'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), కేవలం పెట్రోల్ టూవీలర్ల విభాగంలోనే కాకుండా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల విభాగంలో కూడా అగ్రగామిగా నిలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే తమ సబ్-బ్రాండ్ విడా (Vida) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్న హీరో మోటోకార్ప్, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ కోసం మరో సంస్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp)తో కలిసి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేసేందుకు జీరో మోటార్‌సైకిల్స్‌ (Zero Motorcycles) ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. గత కొంత కాలంగా ఈ ఒప్పందం గురించి చర్చలు జరుగుతుండగా, ఇది ఎట్టకేలకు ఖరారైంది. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేయబోయే జీరో మోటార్‌సైకిల్స్‌ సంస్థలో హీరో మోటోకార్ప్ ఏకంగా 60 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 488 కోట్ల) పెట్టుబడిని వెచ్చించనున్నట్లు ప్రకటించింది. ఇది వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ దిశగా హీరో మోటోకార్ప్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా చెప్పబడుతోంది.

'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. భూమిలో అంతరించిపోతున్న శిలాజ ఇంధనాలు మరియు భవిష్యత్ తరాల కోసం సరసమైన మొబిలిటీ సేవలను అందించాలనే నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ జోరందుకుంది. అమెరికా వంటి దేశాలలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మంచి విజయాన్ని సాధించగా, మన భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం నానాటికీ అధికమవుతోంది. ప్రత్యేకించి, ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో ఈ వృద్ధి రేటు చాలా వేగంగా ఉంది.

'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

ద్విచక్ర వాహనాల ఉత్పత్తి మరియు అమ్మకాల పరంగా హీరో మోటోకార్ప్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఉంది. ఈ బ్రాండ్ రోజూవారీ ఉపయోగం కోసం కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు, యువ ఔత్సాహికుల కోసం స్పోర్టీ మోటార్‌సైకిళ్లను అందిస్తోంది. అలాగే, యువత, పెద్దలు మరియు మహిళల కోసం స్కూటర్లను కూడా అందిస్తోంది. అన్ని వర్గాల వారి కోసం హీరో మోటోకార్ప్ నుండి వివిధ విభాగాలలో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ బ్రాండ్ నుండి స్వంతంగా ఎలాంటి ఎలక్ట్రిక్ వాహనాలు లేవు.

'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు హీరో మోటోకార్ప్ ప్రయత్నిస్తోంది. అందుకే, ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా వివిధ EV సంస్థలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. బెంగుళూరుకి చెందిన ఏథర్ ఎనర్జీ (ఏథర్ 450ఎక్స్ మరియు 450 ప్లస్ ఇ-స్కూటర్లను విక్రయించే సంస్థ)లో కూడా హీరో మోటోకార్ప్ వాటాను కలిగి ఉంది. అలాగే, బ్యాటరీ మార్పిడి సంస్థ గొగోరోతో కూడా హీరో మోటోకార్ప్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. కాగా, మరికొద్ది రోజుల్లోనే తమ కొత్త సబ్-బ్రాండ్ విడాను ప్రారంభించేందుకు కూడా హీరో మోటోకార్ప్ సిద్ధంగా ఉంది.

'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

వీటికి అధనంగా, ఇప్పుడు జీరో మోటార్‌సైకిల్స్ సంస్థలో కూడా హీరో మోటోకార్ప్ భారీ పెట్టుబడులను పెడుతోంది. ఇవన్నీ చూస్తుంటే, హీరో మోటోకార్ప్ భారత ఈవీ విభాగంలో రారాజుగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో మోటోకార్ప్ యొక్క స్వంత సబ్-బ్రాండ్ అయిన విడా (Vida) తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అక్టోబర్ 7, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో హీరో మోటోకార్ప్ కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది.

'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

హీరో మోటోకార్ప్-బ్రాండెడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ల అభివృద్ధిలో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేటా కూడా ఉపయోగించబడుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలు మరియు పెట్టుబడుల జాబితా సరిపోదంటూ, హీరో మోటోకార్ప్ ఇప్పుడు తాజాగా జీరో మోటార్‌సైకిల్స్‌లో పెట్టుబడి పెట్టింది. జీరో మోటార్‌సైకిల్స్ అనేది మాజీ NASA ఇంజనీర్స్‌చే స్థాపించబడిన ఒక అమెరికన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీ కంపెనీ. దీనిని గతంలో ఎలక్ట్రిక్‌క్రాస్ అని పిలిచేవారు.

'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

జీరో మోటార్‌సైకిల్స్ సంస్థ ఇప్పటికే జీరో S, SR, FXS, DS, DSR, FX మరియు SR వంటి మోడళ్లను ఉత్పత్తి చేసింది. ఈ అమెరికన్ బ్రాండ్ కు అనేక రకాల ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయడంలో గొప్ప అనుభవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో, హీరో మోటోకార్ప్ మరియు జీరో మోటార్‌సైకిల్స్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లపై దేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఒప్పందంతో జీరో బ్రాండ్ యొక్క ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ఉపయోగించే కొన్ని కీలక సాంకేతికతలకు కూడా హీరోకి కూడా యాక్సెస్‌ లభిస్తుంది.

'హీరో' (Hero)తో చేతులు కలిపిన 'జీరో' (Zero).. ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల అభివృద్ధి కోసం భారీ డీల్..

ఈ ఇండో-అమెరికన్ భాగస్వామ్యం నుండి కొన్ని మంచి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు వస్తాయని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ చాలా ప్రాథమికమైనది. ఒకవేళ, మీరు కూడా భారతదేశంలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల ఎంపికలు చాలా తక్కువగా ఉన్నాయి మరియు వాటి పనితీరు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. కాబట్టి, హీరో (Hero) మరియు జీరో (Zero) సంస్థల నుండి రాబోయే కొత్త ఇ-బైక్‌లు ఖచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటాయని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Hero motocorp join hands with zero motorcycles to invests rs 488 crore for electric motorcycles development
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X