ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

ఓలా ఎలక్ట్రిక్ దేశంలో ఎలాంటి భౌతిక సేల్స్ నెట్‌వర్క్ లేకుండానే విజయవంతంగా వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసినదే. ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆన్‌లైన్ లో విక్రయించడం మరియు వాటిని నేరుగా కస్టమర్ల ఇంటికే డెలివరీ చేయడం చేస్తోంది. ఇది వినియోగదారులకు ఇంటి వద్ద నుండే సౌకర్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కాగా, ఇప్పుడు దేశంలోని ఇతర టూవీలర్ కంపెనీలు కూడా ఓలా ఎలక్ట్రిక్ తరహాలోనే వ్యాపారాన్ని చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) తమ టూవీలర్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ మరియు ఆన్‌లైన్స్ సేల్స్ తో పాటుగా హోమ్ డెలివరీ విధానాన్ని కూడా ప్రారంభించింది. హీరో ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల కోసం హైబ్రిడ్ సేల్స్ మోడల్‌ను పరిచయం చేసింది. దీని ప్రకారం, కంపెనీ తన డీలర్ల వద్ద మాత్రమే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా వాహనాలను విక్రయించాలని మరియు ఇలా విక్రయించిన వాహనాలను తమ డీలర్ నెట్‌వర్క్ సాయంతో నేరుగా కస్టమర్ ఇంటికే డెలివరీ చేయాలని యోచిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

దేశంలో కోవిడ్-19 మహమ్మారి విజృంభన తర్వాత ఆటోమొబైల్ మార్కెట్లో డీలర్ లేకుండా నేరుగా వినియోగదారులకు వాహనాలను విక్రయించే ధోరణి జోరుగా సాగుతోంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఓలా ఎలక్ట్రిక్. ఓలా భారతదేశంలో ఎక్కడా డీలర్‌షిప్ లేకుండా నేరుగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా వాహనాలను విక్రయిస్తోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా అనేక కంపెనీలు ఈ ఆన్‌లైన్ బుకింగ్ మరియు సేల్స్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని, మరింత ఎక్కువ మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు హీరో ఎలక్ట్రిక్ ఈ కొత్త వ్యాపార విధానానికి శ్రీకారం చుట్టింది.

ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

ఆసక్తికగల కస్టమర్లు హీరో ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ ను సందర్శించి తమకు నచ్చిన ఎలక్ట్రిక్ వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొనుగోలు ప్రక్రియ ప్రారంభించవచ్చు. ఆ తర్వాత కస్టమర్లు తమకు సమీపంలో ఉన్న డీలర్‌షిప్ ను ఎంచుకోవడం ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ ను సదరు డీలర్‌షిప్ కు కానీ లేదా కస్టమర్ ఇంటి వద్దకు కానీ డెలివరీ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, ఓలా డైరెక్ట్ డెలివరీని వేగంగా చేస్తోంది. ఇప్పుడు హీరో ఎలక్ట్రిక్ కూడా తమ కస్టమర్లకు ఈ అనుభవాన్ని అందించాలని నిర్ణయించుకుంది.

ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

ఈ సందర్భంగా హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. తాము ఇప్పటికీ కస్టమర్‌లను ముఖాముఖిగా కలవడం, తమ అనుభవజ్ఞులైన నిపుణులతో మాట్లాడడం మరియు వారు ఎంచుకున్న వాహనాన్ని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత వాహనాలను విక్రయించడం వంటి విధానాలనే ఇష్టపడతామని, అయితే, కొంతమంది కస్టమర్‌లు ఆన్‌లైన్‌లో వాహనాలను కొనుగోలు చేయడం సౌకర్యంగా ఉంటుందని, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఈ హైబ్రిడ్ సేల్స్ మోడల్ ను ప్రారంభించామని చెప్పారు.

ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

హీరో ఎలక్ట్రిక్ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4,00,000 లకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారత మార్కెట్లో కంఫర్ట్ స్పీడ్ మరియు సిటీ స్పీడ్ విభాగంలో స్కూటర్లను విక్రయిస్తోంది. వీటితో పాటుగా వెలాసిటీ అనే ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ను కూడా కంపెనీ విక్రయిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

కంఫర్ట్ స్పీడ్ విభాగంలో హీరో ఎడ్డీ (Eddy), అట్రియా ఎల్ఎక్స్ (Atria), ఫ్లాష్ ఎల్ఎక్స్ (Flash) మరియు ఎన్‌వైఎక్స్ ఈ5 (NYX E5) ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. గతంలో ఇదే విభాగంలో విక్రయించిన ఆప్టిమా (Optima) ఎలక్ట్రిక్ స్కూటర్ ను కంపెనీ డిస్‌కంటిన్యూ చేసింది. ఇవన్నీ కూడా లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, వీటి గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్ల కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి రైడర్లకు ఎలాంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు.

ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

ఇక సిటీ స్పీడ్ విభాగం విషయానికి వస్తే, కంపెనీ ఇందులో ఆప్టిమా సిఎక్స్ సింగిల్ బ్యాటరీ (Optima CX Single Battery), ఆప్టిమా సిఎక్స్ డ్యూయెల్ బ్యాటరీ (Optima CX Dual Battery), ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్500 ఈఆర్ (NYX HS500 ER) మరియు ఫోటాన్ ఎల్‌పి (Photon LP) వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఈ స్కూటర్ల గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 45 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ సిటీ స్పీడ్ రేంజ్ స్కూటర్లను నడపడానికి వాహనాలకు రిజిస్ట్రేషన్ మరియు రైడర్లకు టూవీలర్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

ఓలా ఎలక్ట్రిక్‌ని కాపీ కొట్టిన హీరో ఎలక్ట్రిక్.. ఇప్పుడు కస్టమర్ల ఇంటికే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ డెలివరీ

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ గత కొన్ని నెలలుగా అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వచ్చిన తర్వాత చాలా మంది కస్టమర్లు ఈ తరహా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతాయని భావిస్తున్నారు. హీరో ఎలక్ట్రిక్ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.5 లక్షల వాహనాలను విక్రయించాలని యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 2, 2022, 15:31 [IST]
English summary
Hero electric accepts the online booking and delivers to home know full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+