లైసెన్స్ & రిజిస్ట్రేషన్ అవసరంలేని హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇదే: ధర కూడా తక్కువే
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'హీరో ఎడ్డీ' (Hero Eddy). ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని లైట్ వెయిట్ మరియు మంచి డిజైన్ కలిగి ఉంటుంది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త Eddy ఎలక్ట్రిక్ స్కూటర్ రోజూ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది. 'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రతి రోజు వినియోగించడానికి మరియు వినియోగదారులు అవసరాలకు తగినట్లుగా మరియు తక్కువ దూరం కోసం రూపొందించబడింది. కొత్త హీరో ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.72,000 (ఎక్స్-షోరూమ్) గా వెల్లడించింది. ఎల్లో మరియు లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

సాధారణంగా మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనం రోడ్డుపైన నడపాలంటే తప్పనిసరిగా లైసెన్స్ అవసరం, కానీ ఈ 'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే కంపెనీ ఈ ఎలెక్ట్రిక్ స్కూటర్ యొక్క వేగాన్ని కేవలం 25 కిలోమీటర్లకు పరిమితం చేసింది. ఇది మిగిలిన ఎలక్ట్రిక్ బైకులకంటే కూడా తక్కువ వేగం కావున ఈ బైక్ రైడ్ చేయడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు.

కొత్త 'హీరో ఎడ్డీ' (Hero Eddy) ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్న స్లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ లో ఫైండ్ మై బైక్ ఫీచర్ వంటి లేటెస్ట్ ఫీచర్ కూడా ఉంది. కావున మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని బటన్‌ను నొక్కడం ద్వారా పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన స్కూటర్‌ను కనుగొనవచ్చు.

అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రిమోట్ లాక్ ఫీచర్ కూడా ఉంది, దీని సహాయంతో మీరు స్కూటర్‌కు దూరంగా ఉన్నప్పుడు కూడా దాన్ని లాక్ చేయవచ్చు లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలమైన ఫీచర్.

హీరో ఎడ్డీ స్కూటర్‌లో రివర్స్ మోడ్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, స్లిమ్ ఎల్‌ఈడీ ఇండికేటర్, బ్యాక్‌రెస్ట్ వంటి అనేక ఫీచర్లు అందించబడ్డాయి. కంపెనీ ఈ కొత్త స్కూటర్ కి బాక్సీ డిజైన్ అందించింది. కావున చూడటానికి ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

హీరో ఎడ్డీ చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికి బైక్ వంటి స్ట్రెయిట్ హ్యాండిల్‌బార్‌ను పొందుతుంది, దీనికి మధ్యలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే ఇవ్వబడింది. ఈ స్కూటర్ ని రైడ్ చేయడానికి రైడర్ కోసం పెద్ద లెగ్‌స్పేస్ కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా పెద్ద మరియు వెడల్పు సెట్ కూడా ఇవ్వబడింది. వెనుక కూర్చున్న రైడర్‌కు రియర్ ఫుట్‌హోల్డ్, బ్యాక్ రెస్ట్ మరియు గ్రాబర్ వంటివి ఇవ్వబడ్డాయి.

కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో ఎడ్డీకి సంబంధించి బ్యాటరీ మరియు రేంజ్ వంటి ఫీచర్స్ వెల్లడించలేదు, కానీ ఈ స్కూటర్ లో లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది, కావున ఇది పూర్తి ఛార్జింగ్‌పై దాదాపుగా 50 కి.మీ పరిధిని అందించే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కూటర్ లోని బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఒకటి నుండి ఒకటిన్నర గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

కంపెనీ ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ ఇప్పటికే తన పోర్ట్‌ఫోలియోలో ఆప్టిమా మరియు ఫ్లాష్ వంటి తక్కువ-స్పీడ్ మోడల్‌లను కలిగి ఉంది. హీరో ఎలక్ట్రిక్ లుధియానాలో తయారీ యూనిట్‌తో భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. కంపెనీ విస్తృత శ్రేణి వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది.

హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ మరియు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సర్వీస్‌తో పాటు దేశవ్యాప్తంగా 750 కి పైగా సేల్స్ మరియు సర్వీస్ అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది. కంపెనీ గత 14 సంవత్సరాలుగా భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అప్పటి నుంచి కంపెనీ దాదాపు 4.5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

హీరో ఎలక్ట్రిక్ రానున్న రోజుల్లో కూడా మరిన్ని ఆధునిక ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త ఆధునిక వాహనాలు మార్కెట్లో ప్రవేశపెడితే అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రాబోయే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం గురించి హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజాల్ మాట్లాడుతూ.. కంపెనీ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఆధునిక వాహనాలను తీసుకు వస్తుందని, రానున్న రోజుల్లో కూడా మరిన్ని కొత్త ఉత్పత్తులు తీసుకు వస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications








