 6 | Suzuki | 49,371 | 48,741 | 1.29 |
| 7 | Yamaha | 41,812 | 44,311 | -5.64 |
| 8 | Hero Electric | 13,023 | 5,235 | 148.77 |
| 9 | Ola Electric | 9,121 | 0 | - |
| 10 | Okinawa | 8,284 | 1,530 | 441.44 |

2. హోండా (2,81,725 యూనిట్లు)
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda Motorcycles & Scooters India) గడచిన మార్చి 2022 నెలలో మొత్తం 2,81,725 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కాగా, మార్చి 2021 నెలలో హోండా విక్రయించిన 3,16,936 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 11 శాతానికి పైగా తగ్గాయి. కాగా, ఫిబ్రవరి 2022 నెల అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో హోండా టూవీలర్ల అమ్మకాలు 14 శాతం పెరిగాయి.

3. టీవీఎస్ మోటార్స్ (1,81,328 యూనిట్లు)
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ప్రస్తుతం, భారతదేశంలో మూడవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా ఉంది. గతేడాది ఇదే సమయం (మార్చి 2021 నెలతో) పోలిస్తే, గత నెలలో టీవీఎస్ టూవీలర్ల అమ్మకాలు 1 శాతం మెరుగుపడ్డాయి. మార్చి 2022లో కంపెనీ 1,81,328 యూనిట్ల స్కూటర్లు మరియు మోటార్‌సైకిళ్లను విక్రయించగా, మార్చి 2021 నెలలో కంపెనీ మొత్తం 1,79,521 యూనిట్ల టూవీలర్లను విక్రయించింది. ఫిబ్రవరి 2022 నెలతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 17 శాతం పెరిగాయి.

4. బజాజ్ (1,23,413 యూనిట్లు)
భారతదేశపు టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో గడచిన మార్చి 2022 నెలలో మొత్తం 1,23,413 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మార్చి 2021 నెలలో) కంపెనీ విక్రయించిన 1,38,290 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 10 శాతానికి పైగా తగ్గాయి. కాగా, ఫిబ్రవరి 2022 నెల అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో బజాజ్ ఆటో విక్రయాలు 14 శాతం నెలవారీ వృద్ధిని సాధించాయి.
| Rank | 2W Retail Sales | Mar-22 | Feb-22 | Growth (%) MoM |
| 1 | Hero | 3,73,528 | 3,11,907 | 19.76 |
| 2 | Honda | 2,81,725 | 2,46,504 | 14.29 |
| 3 | TVS | 1,81,328 | 1,55,040 | 16.96 |
| 4 | Bajaj | 1,23,413 | 1,08,682 | 13.55 |
| 5 | Royal Enfield | 50,762 | 44,010 | 15.34 |
| 6 | Suzuki | 49,371 | 44,129 | 11.88 |
| 7 | Yamaha | 41,812 | 36,384 | 14.92 |
| 8 | Hero Electric | 13,023 | 7,356 | 77.04 |
| 9 | Ola Electric | 9,121 | 3,904 | 133.63 |
| 10 | Okinawa | 8,284 | 5,923 | 39.86 |

5. రాయల్ ఎన్‌ఫీల్డ్ (50,762 యూనిట్లు)
భారతదేశపు ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా గత నెలలో ప్రతికూల అమ్మకాలను నమోదు చేసింది. మార్చి 2021 నెలలో కంపెనీ విక్రయించిన 60,847 యూనిట్లతో పోలిస్తే, కంపెనీ గడచిన మార్చి 2022 నెలలో కేవలం 50,762 యూనిట్ల మోటార్‌సైకిళ్లను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు గణాంకాలు 16 శాతానికి పైగా తగ్గాయి. ఫిబ్రవరి 2022 నెలతో పోలిస్తే, కంపెనీ గత నెలలో 6,752 యూనిట్లను ఎక్కువగా విక్రయించగలిగినందున,ఈ బ్రాండ్ నెలవారీ అమ్మకాలు 15 శాతానికి పైగా మెరుగుపడ్డాయి.

6. సుజుకి (49,371 యూనిట్లు)
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి గడచిన మార్చి 2022 నెలలో 49,371 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కాగా, గడచిన మార్చి 2021 నెలలో కంపెనీ మొత్తం 48,741 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో సుజుకి టూవీలర్ సేల్స్ 1 శాతం మాత్రమే పెరిగాయి. అయితే, ఈ బ్రాండ్ ఫిబ్రవరి 2022 నెలలో విక్రయించిన 44,129 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు దాదాపు 12 శాతం పెరిగాయి.

7. యమహా (41,812 యూనిట్లు)
జపనీస్ టూ-వీలర్ బ్రాండ్, యమహా గడచిన మార్చి 2022 నెలలో మొత్తం 41,812 యూనిట్ల ద్విచక్ర వాహనాల విక్రయాలను నమోదు చేసింది. అయితే, మార్చి 2021 నెలలో కంపెనీ విక్రయించిన 44,311 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 5 శాతనికి పైగా క్షీణించాయి. కాకపోతే, ఫిబ్రవరి 2022 నెల అమ్మకాలతో పోలిస్తే, గడచిన నెలలో యమహా అమ్మకాలు దాదాపు 15 శాతం వృద్ధి చెందాయి.

8. హీరో ఎలక్ట్రిక్ (13,023 యూనిట్లు)
ఇక ఈ జాబిచాలో చివరి మూడు స్థానాలను ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు దక్కించుకున్నాయి. హీరో ఎలక్ట్రిక్ గడచిన మార్చి 2022 నెలలో 13,023 యూనిట్లను విక్రయించింది. మార్చి 20211 నెలలో విక్రయించిన 5,235 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు ఏకంగా 149 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. కాగా, ఫిబ్రవరి 2022 నెలలో విక్రయించిన 7,356 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 77 శాతం నెలవారీ వృద్ధిని సాధించాయి.

9. ఓలా ఎలక్ట్రిక్ (9,127 యూనిట్లు)
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టూవీలర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్, టూవీలర్ ఆటోమొబైల్ విభాగంలో కొత్త కంపెనీ అయినప్పటికీ, గడచిన మార్చి 2022 నెలలో కంపెనీ 9,127 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగలిగింది. కాగా, ఈ బ్రాండ్ అంతకు ముందు నెలలో (ఫిబ్రవరి 2022)లో విక్రయించిన 3,904 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో కంపెనీ అమ్మకాలు 134 శాతం పెరిగాయి.

10. ఒకినావా (8,284 యూనిట్లు)
ఈ జాబితాలో చివరిస్థానంలో ఉన్నది ఒకినావా ఆటో టెక్. దేశవ్యాప్తంగా మంచి డీలర్ నెట్‌వర్క్‌తో భారతీయ ఆటోమోటివ్ మార్కెట్లో బలమైన పట్టును కలిగి ఉన్న ఈ బ్రాండ్, గడచిన మార్చి 2022 నెలలో 8,284 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కాగా, గతేడాది ఇదే సమయంలో కంపెనీ అమ్మకాలు కేవలం 1,530 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో ఒకినావా అమ్మకాలు 441 శాతానికి మించి పెరిగాయి. నెలవారీ వృద్ధి చూసుకుంటే, ఇది 40 శాతంగా ఉంది.
Source: Rushlane


Click it and Unblock the Notifications








