2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన 2022 జూన్ నెల అమ్మకాల నివేదికలను అధికారికంగా విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం కంపెనీ అమ్మకాలు మునుపటి ఏడాదికంటే కూడా 3.35 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలిసింది. అయితే కంపెనీ యొక్క మొత్తం అమ్మకాల గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ యొక్క గణాంకాల ప్రకారం, 2022 జూన్ నెలలో మొత్తం 4,84,867 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలిసింది. అయితే కంపెనీ ఇదే నెల గత సంవత్సరం అంటే 2021 జూన్ నెలలో కేవలం 4,69,160 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు తెలిపింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ అమ్మకాలు 2021 జూన్ కంటే కూడా 2022 జూన్ లో పెరిగాయి.

2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

గణాంకాల ప్రకారం, హీరో మోటోకార్ప్ యొక్క మొత్తం దేశీయ విక్రయాలు 2022 జూన్ నెలలో 4,63,210 యూనిట్లుగా తెలిసింది. అయితే 2021 జూన్ నెలలో కంపెనీ యొక్క దేశీయ విక్రయాల 4,38,514 యూనిట్లు. ఇక సెగ్మెంట్ల వారీగా అమ్మకాలను గమనిస్తే, 2021 జూన్‌లో విక్రయించిన 4,41,536 యూనిట్లతో పోలిస్తే 2022 జూన్‌లో మోటార్‌సైకిళ్ల విక్రయాలు 4,61,421 యూనిట్లకు పెరిగాయి.

2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ యొక్క స్కూటర్స్ సేల్స్ విషయానికి వస్తే, కంపెనీ 2022 జూన్ మొత్తం 23,446 స్కూటర్లను విక్రయించింది. అదే సమయంలో 2021 జూన్‌లో కంపెనీ 27,624 యూనిట్లను విక్రయించింది. స్కూటర్ అమ్మకాల్లో కంపెనీ కొంత తగ్గుదలను నమోదు చేసింది.

2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ FY 2023 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్ - జూన్ 2022) 13.90 లక్షల యూనిట్లను విక్రయించింది, ఇది 11.89 లక్షల యూనిట్లతో పోలిస్తే, ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం (జనవరి-మార్చి 2022) నుండి 17% వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ 10.25 లక్షల యూనిట్లను విక్రయించిన మునుపటి ఆర్థిక సంవత్సరం (FY22) త్రైమాసికం కంటే కూడా మంచి వృద్ధిని నమోదు చేయగలిగింది.

Hero June'22 June'21 YTD FY'23 YTD FY'22
Motorcycles 4,61,421 4,41,536 13,06,294 9,59,589
Scooters 23,446 27,624 83,899 64,918
Total 4,84,867 4,69,160 13,90,193 10,24,507
Domestic 4,63,210 4,38,514 13,28,166 9,40,707
Exports 21,657 30,646 62,027 83,800
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

మొత్తం మీద కంపెనీ యొక్క అమ్మకాలు 2021 జూన్ కంటే కూడా 2022 జూన్ లో కొంత అభివృద్దిని నమోదు చేసింది. అయితే రానున్న రోజుల్లో కంపెనీ మరింత వృద్ధిని నమోదు చేయగలదని ఆశిస్తున్నాము.

2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

ఇదిలా ఉండగా.. కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో తన కొత్త 'ప్యాషన్ ఎక్స్‌టెక్' (Passion XTEC) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 74,590 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఎక్స్‌టెక్ డ్రమ్ వేరియంట్ (రూ.74,590) మరియు ఎక్స్‌టెక్ డిస్క్ వేరియంట్ (రూ.78,990). ఈ లేటెస్ట్ బైక్ ఇప్పుడు చాలా అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ మార్పులు బ్లూటూత్ కనెక్టివిటీ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇప్పుడు ఈ కొత్త బైక్ ఈ రెండు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్ బైక్ లో ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉండటం వల్ల వాహన వినియోగదారుడు స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్‌కు కనెక్ట్ అయిన తర్వాత, బైక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కాల్ అలర్ట్‌, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో-ఫ్యూయెల్ వార్ణింగ్ లైట్ మరియు సర్వీస్ రిమైండర్‌ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.

2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ యొక్క ఈ కొత్త బైక్ 110 సిసి బిఎస్6 ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి పవర్ మరియు 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.79 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు మరింత మెరుగైన మైలేజ్ అందించడానికి ఐ3ఎస్ టెక్నాలజీని కలిగి ఉంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

Most Read Articles

English summary
Hero motocorp 2022 june sales details
Story first published: Saturday, July 2, 2022, 12:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X