ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) దేశంలోని మోటార్‌సైక్లింగ్ ఔత్సాహికుల కోసం కొత్త ప్లాట్‌ఫారమ్ XCLAN (ఎక్స్‌క్లాన్) ని పరిచయం చేసింది. హీరో ఎక్స్‌క్లాన్ (Hero XCLAN) అనేది కొత్త ఎక్స్‌పల్స్ 200 (XPulse 200) వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేకమైన రైడింగ్ క్లబ్, ఇది దేశంలో అడ్వెంచర్ మోటార్‌సైకిల్ రైడింగ్ సంస్కృతిని మెరుగుపరుస్తుంది. అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో హీరో ఎక్స్‌పల్స్ 200 ఇప్పటికే బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా ఉంది.

ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో ఎక్స్‌పల్స్ 200 (Hero XPulse 200) మోటార్‌సైకిల్ యజమానులు తమ గ్రూప్ లను ఏర్పరచుకోవడానికి, ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి మరియు అనుభవజ్ఞులైన మరియు అనుభవం లేని రైడర్‌ల మధ్య స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఈ ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్ ఎంతగానో సహకరిస్తుంది. ప్రారంభ దశలో, ఇది భారతదేశంలోని ఐదు నగరాల్లో ప్రారంభించబడుతుంది. వీటిలో ముంబై, బెంగళూరు, గౌహతి, డెహ్రాడూన్ మరియు కొచ్చిన్ నగరాలు ఉన్నాయి. తరువాతి దశలో, 2022 చివరి నాటికి ఇతర నగరాలు కూడా ఇందులో చేర్చబడతాయి.

ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో XCLAN ప్లాట్‌ఫారమ్‌ను టైర్ 2 మరియు టైర్ 3 నగరాలకు విస్తరించే ప్రణాళికలతో, హీరో మోటోకార్ప్ యజమానులు మరియు ఔత్సాహికుల మధ్య రైడింగ్ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ భారతదేశం అంతటా ప్రజలకు చేరువ కావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. హీరో XCLAN రైడ్‌లు మరియు ఎంగేజ్‌మెంట్ జూలై 2022 నుండి సన్‌రైజ్ రైడ్‌లు, ఓవర్‌నైట్ రైడ్‌లు మరియు ఎక్స్‌పెడిషన్ రైడ్‌లతో మూడు విభాగాలతో ప్రారంభమవుతాయి. రైడ్ షెడ్యూల్ మరియు మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునే వారు మరింత సమాచారం కోసం హీరో XCLAN వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

ఎక్స్‌క్లాన్ గ్రూపులో సభ్యత్వం, వినియోగదారులకు ఆన్‌బోర్డింగ్ కిట్, చాప్టర్ రైడ్‌లు మరియు ర్యాలీ ఈవెంట్‌లకు ఆహ్వానాలు, హీరో గుడ్‌లైఫ్ ప్లాటినం సభ్యత్వం మరియు ఉత్సాహభరితమైన రైడర్‌ల నెట్‌వర్క్‌తో సహా అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకు ప్రతి రైడర్ సంవత్సరానికి రూ. 2,000 చొప్పున వార్షిక సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో ఎక్స్‌పల్స్ 200 విషయానికి వస్తే, కంపెనీ ఇందులో నాల్గవ తరం మోడల్ హీరో ఎక్స్‌పల్స్ 200 4వి బైక్ ను గతేడాది అక్టోబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త Hero Xpulse 200 4V బైక్ రూ. 1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ దాని మునుపటి తరం మోడళ్ల కంటే కూడా చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. హీరో ఎక్స్‌పల్స్ 200 4వి బైక్‌ని కంపెనీ 2019 సంవత్సరంలో మొదటిసారిగా భారత మార్కెట్లో విడుదల చేయబడింది.

ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

కాగా, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఈ కొత్త తరం మోడల్ మూడవ అప్‌డెటెడ్ వెర్షన్. ఈ కొత్త బైక్ ఇప్పుడు 199.6 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో లభిస్తుంది. గతంలో ఇందులో ఉపయోగించిన 2-వాల్వ్ ఓహెచ్‌సి కి బదులుగా కొత్త 4-వాల్వ్ కాన్ఫిగరేషన్‌ ఉపయోగించారు. ఫలితంగా, ఇంజన్ పనితీరు మునుపటి కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ ఇంజన్ ఇప్పుడు 19.1 బిహెచ్‌పి పవర్ మరియు 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. గతంలోని 2-వాల్వ్ మోడల్ ఆయిల్-కూల్డ్ ఇంజన్ కంటే ఇది 6 శాతం ఎక్కువ శక్తిని మరియు 5 శాతం ఎక్కువ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో మోటోకార్ప్ ప్రధానంగా యవతను లక్ష్యంగా చేసుకొని ఈ బైక్ ను ప్రవేశపెట్ంది. ఈ మోటార్‌సైకిల్ భారతీయ మోటార్‌సైకిల్ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన అవార్డులలో ఒకటైన బెస్ట్ ఇండియన్ మోటార్‌సైకిల్ అవార్డును 2020 సంవత్సరానికి గాను గెలుచుకుంది. ఇందులో ఆకర్షణీయమైన ఎల్ఈడి హెడ్‌లైట్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో మోడ్, రెండు ట్రిప్ మీటర్లు మరియు ఒక సింగిల్ ఛానల్ ABS మరియు పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

మెకానికల్స్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఉంటాయి. అలాగే, ఇందులో ముందు వైపు 21 ఇంచెస్ మరియు 18 ఇంచెస్ వీల్ కాంబోను పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 90/90-21 టైరు మరియు వెనుక భాగంలో 120/80-18 టైరు ఉంటాయి. ఈ ఎక్స్‌పల్స్ 200 4వి అడ్వెంచర్ బైక్‌లో అదనపు ఇంజన్ పవర్‌తో పాటు, లాంగ్ ఫ్రంట్ సస్పెన్షన్ మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు. దీని ఫ్యూయెల్ ట్యాంక్‌ పై '4V' స్టిక్కర్ కూడా కనిపిస్తుంది.

ఎక్స్‌పల్స్ 200 వినియోగదారుల కోసం ఎక్స్‌క్లాన్ రైడింగ్ క్లబ్‌ను ప్రారంభించిన హీరో మోటోకార్ప్

హీరో ఎక్స్‌పల్స్ 200 మూడు కొత్త డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో ఉంది. ఇందులో ట్రైల్ బ్లూ, బ్లిట్జ్ బ్లూ మరియు రెడ్ రైడ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఆఫ్-రోడ్ బైకింగ్ ఔత్సాహికుల కోసం కంపెనీ ఇప్పుడు 'ర్యాలీ కిట్' అనే కస్టమైజేషన్ కిట్ ను కూడా అందిస్తోంది. ఇందులో మాక్స్సిస్ ఆఫ్-రోడ్ టైర్లు, ముందు మరియు వెనుకవైపు ర్యాలీ-ట్యూన్డ్ సస్పెన్షన్, ఒక ఫ్లాట్ మరియు పొడవైన ర్యాలీ-స్టైల్ బెంచ్ సీటు, హ్యాండిల్‌బార్ రైసర్స్, లాంగ్ సైడ్ స్టాండ్ మరియు ఎక్స్‌టెండెడ్ గేర్ పెడల్ మొదలైనవి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, June 10, 2022, 17:08 [IST]
English summary
Hero motocorp launches xclan riding club for xpulse 200 owners details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+