మళ్ళీ పెరిగనున్న హీరో మోటోకార్ప్ ధరలు.. సంవత్సరం చివరలోనూ తగ్గని ధరల సెగలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' మార్కెట్లో ఉత్తమైన బైకులు మరియు స్కూటర్లను విడుదల చేసిన మంచి అమ్మకాలతో ముందుకుసాగుతోంది. కంపెనీ యొక్క బైకులు మంచి మైలేజ్ అందిచడం వల్ల ఎక్కువ మంది మొదటి ఎంపికలో ఈ వాహనాలే ఉంటాయి.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 చివరి నెల మొదటి నుంచి అంటే డిసెంబర్ 01 నుంచి కంపెనీ యొక్క ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ ధరల పెరుగుదల ఈ సంవత్సరంలో ముచ్చటగా నాలుగవ సారి కావడం గమనార్హం. 2022 సెప్టెంబర్ నెలలో కంపెనీ తమ ద్విచక్ర వాహనాలపైన రూ. 1,000 ధరలను పెంచింది. ఇప్పుడు మరో సారి (2022 డిసెంబర్ 01) రూ. 1,500 పెంచనుంది.

మళ్ళీ పెరిగనున్న హీరో మోటోకార్ప్ ధరలు

పెరుగుతున్న ఇన్‌పుట్ ధరల కారణంగానే కంపెనీ యొక్క ఉత్పత్తుల మీద ధరలను పెంచవలసి వస్తోందని 'హీరో మోటోకార్ప్' తెలిపింది. కంపెనీ ప్రస్తుతం స్కూటర్ విభాగంలో హీరో ప్లెజర్+ XTEC, డెస్టిని 125 XTEC, మాస్ట్రో ఎడ్జ్ 125 మరియు మాస్ట్రో ఎడ్జ్ 110 వంటి వాటిని విక్రయిస్తోంది. పెరిగిన ధరలు ప్రస్తుతం HF డీలక్స్, స్ప్లెండర్, ప్లెజర్ మొదలైన ఎంట్రీ-లెవల్ మోడల్‌లపై కూడా ప్రభావం చూపుతుంది.

మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో కంపెనీ మూడు విభాగాల్లో విక్రయిస్తోంది. మొదటిది Xtreme 160R, Xtreme 200S, XPulse 200 4V మరియు XPulse 200T వంటి బైక్‌లు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ విభాగంలో గ్లామర్ ఎక్స్‌టెక్, ప్యాషన్ ఎక్స్‌టెక్, సూపర్ స్ప్లెండర్, గ్లామర్, గ్లామర్ కాన్వాస్ మరియు ప్యాషన్ ప్రో వంటి బైక్‌లు ఉన్నాయి. ఎంట్రీ-లెవల్ ప్రాక్టికల్ విభాగంలో, కంపెనీ స్ప్లెండర్+, స్ప్లెండర్+ Xtec, HF డీలక్స్ మరియు HF100 బైక్‌లను విక్రయిస్తోంది.

పెరిగిన ధరలు కొనుగోలుదారులపైనా పడకుండా ఉండటానికి కంపెనీ ఫైనాన్సింగ్ ఎంపికలను కూడా అందిస్తుంది. దీని ద్వారా కంపెనీ యొక్క బైకులను తక్కువ డౌన్ పేమెంట్ తో కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ధరల పెరుగుదల కొనుగోలుదారుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది, ఇది అమ్మకాలపైన ప్రభావం చూపే అవకాశం ఉందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. గతంలో చాలా కంపెనీలు తమ వాహన ధరలను కూడా పెంచడం జరిగింది.

ఇదిలా ఉండగా ఇటీవల హీరో మోటోకార్ప్ ఇటీవల 'హీరో విడా' ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 'వి1 ప్రో' మరియు 'వి1 ప్లస్' . వీటి ధరలు రూ. 1.59 లక్షలు మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆసక్తికలిగిన కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు డిసెంబర్ రెండవ వారం నుంచి ప్రారంభమవుతాయి.

హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్లలో కంపెనీ రిమూవబుల్ బ్యాటరీ ఉపయోగించింది. ఇది పూర్తిగా కంపెనీ తయారు చేసినట్లు తెలుస్తోంది, అయితే రెండు వేరియంట్స్ అందించే పరిధి ఒకేలా ఉండదు. కావున విడా వి1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఇక విడా వి1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవతం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి రేంజ్ అందిస్తాయని స్పష్టమవుతోంది.

Most Read Articles

English summary
Hero motocorp to hike price by rs 1500 from 2022 december
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X