హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

భారతదేశపు నెంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) అందిస్తున్న అడ్వెంచర్ మోటార్‌సైకిల్ హీరో ఎక్స్‌పల్స్ 200 4వి (Hero Xpulse 200 4V) మోడల్‌లో ఓ ర్యాలీ ఎడిషన్ (Rally Edition) ను విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ర్యాలీ ఎడిషన్ యొక్క టైప్-అప్రూవల్ సర్టిఫికేట్ ఆన్‌లైన్‌లో లీక్ చేయబడింది మరియు ఇది రాబోయే అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన అనేక రకాల సమాచారాన్ని వెల్లడిస్తోంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ మార్కెట్లో ప్రారంభించినప్పు ఇది ఎక్స్‌పల్స్ సిరీస్‌ లోనే రేంజ్-టాపింగ్ వేరియంట్‌ గా ఉండే అవకాశం ఉంది. ర్యాలీ ఎడిషన్ సాధారణ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కన్నా చాలా భిన్నంగా ఉండబోతోంది. పేరుకి తగినట్లుగా కంపెనీ ఈ మోడల్ ను ప్రత్యేకించి బైక్ ర్యాలీ రేసుల కోసం డిజైన్ చేసింది. లైట్ వెయిట్ డిజైన్, అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, పెద్ద నాబీ టైర్స్, ఎత్తులో ఉండే సైలెన్సర్, సింగిల్ పీస్ సీట్, సన్నటి బాడీ డిజైన్, అతి తక్కువ బాడీ ప్యానెల్స్ వంటి అనేక ఆఫ్-రోడ్ ర్యాలీ ఎడిషన్ డిజైన్ ఎలిమెంట్స్‌ తో ఇది రూపొందించబడింది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

హీరో మోటోకార్ప్ ఇటీవలే తమ ఎక్స్‌పల్స్ 200 4వి అడ్వెంచర్ మోటార్‌సైకిల్ కోసం ర్యాలీ కిట్‌ ను పరిచయం చేసింది మరియు విడుదల సమయంలో ఈ ప్రత్యేక కిట్ ను రూ.46,000 ధరో విక్రయించారు. ఈ కిట్ ఖరీదైనదే అయినప్పటికీ, స్టాండర్డ్ ఎక్స్‌పల్స్200 4వి మోటార్‌సైకిల్‌ను ఇది మరింత ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీగా మార్చడానికి కొన్ని అదనపు బిట్‌లను జోడిస్తుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

ఈ ర్యాలీ కిట్‌లో భాగంగా Maxxis ఆఫ్-రోడ్ టైర్లు, ముందు మరియు వెనుక వైపున ర్యాలీ-ట్యూన్డ్ సస్పెన్షన్, ఫ్లాట్ మరియు పొడవైన ర్యాలీ-స్టైల్ బెంచ్ సీట్, హ్యాండిల్‌బార్ రైజర్‌లు, పొడవాటి సైడ్ స్టాండ్ మరియు విస్తరించిన గేర్ పెడల్ వంటి అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ర్యాలీ కిట్‌లో భాగంగా చేసిన ఈ విస్తృతమైన మార్పుల కారణంగా Hero Xpulse 200 4V యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పుడు 275 మిమీకి పెరుగుతుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

ఈ నేపథ్యంలో, రాబోయే కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్‌లో కూడా ఇలాంటి మార్పులే ఉంటాయని మేము ఆశిస్తున్నాము. అయితే, Maxxis ఆఫ్-రోడ్ టైర్ల వంటి పై భాగాలలో కొన్ని 'కిట్‌లు'గా రిజర్వ్ చేయబడవచ్చు. లీక్ అయిన పత్రాల ప్రకారం, రాబోయే Hero Xpulse 200 4V Rally Edition పొడవు 2,255 మిమీ, ఎత్తు 850 మిమీ మరియు వీల్‌బేస్ 1,427 మిమీగా ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి బైక్ విషయానికి వస్తే, మోటోక్రాస్ రైడర్‌గా మారాలని ఆకాంక్షించే దేశంలోని చాలా మంది యువతకు ఈ బైక్ మొదటి ఎంపికగా మారింది. ఈ బైక్ లో 18.83 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 200సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది హీరో ఎక్స్‌పల్స్ 200 2వి బైక్ తో పోలిస్తే 6 శాతం ఎక్కువ శక్తిని మరియు 5 శాతం ఎక్కువ టార్క్‌ ను విడుదల చేస్తుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

పోల్చి చూస్తే, Hero Xpulse 200 దాని 199.6cc, సింగిల్-సిలిండర్, 2-వాల్వ్ ఇంజన్ 17 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 16.45 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. హార్డ్‌వేర్ విషయానికి వస్తే, స్టాండర్డ్ హీరో ఎక్స్‌పల్స్ 200 4వి మెరుగైన హీట్ మేనేజ్‌మెంట్ కోసం 7-ఫిన్ ఆయిల్ కూలర్‌తో వస్తుంది మరియు కొత్త ఇంజన్ లక్షణాలకు సరిపోయే ఆప్టిమైజ్ చేసిన గేర్ రేషియోలతో అప్‌డేట్ చేయబడిన ట్రాన్స్‌మిషన్‌ ను కూడా కలిగి ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

ఇందులోని కొత్త ఎల్ఈడి హెడ్‌లైట్‌లు రాత్రి వేళల్లో మెరుగైన దృశ్యమానతను (విజిబిలిటీని) అందిస్తాయి. వీటితో పాటుగా కొత్త హీరో ఎక్స్‌పల్స్ 200 4వి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఎకో మోడ్, రెండు ట్రిప్ మీటర్లతో కూడిన పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ మరియు సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం సింగిల్-ఛానల్ ఏబిఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్ (Hero Xpulse 200 4V Rally Edition) వస్తోంది.. డీటేల్స్ లీక్!

సస్పెన్షన్ విషయానికి వస్తే, హీరో ఎక్స్‌పల్స్ 200 4వి 190 మిమీ ట్రావెల్‌తో కూడిన 37 మిమీ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపున 170 మిమీ వీల్ ట్రావెల్‌తో కూడిన 10-స్టెప్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనో-షాక్‌ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ పరంగా చూస్తే, హీరో ఎక్స్‌పల్స్ 200 4వి మోటార్‌సైకిల్ ముందు వైపున 276 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపున 220 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ప్రస్తుతం, మార్కెట్లో కొత్త Hero Xpulse 200 4V ధర రూ. 1.32 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా Hero Xpulse 200 ధర రూ. 1.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి.

Most Read Articles

English summary
Hero motocorp to launch xpulse 200 4v rally edition soon details leaked online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X