హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎక్స్‌పల్స్ 200 4వి మోటార్‌సైకిలో ఓ లిమిటెడ్ ఎడిషన్ ర్యాలీ ఎడిషన్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Xpulse 200 4V Rally Edition) ధర రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కంపెనీ ఈ మోటార్‌సైకిల్ ను పరిమిత సంఖ్యలో మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. కొత్త Xpulse 200 4V ర్యాలీ ఎడిషన్ బుకింగ్‌లు జూన్ 22వ తేదీ మధ్యాహ్నం హీరో యొక్క eShop ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభమవుతాయి మరియు జూన్ 29వ తేదీ వరకు కొనసాగుతాయని కంపెనీ తెలిపింది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ స్పెసిఫికేషన్లు

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్, స్టాక్ మోడల్ మాదిరిగానే 199.6 సీసీ, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 18.9 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. కొత్త ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ ను డాకర్ వంటి ర్యాలీలలో ఉపయోగించే హీరో మోటార్‌స్పోర్ట్స్ ర్యాలీ మోటార్‌సైకిల్ నుండి ప్రేరణ పొందిందని హీరో పేర్కొంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

సాధారణ బైక్‌తో పోలిస్తే Xpulse 200 4V ర్యాలీ ఎడిషన్ సస్పెన్షన్ సెటప్‌ ను హీరో అప్‌గ్రేడ్ చేసింది. హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ 250 మిమీ ట్రావెల్‌ తో పొడవైన మరియు పూర్తిగా సర్దుబాటు చేయగల కార్ట్రిడ్జ్ ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంటుంది. అలాగే, వెనుక వైపు 220 మిమీ ట్రావెల్‌తో కూడిన పూర్తిగా సర్దుబాటు చేయగల 10-స్టెప్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ ముందు వైపు 21 ఇంచ్ మరియు వెనుక 18 ఇంచ్ స్పోక్డ్ వీల్స్‌ ను కలిగి ఉంటుంది మరియు వాటిపై డ్యూయల్-పర్పస్ టైర్లు అమర్చబడి ఉంటాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ 270 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ ను కలిగి ఉంటుంది మరియు దాని సీటు ఎత్తు భూమి నుండి 885 మిమీ ఎత్తులో ఉంటుంది. హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ యొక్క ట్రయల్ 116 మిమీకి విస్తరించబడింది. అయితే దీని వీల్‌బేస్ 1,426 మిమీ ట్రావెల్ తో స్టాండర్డ్ Xpulse 200 4V కంటే 16 మిమీ ఎక్కువగా ఉంటుంది. కాగా, ఈ ర్యాలీ ఎడిషన్ బరువు కేవలం 160 కిలోగ్రాములు మాత్రమే ఉంటుంది. దీని లైట్ వెయిట్ కారణంగా ఇది ఆఫ్-రోడ్ మరియు డర్ట్ ట్రాక్ లలో రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ చాలా సులభంగా ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ డిజైన్ మరియు ఫీచర్లు

కొత్త ర్యాలీ ఎడిషన్ మరియు స్టాండర్డ్ ఎక్స్‌పల్స్ 200 4వి డిజైన్‌ ల మధ్య వత్యాసాన్ని చూపేందుకు కంపెనీ ఇందులో ప్రత్యేకమైన ర్యాలీ కోడ్ గ్రాఫిక్స్‌ ను ఉపయోగించింది. హీరో మోటార్‌స్పోర్ట్స్ కోసం పోటీ పడుతున్న భారతదేశపు ప్రసిద్ధ ర్యాలీ రైడర్ సి ఎస్ సంతోష్ యొక్క ఆటోగ్రాఫ్‌ కూడా ఈ బైక్ పై ఉంటుంది. ఇందులో ఎల్ఈడి హెడ్‌లైట్లు మరియు టెయిల్ లైట్, అప్‌స్వేప్ట్ ఎగ్జాస్ట్, ఇంజన్‌ను రక్షించడానికి అల్యూమినియం స్కిడ్ ప్లేట్, గరిష్ట గ్రిప్ మరియు కంట్రోల్ కోసం టూత్డ్ బ్రేక్ పెడల్ మరియు ఎక్స్‌టెండెడ్ గేర్ లివర్ మరియు పొడవైన సైడ్ స్టాండ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్‌ లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు కాల్ అలర్ట్‌లతో కూడిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ ఇండికేటర్, ఎకో మోడ్ మరియు రెండు ట్రిప్ మీటర్లు మరియు సింగిల్ ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌ గా లభిస్తాయి.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్లు

కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ లాంచ్ గురించి హీరో మోటోకార్ప్ స్ట్రాటజీ మరియు గ్లోబల్ ప్రోడక్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ, "Hero Xpulse 200 దాని స్వంత ఒక లీగ్‌ను సృష్టించింది. సాహసికుడు తన స్వంత ట్రాక్‌ను తయారు చేయడం కోసం, సాంకేతికత మరియు పనితీరుతో ఎక్కడికైనా వెళ్ళడానికి ప్యాక్ చేయబడింది. ర్యాలీ ఎడిషన్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ర్యాలీ కిట్ ద్వారా అసాధారణమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను అందిస్తుంది మరియు మా డాకర్ మెషీన్‌లచే ప్రేరణ పొందిన ప్రత్యేకమైన డిజైన్‌తో పాటు అత్యుత్తమ రైడర్‌ల కోసం ట్యూన్ చేయబడింది. మీరు హీరో మోటార్‌స్పోర్ట్స్ నుండి ర్యాలీ రైడ్‌లో సంవత్సరాల తరబడి నేర్చుకోవాలనుకుంటే, ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ మీ కోసమే" అని అన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 19, 2022, 12:10 [IST]
English summary
Hero motocorp launches xpulse 200 4v rally edition price specs features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+