హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

మెగా పవర్‌స్టార్ 'రామ్ చరణ్' గురించి దాదాపు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మగధీర సినిమాతో భారతీయ చలనచిత్ర చరిత్రను తిరగరాసి, RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. అయితే ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్ 'రామ్ చరణ్' 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించబడ్డాడు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

ప్రపంచంలో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా కీర్తి పొందుతున్న 'హీరో మోటోకార్ప్'కి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో రామ్ చరణ్ నియమించబడ్డాడు. దీనికి సంబంధించిన ఎండార్స్‌మెంట్ ఒప్పందంపై చరణ్ సంతకం కూడా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

ఈ సమయంలో రామ్ చరణ్ హీరో గ్లామర్ బైక్ రైడ్ చేస్తున్న వీడియో కూడా ఒకటి విడుదలైంది. ఇందులో అతడు నెక్సస్ బ్లూ కలర్‌ గ్లామర్ XTEC బైక్ రైడ్ చేయడం చూడవచ్చు. రైడింగ్ చేస్తున్న సమయంలో ఈ బైక్ లోని ఫీచర్స్ గురించి చూపించడం కూడా ఇక్కడ గమనించవచ్చు.

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడిన సందర్భంగా.. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ 'రంజీవ్‌జిత్ సింగ్' మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రఖ్యాత నటుడిగా గుర్తింపు పొందిన రామ్ చరణ్‌తో అనుబంధంతో కంపెనీ మరింత ముందుకు వెళుతుంది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటైన గ్లామర్ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని తప్పకుండా సూచిస్తుంది.

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

అద్భుతమైన పనితీరుని అందించే హీరో గ్లామర్ XTEC ఇప్పుడు మరింత మంది యువతను ఆకర్షిస్తుందని అన్నారు. అదే సమయంలో ఈ పండుగ సీజన్ లో 125 సిసి సెగ్మెంట్ లో కొత్త మైలురాయిని కూడా సాధిస్తుందని భావిస్తున్నాము. రానున్న రోజుల్లో మరిన్ని టెలివిజన్ ప్రచారాలలో 'రామ్ చరణ్' తో మరింత లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మేము ఎదురు చూస్తున్నామన్నారు.

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

ఈ సందర్భంగా బ్రాండ్ అంబాసిడర్ 'రామ్ చరణ్' మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థతో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు హీరో మోటోకార్ప్ ఫ్యామిలీలో చేరి అందులో ఒకడిగా కావడం నిజంగానే చాలా ఆనందంగా ఉందన్నారు.

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

హీరో మోటోకార్ప్ యొక్క గ్లామర్ XTEC విషయానికి వస్తే, దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మాకాలు పొందుతున్న కంపెనీ బైకుల్లో ఇది ఒకటి. ఈ బైక్ 125 సిసి విభాగంలో మంచి ఆదరణ పొందుతోంది. ఈ పండుగ సీజన్ లో మరింత మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

కొత్త హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ బైక్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోసి బ్లాక్ మరియు మాట్టే యాక్సిస్ గ్రే కలర్స్. ఈ బైక్ ఇప్పుడు ఆధునిక ఫీచర్స్ అయిన బ్లూటూత్ కనెక్టివిటీతో సెగ్మెంట్ ఫస్ట్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో గూగుల్ మ్యాప్ కనెక్టివిటీతో కాల్ అలెర్ట్, ఎస్ఎంఎస్ అలెర్ట్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

హీరో గ్లామర్ ఎక్స్‌టెక్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 125 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్‌లో ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీ మరియు 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉపయోగించబడ్డాయి. కావున పనితీరులో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా 'కాల భైరవ' (రామ్ చరణ్).. ఇక అభిమానులకు పండగే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రపంచ ప్రసిద్ధి చెందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడిన హీరో 'రామ్ చరణ్' కి మా డ్రైవ్‌స్పార్క్ తరపున శుభాకాంక్షలు. ఇప్పుడు కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా పాన్ ఇండియా స్టార్ నియమయించబడటం వల్ల కంపెనీ యొక్క అమ్మకాలు ఈ పండుగ సీజన్ లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని వార్తలతో పాటు కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hero motocorp new brand ambassador rrr actor ram charan details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X