హీరో ఎలక్ట్రిక్ నుండి మరో రెండు కొత్త ఇ-స్కూటర్లు.. పూర్తి చార్జ్‌పై 140 కిలోమీటర్ల రేంజ్!
ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric), త్వరలోనే మరో కొత్త మోడల్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న ఆప్టిమా సిఎక్స్ (Hero Optima CX) సిరీస్‌ను కంపెనీ అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ అప్‌డేటెడ్ స్కూటర్ మొత్తం రెండు వేరియంట్లలో విడుదల చేయబడుతుందని తాజాగా లీకైన బ్రోచర్ వెల్లడిస్తోంది. కంపెనీ ఈ కొత్త స్కూటర్ ను Optima CX మరియు Optima CX ER (ఎక్స్‌టెండెడ్ రేంజ్) అనే రెండు వేరియంట్లలో విడుదల చేయనుంది.

ప్రస్తుతం, హీరో ఎలక్ట్రిక్ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో CX మోడల్ ఇ-స్కూటర్ ధర రూ. 62,190 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా లిస్ట్ చేయబడి ఉంది. కాగా, కొత్తగా రాబోయే Hero Optima CX యొక్క రెండు వేరియంట్‌లు కూడా ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న Optima HX రేంజ్ ఇ-స్కూటర్ లకు ఎగువన ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొత్త హీరో ఆప్టిమా సిఎక్స్ (Hero Optima CX) మరియు హీరో ఆప్టిమా సిఎక్స్ ఈఆర్ (Hero Optima CX ER) రెండు మోడళ్లు డిజైన్, ఫీచర్ల పరంగా ఒకేలా ఉండనున్నాయి.

అయితే, ఈ రెండు మోడళ్లను ప్రధానంగా వేరు చేసే అంశం ఏంటంటే, వాటిలో ఉపయోగించిన బ్యాటరీ ప్యాక్స్. హీరో ఆప్టిమా సిఎక్స్ ఒకే బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటే, హీరో ఆప్టిమా సిఎక్స్ ఈఆర్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఈ మార్పు మినహా వీటిలో పెద్దగా తేడాలు ఉండకపోవచ్చు. కొత్త Hero Optima CX దాని ప్రస్తుత మోడల్ Optima HX డిజైన్ ని పోలి ఉండే అవకాశం ఉంది. అయితే, స్పెసిఫికేషన్ల పరంగా మాత్రం వీటిలో మార్పు ఉండవచ్చు. కొత్త అప్‌డేటెడ్ హీరో ఆప్టిమా సిఎక్స్ మునుపటి మోడల్ కంటే 25 శాతం శక్తివంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

అంతే కాకుండా, హీరో మోటోకార్ప్ ఈ కొత్త అప్‌డేటెడ్ ఆప్టిమా సిఎక్స్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటారును అప్‌గ్రేడ్ చేయనుంది. సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ మోటార్ సామర్థ్యం మునుపటి కంటే 10 శాతం ఎక్కువగా ఉంటుంది మరియు ఫలితంగా దాని వేగం కూడా పెరుగుతుందని బ్రోచర్ లో వెల్లడించబడింది. ఇది కాకుండా, ఇందులో మునుపటి కన్నా పెద్ద బ్యాటరీ ప్యాక్ ను కూడా ఉపయోగించబడుతున్న నేపథ్యంలో, దీని రేంజ్ కూడా మరింత మెరుగ్గా ఉంటుంది.

హీరో ఆప్టిమా సిఎక్స్ మరియు ఆప్టిమా సిఎక్స్ ఈఆర్ మోడళ్లలో కనిపించే స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, కంపెనీ వీటిలో 52.2 వోల్ట్, 30 ఆంప్స్ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించింది. ఇందులోని బేస్ హీరో ఆప్టిమా సిఎక్స్ వేరియంట్ పూర్తి చార్జ్ పై 82 కిమీల రేంజ్ ను అందిస్తుంది. కాగా, ఆప్టిమా సిఎక్స్ ఈఆర్ ఇలాంటి రెండు బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటుంది కాబట్టి దాని రేంజ్ దాదాపు రెట్టింపుగా ఉంటుంది. అంటే, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 140 కిమీ పైగా రేంజ్ ను అందించే అవకాశం ఉంది.

ఈ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ లో అమర్చిన 550 వాట్ ఎలక్ట్రిక్ మోటారుకు శక్తిని అందిస్తుంది. ఇది గరిష్టంగా 1.2kW (1.6 bhp) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇతర ఆప్టిమా సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే, కొత్త ఆప్టిమా సిఎక్స్ సిరీస్ ఇ-స్కూటర్లు కూడా సిటీ స్పీడ్ రేంజ్ స్కూటర్లు. కాబట్టి, ఇవి రెండూ కూడా గరిష్టంగా గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రెండు మోడళ్లలో బ్రేకింగ్ పనితీరను కూడా మెరుగుపరచినట్లు బ్రోచర్ లో పేర్కొన్నారు. చార్జింగ్ సమయం విషయానికి వస్తే, ఆప్టిమా సిఎక్స్ ఒక చార్జర్ తో వస్తుంది మరియు సిఎక్స్ ఈఆర్ రెండు చార్జర్లతో వస్తుంది. వీటి బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 4-5 గంటల సమయం పడుతుంది.

హీరో ఆప్టిమా సిఎక్స్ మరియు ఆప్టిమా సిఎక్స్ ఈఆర్ రెండు వేరియంట్లలో బ్యాటరీ ప్యాక్ అప్‌గ్రేడ్ మినహా పెద్దగా మార్పులేమీ లేవు. కాబట్టి, ఈ రెండింటిలో ఉపయోగించిన పరికరాలు మరియు ఫీచర్లు ఒకేలా ఉంటాయి. కొత్త అప్‌డేటెడ్ హీరో ఆప్టిమా సిఎక్స్ రేంజ్ ఇ-స్కూటర్లలో క్రూయిజ్ కంట్రోల్, వాక్ అసిస్ట్, రివర్స్ మోడ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు రిమోట్-కీతో కూడిన యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు లభిస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇరువైపులా 12 ఇంచ్ వీల్స్ ఉంటాయి మరియు వాటిపై 90/90 ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చబడి ఉంటాయి. ఇక చివరిగా ధరల విషయానికి వస్తే, హీరో ఆప్టిమా సిఎక్స్ రేంజ్ మోడళ్ల ధరలు కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న ఆప్టిమా హెచ్ఎక్స్ సిరీస్ ధరల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. కంపెనీ ఈ కొత్త శ్రేణి స్కూటర్లను రూ. 60,000 నుండి రూ. 70,000 (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయవచ్చని అంచనా. ఆప్టిమా సిఎక్స్ రేంజ్ స్కూటర్లు బ్లూ, గ్రే మరియు వైట్ అనే మూడు కలర్ ఆప్షన్ లలో విడుదల కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.
Source: Elevahan


Click it and Unblock the Notifications








