భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

భారతదేశంలో ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ అయిన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) దేశీయ మార్కెట్లో ఇప్పుడు ఒక కొత్త బైక్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ బైక్ పేరు 'హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్' (Hero Splendor + XTEC). మార్కెట్లో ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 72,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

కంపెనీ ఇడుదల చేసిన ఈ కొత్త 'హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్' (Hero Splendor + XTEC) చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకూండా ఇందులో లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను 5 సంవత్సరాల వారంటీతో అందిస్తోంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

కొత్త 'హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్' (Hero Splendor + XTEC) ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ అయిన 'బ్లూటూత్ కనెక్టివిటీ'తో కూడిన పుల్ డిజిటల్ మీటర్ తో పాటు కాల్ మరియు ఎస్ఎమ్ఎస్ అలర్ట్‌, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయెల్ ఇండికేటర్, ఎల్ఈడీ హై-ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్ మరియు స్పెషల్ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. కావున ఇది ఇప్పుడు ఈ బైక్ మరింత ఆధునికంగా ఉంది.

భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

పైన తెలిపిన ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇందులో ఇంటిగ్రేటెడ్ యుఎస్బి ఛార్జర్ మరియు సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు మరో టెక్నాలజీ అయిన i3S టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. మొత్తం మీద ఇది హీరో మోటోకార్ప్ ప్రియులకు తప్పకుండా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

'హీరో స్ప్లెండర్' అనేది గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన మరియు తిరుగులేని బైక్ గా ఇప్పటికీ అదే అంచనాలతో ముందుకుసాగుతోంది. వినియోగదారుల విశ్వాసానికి నిదర్శనంగా నిలబడిన ఈ బైక్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూనే ఉంది.

భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

ఈ బైక్ మంచి స్టైల్, పెర్ఫార్మెన్స్ మరియు కంఫర్ట్ ఫీచర్లతో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా విడుదలైన కొత్త Hero Splendor+ XTEC కూడా తప్పకుండా వినియోగదారుల నమ్మకాన్ని నిలబెడుతుంది ఆశిస్తున్నాము.

భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

కొత్త Hero Splendor+ XTEC బైక్ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంది. అవి స్పార్క్లింగ్ బీటా బ్లూ, కాన్వాస్ బ్లాక్, టోర్నాడో గ్రే మరియు పెర్ల్ వైట్ కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ లో కొంత అప్డేట్స్ ఉన్నప్పటికీ.. ఇంజిన్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కావున ఈ కొత్త బైక్ ప్రస్తుతం హీరో స్ప్లెండర్ లో ఉన్న అదే 97.2 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.9 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద వద్ద 8.05 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన Hero Splendor + XTEC: ధర రూ. 72,900

మొత్తానికి దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ కొత్త లేటెస్ట్ బైక్ విడుదల చేసింది. అయితే ఇది కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి తోడ్పడుతుందా.. కస్టమర్లను ఆకర్షిస్తుందా.. అనే మరిన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయి. అప్పటివరకు ఎప్పటికప్పుడు కొత్త బైకులు మరియు కార్లను గురించి సమాచారం తెలుసుకోవడానికి మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Article Published On: Friday, May 20, 2022, 9:35 [IST]
English summary
Hero motocorp launched new splendor plus xtec edition in india at inr 72900
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+