యాక్సిస్ బ్యాంక్‌తో చేతులు కలిపిన Hero Electric: ఇక స్కూటర్ కొనటం చాలా సింపుల్.. ఎలా అంటే?
దేసియ విఫణిలో అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ అయిన 'హీరో ఎలక్ట్రిక్' (Hero Electric) ఇప్పుడు కస్టమర్లకు తమ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మరింత సులభమైన పద్దతిలో ఫైనాన్సింగ్ ఆప్సన్ అందించడానికి యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

'హీరో ఎలక్ట్రిక్' (Hero Electric) అందించిన సమాచారం ప్రకారం, యాక్సిస్ బ్యాంక్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఇప్పుడు సులభంగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయవచ్చు. హీరో ఎలక్ట్రిక్ కస్టమర్‌లు ఇప్పుడు కనీస డాక్యుమెంటేషన్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం లోన్ పొందవచ్చు.

ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు కోసం పొందే లోన్ వల్ల వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూటర్ సొంతం చేసుకోవచ్చు. ఇది కంపెనీ యొక్క అమ్మకాలను తప్పకుండా మరింత పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగం పెరుగుతున్న సమయంలో తప్పకుండా కంపెనీ అందిస్తున్న ఈ కొత్త ఫైనాన్సింగ్ స్కీమ్ వినియోగదారులకు తప్పకుండా చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రస్తుతం అందుబటులో ఉన్న హీరో ఎలక్ట్రిక్ యొక్క 750 కి పైగా డీలర్ల విస్తృత నెట్‌వర్క్‌లో వినియోగదారులు ఈ టూవీలర్ ఫైనాన్సింగ్‌ను ఎంచుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్‌లు మరియు డీలర్‌ల కోసం కంపెనీ లోన్ మొత్తాన్ని మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ కాల వ్యవధిని కూడా అందిస్తుంది. కావున ఈ లోన్ పొందేవారు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం కూడా ఉండదు.

భారతీయ మార్కెట్లో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన 'హీరో ఎలక్ట్రిక్' వచ్చే ఐదేళ్లలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని 50 లక్షల యూనిట్లకు పెంచుకునేందుకు ఒక అద్భుతమైన ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో కంపెనీ తన లూథియానా ప్లాంట్‌లో తమ ఉత్పత్తిని కూడా 2022 మధ్య నాటికి సంవత్సరానికి 5 లక్షల యూనిట్లకు పెంచుతుంది.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సబ్సిడీలు మరియు రాయితీలను అందిస్తోంది. ఇందులో ఫేమ్-2 స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీ సబ్సిడీ అందిస్తోంది. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు చాలామేరకు పెరిగాయని హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజాల్ తెలిపారు.

అంతే కాకూండా గత ఎనిమిది నెలలుగా హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగిందని కూడా ఆయన చెప్పారు. దీనికి ప్రస్తుతం అందుబటులో ఉన్న సబ్సిడీలే ప్రధాన కారణం అన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబటులో ఉన్న డిమాండ్ ని తీర్చడానికి మరియు సరైన సమయానికి కస్టమర్లకు వాహనాలను అందించడానికి ఉత్పత్తి సామర్త్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరో ఎలక్ట్రిక్ పూర్తి సామర్థ్యంతో ఇప్పుడు ఉత్పత్తి చేస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 1 లక్ష యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే రెట్టింపు. ఇది కాకుండా, ఉత్పత్తి సామర్థ్యాలను మెరుగుపరచడంలో కూడా కంపెనీ పెట్టుబడి పెట్టాలని చూస్తోంది. కంపెనీ 2022 జనవరి అమ్మకాల ప్రకారం 26,193 యూనిట్ల హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. అదే సమయంలో గత ఏడాది కంపెనీ కేవలం 4,899 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు భారీగా పెరిగాయని మనకు స్ఫష్టంగా అర్థమౌతోంది.

హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) కంపెనీ భారతీయ మార్కెట్లో హై-స్పీడ్ మరియు లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ అందిస్తున్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు. ఈ కారణంగా ఎక్కువమంది వీటిని కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

కంపెనీ గత ఏడాది నవంబర్‌లో సిటీ స్పీడ్ రేంజ్‌లో ఆప్టిమా హెచ్‌ఎక్స్, ఫోటాన్ హెచ్‌ఎక్స్ మరియు ఎన్‌వైఎక్స్-హెచ్‌ఎక్స్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. ఇవి 30 కి.మీ/గం కంటే ఎక్కువ వేగంతో ఉన్న హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఇవన్నీ కూడా అన్ని రకాల అర్బన్ రోడ్లలో నడిచేలా కంపెనీ డిజైన్ చేసింది. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఫ్లై ఓవర్లు మరియు క్లైంబింగ్ మార్గాల్లో కూడా సులభంగా రైడ్ చేయవచ్చు. ఈ స్కూటర్లన్నీ కూడా మంచి పరిధిని మరియు మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలపైన రిజిస్ట్రేషన్ మరియు రెన్యూవల్ ఫీజు నుండి మినహాయించింది. దీనితో పాటు, కొత్త బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ప్రభుత్వం ప్రోత్సాహక మొత్తాన్ని కిలోవాట్‌కు రూ.10,000 నుంచి రూ.15,000కి పెంచింది. అలాగే, వాహన ధరలో ప్రోత్సాహక పరిమితిని 20% నుంచి 40%కి పెంచారు. ఇవన్నీ కూడా తప్పకుండా ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలను పెంచుతాయి.

కేంద్ర ప్రభ్యత్వం అందిస్తున్న ఫేమ్-2 స్కీమ్ కోసం మొత్తం రూ. 10,000 కోట్లు ఆమోదించబడ్డాయి, ఇందులో రూ. 8,596 కోట్లు డిమాండ్ ప్రమోషన్ కోసం, రూ. 1,000 కోట్లు ఛార్జింగ్ స్టేషన్‌ల వంటి మౌలిక సదుపాయాల కోసం మరియు పరిపాలనాపరమైన మౌలిక సదుపాయాల కోసం బ్యాలెన్స్ కోసం కేటాయించబడతాయి. కావున రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. ఫేమ్-2 స్కీమ్ కింద ఇప్పటికి సుమారు 2,00,000 వాహనాలకు సబ్సిడీ ప్రయోజనం అందించబడింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ కోసం మొత్తం రూ.900 కోట్ల సబ్సిడీని కూడా పొందటం జరిగింది.

వాహన్ పోర్టల్ నుండి అందుబాటులోకి వచ్చిన డేటా ప్రకారం, భారతదేశం 2021 లో 3,11,000 బ్యాటరీ-ఆపరేటెడ్ వెహికల్స్ నమోదు చేయబడ్డాయి. అంతకు ముందు సంవత్సరంలో బ్యాటరీ-ఆపరేటెడ్ వెహికల్స్ నమోదు 1,19,000 గా ఉంది. అయితే రానున్న సంవత్సరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








